WordPress tutorial for beginners pdf | WordPress tutorial for beginners in Telegu

WordPress tutorial for beginners pdf | WordPress tutorial for beginners in Telegu

Spread the love

WordPress tutorial for beginners pdf | WordPress tutorial for beginners in Telegu:

WordPress tutorial for beginners Pdf:ఇంటర్నెట్‌లో ప్రతి రోజు కోట్ల సంఖ్యలో వెబ్‌సైట్లు తయారవుతున్నాయి. బిజినెస్, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, న్యూస్, బ్లాగింగ్, ఈ-కామర్స్, పోర్ట్‌ఫోలియో ఇలా ఏ రంగం చూసినా ఇప్పుడు వెబ్సైట్ లేకుండ బిజినెస్ అభిరుద్ది చెందదు..బిజినెస్ develop అవ్వదు. వెబ్సైట్ అనేది బిజినెస్ ని పెంచే శక్తివంతమైన టూల్ అలాగే వెబ్సైట్ ద్వారా ఏదయినా సమాసారం పంచుకోవచ్చు.https://amzn.to/465zT3a 

ఇప్పటి డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ లేకుండా ఒక రోజు గడపడం చాల కష్టం.ఇంటర్నెట్ లేకపోతె ఏదోకొలిపోయిన భావన లో ఉంటాం. మనం ప్రతిరోజూ Google, YouTube, Facebook, Amazon లాంటి ఎన్నో వెబ్‌సైట్లు వాడుతున్నాం. వెబ్సైట్ అనేది నేటి కాలంలో వ్యక్తులు, కంపెనీలు, ప్రభుత్వాలు అందరూ వాడే డిజిటల్ వేదిక.కాబట్టి, మీకు స్వంతంగా ఒక Website కానీ బ్లాగ్ కానీ  ఉండటం నేటి ప్రపంచంలో చాలా అవసరం.

WordPress Website ఎందుకు ఎంచుకోవాలి?

WordPress అనేది ఒక CMS (Content Management System). దీని ద్వారా ఎవరైనా “website లేదా blog ” ఈజీగా తయారు చేయవచ్చు. దీనికి coding knowledge అవసరం లేదు. WordPress‌లో themes, plugins వాడి మీకు నచ్చిన వెబ్‌సైట్ డిజైన్ చేయవచ్చు. “వెబ్‌సైట్‌ని ఎలా తయారు చేయాలి?”, “కోడింగ్ తెలియకపోతే వెబ్‌సైట్ ఎలా సృష్టించాలి?” అనే ఆలోసించేవారికి WordPress అనేది ఒక బెస్ట్ platform.

WordPress అనేది ఒక powerful & user-friendly platform. మీరు బ్లాగ్, బిజినెస్, ఈ–కామర్స్ ఏదైనా వెబ్‌సైట్ చాలా సులభంగా క్రియేట్ చేయవచ్చు. WordPress Website అనేది నేటి కాలంలో అత్యంత సులభమైన, తక్కువ ఖర్చుతో, ప్రొఫెషనల్ వెబ్‌సైట్ నిర్మాణం చేసే ఉత్తమ మార్గం.మీకు బ్లాగ్ ప్రారంభించాలన్నా, బిజినెస్ వెబ్‌సైట్ సృష్టించాలన్నా, ఆన్‌లైన్ స్టోర్ లాంచ్ చేయాలన్నా WordPress సరైన పరిష్కారం….. సింపుల్ మరియు పవర్‌ఫుల్ సొల్యూషన్ అందిస్తుంది.ఇప్పటి డిజిటల్ యుగంలో WordPress అనేది ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన Website Building Platform.ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెబ్‌సైట్లలో దాదాపు 43% Websites WordPress ద్వారా నిర్మించబడ్డాయి.

WordPress history :

WordPress అనేది ఒక Open Source Content Management System (CMS). దీని ద్వారా వెబ్ డెవలప్‌మెంట్‌లో కోడింగ్ ఎక్కువగా తెలియకపోయినా సులభంగా వెబ్‌సైట్లు రూపొందించవచ్చు.ఇది PHP అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మరియు MySQL Database పై ఆధారపడి పనిచేస్తుంది.2003లో Matt Mullenweg మరియు Mike Little అనే ఇద్దరు డెవలపర్లు WordPress‌ను ప్రారంభించారు.అప్పట్లో బ్లాగింగ్ కోసం వాడే b2/cafe log అనే ప్లాట్‌ఫారమ్ నిలిచిపోయింది.దానిని ఆధారంగా తీసుకొని WordPress అనే కొత్త Open Source Blogging Tool రూపుదిద్దుకుంది.

మొదట ఇది బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ మాత్రమే, కానీ ఇప్పుడు ఇది పూర్తి స్థాయి వెబ్‌సైట్ బిల్డర్ గా మారిపోయింది.WordPress 2003లో ఒక బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్గా మొదలై, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత శక్తివంతమైన Website CMSగా ఎదిగింది.బ్లాగ్స్ నుండి ఈ-కామర్స్ స్టోర్స్ వరకు, న్యూస్ పోర్టల్స్ నుండి లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్స్ వరకు – అన్నింటినీ WordPressతోనే నిర్మిస్తున్నారు.అందుకే WordPressను చాలామంది “Internet లో Websitesకి Backbone” అని పిలుస్తారు.

WordPress లోనే website డిజైన్ ఎందుకు :

Open Source – ఎవరైనా ఉచితంగా వాడుకోవచ్చు.

Community Support – ప్రపంచవ్యాప్తంగా వేలమంది Developers సహకారం.

Thousands of Themes & Plugins – customization సులభం.

User Friendly – కోడింగ్ తెలియకపోయినా వాడుకోవచ్చు.

SEO Friendly – Googleలో సులభంగా Rank అవుతుంది.

WordPress website ఎవరకి ఉపయోగం:

website నేర్చికుంటే jobs కి use అవుతుంది అలాగే freelancer work చేసికోవచ్చు…startup పెట్టవచ్చు…work from home చేసికోవచ్చు…ఇది ఒక skill. ఈ skill ని two weeks లోనేర్చికోవచ్చు… ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి వెబ్సైట్ అనేది ముఖ్యం అయిపొయింది. small బిజినెస్ చేసేవారికి….మీడియం బిసినెస్ చేసేవారికి…companies కి personal use కి బ్లాగర్స్ కి …..website అంటే అది మన brand.

important words:

ప్రతి వెబ్సైటు కి ఒక IP address. దీనిని international protocol అంటారు.

https: వీటిని transfer protocol అంటారు    

DNS: domain name system 

WWW : World wide web

CMS : Content management system

WEBSITE : Domain + hosting

WordPress website డిజైన్ కి కావలసినవి:

website డిజైన్ చేసికోవడాని మనకు కొన్ని ముడుసరుకులు అవసరమై అవి ఏంటి అంటే 1.Domain 2.Hosting 3.software 4.plugin 5.theme 6.pages  7.menus 8. customize  వీటిలో ముందుగా 

what is domain?

domain అంటే name of the website…website name ని డొమైన్ అంటారు(like sim card). domain ని ఎప్పటికి అప్పుడు రెన్యువల్ చేసికోవాలి(ప్రతి one year కి).లేదంటే వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. డొమైన్ లో కూడా Simard లా famous name కావాలంటే కొనాలి.

domain service providers :

GoDaddy…Bluehost…HostGator…big rock…host Inger….webspace kit….ఇలా చాలనే వున్నాయ్ కానీ బాగా పాపులర్ అయినవి నేను చెప్పినవి. 

HOSTING అంటే ఏమిటి?

hosting అంటే name of the server or space in a server  (like phone ). మన కంపెనీ details…మన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇందులో సేవ్ అవుతుంది. 

software అంటే ఏమిటి?

ఇందులో software అంటే WordPress (CMS : Content management system). website డిజైన్ కి చాల famous software.

THEME అంటే ఏమిటి ?

థీమ్ అంటే ఒక template అని అర్ధం. website డిజైన్ మొత్తం ఈ theme పైన ఆధారపడుతుంది. themes అనేవి ముందుగానే  డిజైన్ చేసివుంటాయ్. మన website కి కావలసిన theme ని సెలెక్ట్ చేసికోవాలి. వాటిని మనం website రూపం లో modify చేసికోవచ్చు.WordPress Themes చాలా వరకు Responsive గా ఉంటాయి. అంటే Mobile, Tablet, Desktop అన్నింటిలోనూ సరిగ్గా కనిపిస్తాయి.

  • WordPressలో లక్షల సంఖ్యలో Free & Premium Themes అందుబాటులో ఉన్నాయి.

  • ఒక్క క్లిక్‌తో వెబ్‌సైట్ డిజైన్ మార్చుకోవచ్చు.

plugins: 

  వీటిని కూడా software అంటారు. website డిజైన్ చేయాలి అన్న, SEO  చేయాలన్న. google ads చేయాలి అన్న…SMM  చేయాలి అన్న…email marketing చేయాలిఅన్న.ప్రతి వాటికీ plugin అవసరము ఉంటుంది.WordPress తరచూ Updates విడుదల చేస్తుంది. Security plugins ఉపయోగించి హ్యాకింగ్ నుండి వెబ్‌సైట్‌ను కాపాడుకోవచ్చు.

pages :

ప్రతి ఒక్క వెబ్సైటు కి pages అనేవి వుంటాయి. అవి home, about us, contact us, services…..

customize:

మనకు నచ్చినట్లు మన website ని డిజైన్ చేసికోవడం.

 WordPress యొక్క రకాలు| WordPress tutorial for beginners Pdf:

WordPress రెండు ప్రధాన రూపాల్లో లభిస్తుంది:

 WordPress.com:

ఇది ఒక Hosted Platform.మీరు WordPress.com లో సైన్ అప్ చేస్తే, వెబ్‌సైట్ WordPress సర్వర్‌లలోనే హోస్ట్ అవుతుంది.ఉచితంగా వాడుకోవచ్చు కానీ లిమిటేషన్స్ ఎక్కువగా ఉంటాయి. (ఉదాహరణకు: custom themes, plugins వాడలేరు).Beginners లేదా simple blogging కోసం బాగుంటుంది.

 WordPress.org (Self Hosted WordPress):

ఇది Self-hosted CMS, అంటే మీరు మీకు నచ్చిన Hosting + Domain కొనుగోలు చేసి WordPress‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి.పూర్తి ఫ్రీడమ్ ఉంటుంది.మీరు మీకు కావాల్సిన Themes, Plugins, Custom Design అన్నీ యాడ్ చేసుకోవచ్చు.ప్రొఫెషనల్ వెబ్‌సైట్లు, బిజినెస్, ఈ-కామర్స్ కోసం ఎక్కువగా వాడేది ఇదే.

 SEO Friendly | WordPress tutorial for beginners Pdf;

WordPress SEOకి చాలా అనుకూలం. Googleలో ర్యాంక్ అవ్వడానికి అవసరమైన SEO ప్లగిన్స్ (Yoast, Rank Math) సపోర్ట్ చేస్తుంది.

 Mobile Responsive:

WordPress Themes చాలా వరకు Responsive గా ఉంటాయి. అంటే Mobile, Tablet, Desktop అన్నింటిలోనూ సరిగ్గా కనిపిస్తాయి.

WordPressలో తయారు చేయగలిగే వెబ్‌సైట్లు:

WordPressలో ఏ రకమైన వెబ్‌సైట్ అయినా డిజైన్ చేయవచ్చు.

  1. Blog Website

    • వ్యక్తిగత బ్లాగ్స్, ట్రావెల్ బ్లాగ్స్, కుకింగ్ బ్లాగ్స్ మొదలైనవి.

  2. Business Website

    • కంపెనీలు, స్టార్టప్‌లు, షాపులు తమ బిజినెస్ ప్రమోషన్‌కి.

  3. E-commerce Website

    • WooCommerce plugin ఉపయోగించి Online Store లాగా మార్చుకోవచ్చు.

  4. News & Magazine Websites

    • న్యూస్ పోర్టల్స్, ఆన్‌లైన్ మాగజైన్స్.

  5. Portfolio Website

    • ఫోటోగ్రాఫర్లు, డిజైనర్లు, ఫ్రీలాన్సర్స్ తమ వర్క్ చూపించడానికి.

  6. Educational Websites

    • ఆన్‌లైన్ కోర్సులు, LMS (Learning Management System) వెబ్‌సైట్లు.

  7. Membership Websites

    • Paid Community, Subscription ఆధారంగా సైట్.

digitaldasaradh.com/Digital Marketing Executive in Vizag |Best Digital Marketing Services in Vizag
digitaldasaradh.com/Digital Marketing Executive in Vizag |Best Digital Marketing Services in Vizag

 WordPress వాడటం వల్ల కలిగే ప్రయోజనాలు:

  1. Free & Open Source – సాఫ్ట్‌వేర్ పూర్తిగా ఉచితం.

  2. Easy to Learn & Use – ఎవరికైనా త్వరగా నేర్చుకోవచ్చు.

  3. Flexible & Customizable – Themes, Plugins ద్వారా అవసరాలకు తగ్గట్టు మార్చుకోవచ్చు.

  4. SEO Friendly – Googleలో బాగా ర్యాంక్ అవుతుంది.

  5. Mobile Friendly – అన్ని డివైజెస్‌లో బాగా కనిపిస్తుంది.

  6. Community Support – పెద్ద WordPress Community ఉంది. సమస్యలు వస్తే సపోర్ట్ లభిస్తుంది.

  7. Low Cost Development – WordPress వాడటం వల్ల వెబ్‌సైట్ డెవలప్‌మెంట్ ఖర్చు తగ్గుతుంది.


 WordPress నష్టాలు (Limitations):

  1. Security Issues – ఎక్కువగా వాడే CMS కావడం వల్ల Hackers టార్గెట్ చేస్తారు. కానీ సరైన ప్లగిన్స్ వాడితే సేఫ్.

  2. Speed Issues – ఎక్కువ Plugins వాడితే సైట్ Slow అవుతుంది.

  3. Customization Limits – Advanced customization కోసం కొంత కోడింగ్ తెలిసి ఉండాలి.

  4. Frequent Updates – తరచూ Updates రావడం వల్ల Maintenance అవసరం.


WordPress Website ఉదాహరణలు;

ప్రపంచంలోని చాలా పెద్ద కంపెనీలు కూడా WordPressనే వాడుతున్నాయి.

  • TechCrunch

  • BBC America

  • Sony Music

  • The Walt Disney Company Blogs

  • Microsoft News

ఇవి చూసినప్పుడు WordPress యొక్క పవర్ అర్థమవుతుంది.

WordPress vs Traditional Website Development

అంశం WordPress Website Traditional Website (Coding)
Ease of Use కోడింగ్ అవసరం లేదు HTML, CSS, JS, PHP తప్పనిసరి
Time కొన్ని గంటల్లో రెడీ రోజులు లేదా నెలలు పడుతుంది
Cost తక్కువ ఎక్కువ
Flexibility Themes & Plugins ద్వారా Full Custom Coding అవసరం
SEO In-built SEO Tools Manual SEO చేయాలి
Updates తరచూ వస్తాయి డెవలపర్ చేయాలి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *