Google AdWords Tutorial for Beginners in Telugu | Google Ads Guide 2025:
google AdWords tutorial for beginners : google ads అనేది(paid advertisement) Googleలో పేమెంట్ ద్వారా చేసే ప్రకటనల ప్లాట్‌ఫారమ్.ppc అంటే మీరు వేసిన ప్రకటనపై కస్టమర్ ఒక్కసారి క్లిక్ చేసినప్పుడు మాత్రమే డబ్బు చెల్లించాలి.SEOలా టైమ్ తీసుకోకుండా, వెంటనే ఫలితాలు వస్తాయి.కీవర్డ్స్, లొకేషన్, వయసు, ఆసక్తుల ఆధారంగా కస్టమర్లను టార్గెట్ చేయవచ్చు.మీరు పెట్టే ఖర్చును మీరు కంట్రోల్ చేసుకోవచ్చు.ఎంత మంది క్లిక్ చేశారు, ఎంతమంది కొనుగోలు చేశారు అన్నది ట్రాక్ చేయవచ్చు.తక్కువ సమయంలో ఎక్కువ లీడ్స్ వస్తాయ్.ROI (Return on Investment) క్లియర్‌గా తెలుస్తుంది.చిన్న వ్యాపారాలు కూడా పెద్ద బ్రాండ్లా కస్టమర్లను చేరుకోవచ్చు.తక్కువ ఖర్చుతో ఎక్కువ లీడ్స్ సంపాదించవచ్చు.Sales Conversion పెంచుకోవచ్చు.https://amzn.to/4nimYRu
google ads ఎందుకు ప్రసిద్ధి :
గూగుల్ AdWords ని google ads అంటారు. online advertisement కి google ads చాల ప్రసిద్ధి చెందింది. ఎందుకు అంటే యాడ్ అనేది ఎవరకి అవసరమో వాళ్ళకి మాత్రమే యాడ్ display అవుతుంది.SEO అనేది organic ట్రాఫిక్ ని ఇస్తుంది (4to 6months కి result వస్తుంది). అదే గూగుల్ యాడ్స్ అనేవి paid కాబట్టి result అనేవి 2 to 3months లో వస్తుంది. google కీ google ads నుంచి ఎక్కువ revenue వస్తుంది.ఈ రోజుల్లో డిజిటల్ మార్కెటింగ్ అనేది వ్యాపారాలకు ప్రాణం లాంటిది. వెబ్సైట్, బ్లాగ్, యూట్యూబ్ ఛానల్, మొబైల్ యాప్ – ఏదైనా ప్రమోట్ చేయాలంటే Google Ads (Google AdWords) చాలా పవర్ఫుల్ టూల్.Google AdWords అనేది “Google 2000″లో లాంచ్ చేసిన పెయిడ్ అడ్వర్టైజింగ్ ప్లాట్‌ఫాం.2018లో దీని పేరు Google Adsగా మార్చబడింది.
traditional advertisement:
papers, radio, tv, bill boards, pamphlets…వీటి అన్నిటిలో ads చూసేవాళ్ళము.ఈ traditional advertisement లో మైనస్ ఏంటి అంటే యాడ్ అనేది ఎంత మంది చూసారు,ఎంత లాభం వచ్చింది.వీటివల్ల లాభం… ఎంత నష్టం ఎంత అని analysis చేయడం కష్టం.ఇవేవి owners కి తెలిసేది కావు.
Digital advertising:
text ads, images. videos…banners ads ,blogs….అదే డిజిటల్ advertising లో ఎంత ROI (Return of investment)వచ్చింది అనేది ఈజీ గా analysis చేయవచ్చు. కొన్ని బిసినెస్ లకి “online market” అనేది oxygen లాంటిది.ex: Swiggy…Zomato …. amazon …
Note:
మన బిసినెస్ develop అవ్వాలంటే ఈ రెండు advertisement లు ముఖ్యమే.
SERP:(search engine result page )
keyword search చేసినప్పుడు result page అనేది వస్తుంది.వాటినే SERP అంటారు. ఈ SERP లేఔట్ లో top లో 4ads అలాగే bottom లో 3ads ఉంటాయి(ఇవీ google ads).ఈ మధ్యలో ఉన్నవి ఆర్గానిక్ యాడ్స్ 10యాడ్స్ ఉంటాయి(SEO ADS ). అందుకే ఎంతమంది బిడ్డింగ్ లో పాల్గున్న 7 గురు మాత్రమే pass అవుతారు(select అవుతారు).
google coupon process :
కొత్తగా గూగుల్ యాడ్స్ రన్ చేసేటప్పుడు గూగుల్ వారు ఒక కూపన్ provide చేస్తారు. అది ఎలా అంటే మనం 10000rs యాడ్స్ రన్ చేస్తే గూగుల్ వారు అదనంగా 10000rs యాడ్స్ కి ఇస్తారు. మనం google యాడ్స్ మేనేజర్ లో మన Gmail తో లాగిన్ అయినా వెంటనే మన మెయిల్ కి వస్తుంది.terms and conditions బాగా చదవాలి అర్ధము చేసికోవాలి.బయట coupons అమ్ముతుంటారు వాటికీ నమ్మకండి.
Google Ads Advantages:
website ని tropic తీసికొని రావడానికి చాల methods వున్నాయ్. ads run చేయడానికి చాల టూల్స్ (platforms ex: yahoo…Bing…మనకి తెలియని చాల networks వున్నాయ్) వున్నాయ్. కానీ గూగులే ఎందుకు పాపులర్ అయ్యింది లేదా యాడ్స్ అనగానే “google ads” నే గుర్తుకు వస్తాయ్ ఎందుకు అంటే.peoples internet లో ఎక్కువ వాడే search engine గూగుల్.ప్రపంచంలో 80to 85% మంది గూగుల్ వాడుతున్నారు. వెంటనే ఫలితాలు వస్తాయి.Target Audience సరిగ్గా రీచ్ అవుతుంది.చిన్న వ్యాపారాలకైనా సరిపోతుంది.ROI Measure చేయొచ్చు.
mazer benefits:(google ads =google AdWords):
*targeted *measurable *active
High intent: peoples intension మనకు తెలుస్తుంది.అది ఎలా అంటే peoples google లో church చేసి information మరియు వారి interest చెప్తారు కాబట్టి.
RESPONISIVE: ఎవరుఅయితే church చేస్తారో వారికీ immediately వెంటనే యాడ్ చూపించవచ్చు.
TARGETED: location, language, device ,intent ….ఇలా వారు ఇచ్చే information బట్టి టార్గెట్ చేయవచ్చు .
PROFITBLE : మనం పెట్టిన పెట్టుబడికి ఎంత లాభం వస్తుంది(ROI =return of investment ) అనేది తెలిసికోవచ్చు.
IMPRESSION : మన ad కనిపించడాన్ని impression అంటారు.
google ads ఎందుకు work అవ్వదు:
చాల మంది గూగుల్ యాడ్స్ రన్ చేసేవారు చెప్పే మాట మాకు result రాలేదు అని.వాటికీ కారణాలు ఏంటి అంటే * గూగుల్ యాడ్స్ ప్రోపర్ గా నేర్చికోకపోవడమే(experience అవసరం ) .*ఇవి ఒక ఒక సారి లాంగ్ టర్మ్ results నీ ఇస్తాయి(ఓపిక ఉండాలి).* website కానీ landing page కానీ ఉండదు(వీటిపైనా focus పెట్టరు).* keyword Research(keyword చాల important) ప్రోపర్ గా తెలియకపోవడం.* ad డిజైన్ అనేది క్రియేటివ్ గా ఉండాలి. google ads “inter face” అనేది ఎప్పటికి అప్పుడు మారుతూవుంటుంది కాబట్టి ఎప్పటికిఅప్పుడు తెలిసికోకపోవడం.
Google Ads Limitations:google AdWords tutorial for beginners
మనం ads run చేసినప్పుడు google వారు ఒక సలహా అడుగుతారు.మీము మీకు సహాయం చేయవచ్చా అని మనకు డౌట్ వున్నా చెప్తారు (గూగుల్ express ద్వారా ). వాళ్ళ help తో కూడా ad run చేయవచ్చు. కానీ amount ఎక్కువ ఖర్చు అవుతుంది.ఎందుకుఅంటే వారికీ కావలిసినది డబ్బులు.google కి google ads ద్వారా ఎక్కువ డబ్బులు వస్తాయ్ కాబట్టి. google వారు అవసరం లేని options కూడా చెప్తారు కాబట్టి బడ్జెట్ అనేది ఎక్కువ అవుతుంది.అదే మనకు మనం నేర్చికొని పట్టుసాధిస్తే బడ్జెట్ తక్కువ అవుతుంది.బడ్జెట్ లేకుండా ఎక్కువ రోజులు రన్ చేయలేము.Competition ఎక్కువైతే CPC ఎక్కువ అవుతుంది.Proper Strategy లేకుంటే డబ్బు వృథా అవుతుంది.
Google Adsలో Keyword Match Types
-
Broad Match – మీ కీవర్డ్‌కి సంబంధించిన అన్ని సెర్చ్‌లలో యాడ్ వస్తుంది.సింగల్ word match అయినా relevant keyword వున్నా ad వస్తుంది.ఇది పెద్ద పెద్ద కంపెనీస్ వారికి బాగుంటుంది.small business వారు కి డబ్బులు పోతాయ్.
-
Phrase Match (” “) – ఒక word(phrase) miss అయినా యాడ్ రాదు.small బిజినెస్ వారికీ ఇది better.
-
Exact Match ([ ]) – యూజర్ అదే పదం టైప్ చేస్తే మాత్రమే యాడ్ వస్తుంది.ఇది కూడా small బిజినెస్ వారికీ చాల better.
-
Negative Keywords – మీరు యాడ్ కనిపించకూడదనుకున్న పదాలు.
Quality Score అంటే ఏమిటి?
Google మీ యాడ్‌ని relevance, CTR (Click Through Rate), Landing Page Quality ఆధారంగా ఒక Quality Score (1-10) ఇస్తుంది.Quality Score ఎక్కువ ఉంటే, మీ యాడ్‌కి తక్కువ CPC వస్తుంది.
ad rank: ad rank defend on CPC(max CPC *quality score=ad rank)
Google Ads Budget & Bidding Strategies:
గూగుల్ అనేది auction/bidding నిర్వహిస్తుంది(రన్ చేస్తుంది).బిడ్డింగ్ అనేది every mini…every hour…every day ..ఉంటుంది.అందుకే ఎప్పటికి అప్పుడు ప్లేస్ లు మారిపోతాయి,ఏది పెర్మనెంట్ కాదు. గూగుల్ యాడ్స్ “closed bidding” పైన ఆధారపడి పనిచేస్తుంది. అందుకే ఎంతమంది బిడ్డింగ్ లో పాల్గున్న 7 గురు మాత్రమే pass అవుతారు(select అవుతారు).auction అనేది automatic గా జరుగుతుంది.ఒక keyword కి చాల కంపెనీస్ పోటీపడతాయ్.bidding లో ఎవరు గెలిస్తే వారే యాడ్ కనిపిస్తుంది.
google ads pricing models:
-
CPC (Cost Per Click) – ఒక్క క్లిక్కి మీరు చెల్లించే రేట్.text ad కి ఉపయోగిస్తారు.
-
CPM (Cost Per 1000 Impressions) – 1000 యాడ్ ఇంప్రెషన్స్కి చెల్లింపు.display యాడ్స్ కి వాడుతారు.
-
CPA (Cost Per Acquisition) – ఒక Conversion (Lead/Sale)కి అయ్యే ఖర్చు.shopping యాడ్స్ కి వాడుతారు.
- CPI =cost per installation- mobile app installation
- CPV =cost per view_యూట్యూబ్ వీడియోస్ కోసం
Google Adsలో ROI ఎలా పెంచుకోవాలి?
-
సరైన కీవర్డ్స్ ఎంచుకోండి.
-
Ad Copies ఆకర్షణీయంగా ఉండాలి.
-
Landing Page యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి.
-
Negative Keywords వాడండి.
-
A/B Testing చేయండి.
-
Regularly Performance Check చేయండి.
Google Ads Tools(keyword research tools ):
perfect గా ఈ టూల్స్ నీ వాడితే SEO చేయవచ్చు,google ads చేయవచ్చు.perfect keywords వాడితే లాభాలు(profit) వస్తాయ్.లేకపోతే నష్టాలు వస్తాయ్. మన customers ఏ keyword ఎక్కువ church చేస్తున్నారు(వారి బిజినెస్ పరంగా) అని తెలిసికోవడాన్ని keyword research అంటారు.
-

digitaldasaradh.com/Digital Marketing Executive in Vizag |Best Digital Marketing Services in Vizag Google Keyword Planner
-
Google Analytics
-
Google Tag Manager
-
SEMrush / Ahrefs (Paid Tools)
-
google auto suggestion
ad ఎలా పనిచేస్తుంది:google AdWords tutorial for beginners:
Google Ads అనేవి Auction System మీద ఆధారపడి పనిచేస్తుంది.
👉 ఉదాహరణ:
Suppose మీరు “Best hotel in Vizag” అనే కీవర్డ్‌కి Google Ads రన్ చేశారు అనుకోండి.మరికొందరు కూడా అదే కీవర్డ్పై యాడ్స్ పెట్టారు అప్పుడు.Google ఒక Auction చేసి Bid Amount (మీరు ఎంత డబ్బు పెట్టారు) + Ad Quality (Quality Score) ఆధారంగా ఎవరి యాడ్ మొదట వస్తుందో నిర్ణయిస్తుంది.
Search Campaign సెటప్ స్టెప్స్google AdWords tutorial for beginners:
ఇప్పుడు ఒక Search Ad Campaign Step-by-Step గా చూద్దాం.
1. Campaign Objective
-
Sales
-
Leads
-
Website Traffic
-
Brand Awareness
2. Campaign Name
-
ఉదాహరణ: Shoes Sales Campaign – Vizag
3. Networks
-
Search Network (Google Searchలో కనిపిస్తుంది)
-
Display Network (Google Partner Sites)
4. Location Targeting
-
Vizag, Hyderabad, Andhra Pradesh, India – మీకు కావలసిన ప్రదేశం సెలెక్ట్ చేయవచ్చు.
5. Language Targeting
-
Telugu, English, Hindi – మీ ఆడియన్స్ బేస్డ్గా.
6. Budget & Bidding
-
ఉదాహరణ: రోజుకి ₹500 Budget.
-
Bidding Strategy: Maximize Clicks, Maximize Conversions, Manual CPC.
7. Keywords Selection
-
Google Keyword Planner వాడి High Volume, Low Competition Keywords తీసుకోండి.
-
Example: “Buy Shoes Online Vizag”, “Best Shoe Shop in Vizag”.
8. Ad Creation
-
Headline 1: Buy Branded Shoes Online
-
Headline 2: Free Delivery Vizag
-
Description: Get Best Shoes at Affordable Price. Shop Now & Save 20%.
9. Ad Extensions
-
Sitelink Extension
-
Call Extension
-
Location Extension
10. Review & Publish
అన్ని సరిగా ఉన్నాయో చెక్ చేసి యాడ్ పబ్లిష్ చేయం
Google Ads ఖాతా ఎలా క్రియేట్ చేయాలి? (Step by Step):
terms and conditions బాగా చదవాలి అర్ధము చేసికోవాలి.
-
Google Ads Website → ads.google.com ఓపెన్ చేయండి.
-
Sign in → మీ Gmail అకౌంట్‌తో లాగిన్ అవ్వండి.ఒక జిమెయిల్ అకౌంట్ తో 20 clients కి maintenance చేయవచ్చు.అంతకంటే ఎక్కువ clients వుంటే mcc(manager account) అకౌంట్ తీసికోవాలి. ఈ అకౌంట్ ఎక్కువ ఏజెన్సీ వారికీ అవసరం ఉంటుంది.
-
Business Info → Country, Time Zone, Currency సెట్ చేయండి.
-
Billing Info → బిల్లింగ్ details కరెక్ట్ గా ఇవ్వాలి.Payment Method (Credit Card, Debit Card, Net Banking, UPI) సెట్ చేయండి.
-
First Campaign → Google అడిగే బేసిక్ ఇన్ఫో ఇచ్చి మొదటి క్యాంపెయిన్ క్రియేట్ చేయండి.
Google Adsలో Types of networks:
Google Adsలో పలు రకాల యాడ్స్ ఉన్నాయి.
-
Search Ads(CPC =cost per click):
-
Googleలో ఎవరు అయినా సెర్చ్ చేస్తే, ఫలితాల్లో మీ యాడ్ టెక్స్ట్ రూపంలో కనిపిస్తుంది. అంటే కస్టమర్ search చేసినప్పుడు ఈ SERP లో మన యాడ్ కినిపించాలి.వీటిని interest base market అంటారు.ఇ యాడ్ campaign అనేది small business లకి ఉపయోగిస్తారు. వీటిని “text” యాడ్స్ అంటారు
-
ఉదాహరణ: “Best Digital Marketing Agency Vizag” అని సెర్చ్ చేస్తే మీ కంపెనీ యాడ్ టాప్‌లో వస్తుంది.
-
-
Display Ads(CPM =cost per mile/cost per thousand impressions)
-
Google Partner Websites మరియు Apps లో బానర్ లేదా ఇమేజ్ రూపంలో యాడ్స్ కనిపిస్తాయి .ఈ యాడ్ బ్రాండింగ్ కి పనికొస్తుంది.ఇ యాడ్ campaign అనేది medium and big business లకి ఉపయోగిస్తారు.వీటికి “image” ads అంటారు.
-
ఉదాహరణ: మీరు ఒక న్యూస్ వెబ్సైట్లో చదువుతున్నప్పుడు సైడ్ లో ఒక కాఫీ షాప్ యాడ్ కనిపించడం.
-
-
Video Ads(CPV =cost per view)
-
YouTube చూసేటప్పుడు వీడియోల ముందు, మధ్యలో, చివరలో వచ్చే యాడ్స్.
- కొన్ని యాడ్స్ 5sec తరువాత skip చేయవచ్చు.కొన్ని యాడ్స్ non skippable యాడ్స్ ఉంటాయి.
-
-
Shopping Ads(CPA =cost per acquisition)
-
ప్రొడక్ట్ ఇమేజ్, ధర, లింక్‌తో కూడిన యాడ్స్ (ఇకామర్స్ కోసం ఎక్కువగా వాడతారు).(text/image )
- ఈ యాడ్ సేల్ కోసం పనిచేస్తుంది
-
-
App Promotion Ads(CPI =cost per installation)
-
Mobile Apps డౌన్లోడ్ చేయించడానికి వాడే యాడ్స్.(text/image /video).
- more installations (android/iOS)
-

