What is Third Party Insurance? భారతదేశంలో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఎందుకు తప్పనిసరి?

What is Third Party Insurance? భారతదేశంలో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఎందుకు తప్పనిసరి?

Spread the love

What is Third Party Insurance? భారతదేశంలో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఎందుకు తప్పనిసరి?

What is Third Party Insurance? భారతదేశంలో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఎందుకు తప్పనిసరి?

What is Third Party Insurance: దేశంలో వాహనాలు ఉన్న ప్రతి ఒక్కరు వెహికల్ ఇన్సూరెన్స్ తీసికోవాల్సి ఉంటుంది.అయితే కొందరు మాత్రం ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకోవడానికి మొక్కుబడిగా ఎదో ఒక ఇన్సూరెన్స్ తీసికొని సరిపెట్టుకుంటారు.అయితే ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో మనం ముందే చెప్పలేము.మన వల్ల ఇతరులకు ప్రమాదం జరగవచ్చు.ప్రకృతి వైపల్యాలవల్ల కూడా మనం నష్టపోవచ్చు.అలాంటి సమయాల్లో భీమా కంపెనీలు..నిబంధనల్లో ఇవేవి లేవని మీ బీమాను తిరస్కరిస్తుంటాయి.అందుకే ..అన్ని ఆలోసించుకున్నాకే ఓ సమగ్ర పాలిసీని తీసికోవాలి.https://amzn.to/4sCfdIg

third-party Bheema/థర్డ్-పార్టీ బీమా:

కార్,బైక్ ఇన్సురెన్సులలో థర్డ్ -పార్టీ భీమా చాలా ముఖ్యమైనది.ఇందులో ఇన్సూరెన్సు కొన్నవారు ఫస్ట్-పార్టీ అయితే..ఇన్సూరెన్సు అమ్మిన వారు సెకండ్ పార్టీ అవుతారు.ఒకవేల మీ వాహనం వల్ల ఏడైన ప్రమాదం జరిగి నష్టపోయిన (లేదా )చనిపోయిన వారిని థర్డ్ పార్టీ అని పిలుస్తారు.ఒకవేళ ఆ  ఆ థర్డ్-పార్టీ వ్యక్తికి ఇన్సూరెన్సు లేకపోతె..ఆ భారమంతా వాహన దారుడే మోయాలి.కనుక ఈ బీమా తప్పనిసరిగా తీసికోవడం మంచిది.

claim/క్లెయిమ్ ఎలా పొందాలి?

ప్రమాదం జరిగిన వెంటనే భీమా కంపెనీ కి చెప్పాలి.నిర్దిష్ట సమయంలోగా వారికీ సమాసారం ఇవ్వకపోతే.. మీరు ఇన్సూరెన్సు క్లెయిమ్ చేయలేరు.అలాగే పోలిసుల నుంచి FIR కాపీ కూడా పొందాలి .మీరు సమర్పించే పత్రాలకు ఆ FIR కాపీ ని జతచేయాలి.ఆ తరువాత ప్రమాద నష్టాన్ని అంచనా వేయడానికి భీమా కంపెనీ సర్వే కోసం ఒకర్ని పంపిస్తుంది.వారి నివేదికను బట్టి క్లెయిమ్ వస్తుంది.

ఈ జాగ్రత్తలు అవసరం:What is Third Party Insurance

అందుబాటులో వున్నా వివిధ రకాల మోటర్ ఇన్సూరెన్సు లను క్షున్నంగా పరిశీలించాలి.ఆ తరువాత మీకు ఏది బెటర్ అనిపించిందో దాన్ని బట్టి ఓ నిర్ణయానికి రావాలి.మీరు ఇన్సూరెన్సు తీసికొనే ముందు క్యాష్ లెస్,గ్యారేజ్ నెటవర్క్స్,ప్రీమియం ధరలు,యాడ్ ఆన్ ఫీచర్స్,భీమా సమస్తకువున్న విశ్వసనీయత,కవరేజ్ వంటి వాటిని కచ్చితంగా ప్రామాణికంగా తీసికోవాలి.అయితే డ్రైవింగ్ లైసెన్స్ లేనివారు వాహనం నడిపిన,మద్యం సేవించి వాహనం డ్రైవ్ చేసిన నిబంధనలు ఉల్లంఘించినట్లు అవుతుంది.దింతో కవరేజిలు వర్తించవు.

థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది ఒక వాహనం వల్ల ఇతర వ్యక్తులకు లేదా వారి ఆస్తికి జరిగిన నష్టాన్ని కవర్ చేసే ఇన్సూరెన్స్ పాలసీ.భారతదేశంలో వాహనాలు ఉపయోగించే ప్రతి ఒక్కరికీ Third Party Insurance (థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్) తప్పనిసరి. ఇది ఒక లీగల్ రిక్వైర్మెంట్ కూడా .సాధారణంగా ఈ పాలసీలో మూడు పార్టీస్ ఉంటాయి:
First Party – వాహన యజమాని (పాలసీ హోల్డర్)
Second Party – ఇన్సూరెన్స్ కంపెనీ
Third Party – ప్రమాదంలో నష్టపోయిన ఇతర వ్యక్తి లేదా వారి ఆస్తి
అంటే, మీ వాహనం వల్ల ఎవరికైనా గాయం అయితే లేదా వారి వాహనం లేదా ఆస్తి దెబ్బతిన్నా, ఆ నష్టాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది.

భారతదేశంలో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఎందుకు తప్పనిసరి?

భారతదేశంలో Motor Vehicles Act, 1988 ప్రకారం ప్రతి వాహనానికి కనీసం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉండాలి. ఇది ప్రభుత్వ నిబంధన.ఇది ఎందుకు తప్పనిసరి అంటే..రోడ్డు ప్రమాదాల్లో బాధితులకు ఆర్థిక సహాయం అందించడానికి..వాహన యజమాని మీద పెద్ద ఆర్థిక భారం పడకుండా ఉండటానికి..రోడ్డు భద్రతను మెరుగుపరచడానికి..థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే జరిమానా లేదా జైలుశిక్ష కూడా పడవచ్చు.

థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కవర్ చేసే విషయాలు:

వ్యక్తిగత గాయాలు (Injury):

మీ వాహనం వల్ల ఇతరులకు గాయం అయితే వారి వైద్య ఖర్చులు ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది.

మరణం (Death):

ప్రమాదంలో ఒక వ్యక్తి మరణిస్తే వారి కుటుంబానికి పరిహారం ఇవ్వబడుతుంది.

ఆస్తి నష్టం (Property Damage):

ఇతరుల వాహనం, ఇల్లు, గోడలు లేదా ఇతర ఆస్తులకు నష్టం జరిగితే అది కూడా కవర్ అవుతుంది.

థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కవర్ చేయనివి:What is Third Party Insurance

మీ వాహనానికి జరిగిన నష్టం..మీకు జరిగిన గాయాలు..మద్యం సేవించి డ్రైవింగ్ చేసినప్పుడు జరిగిన ప్రమాదాలు..లైసెన్స్ లేకుండా వాహనం నడిపినప్పుడు జరిగిన ప్రమాదాలు..అంటే ఇది మీ నష్టాన్ని కాదు, ఇతరుల నష్టాన్ని మాత్రమే కవర్ చేస్తుంది.

ప్రీమియం ఈ అంశాలపై ఆధారపడి ఉంటుంది:

*వాహనం రకం (బైక్ / కార్ / ట్రక్)
*ఇంజిన్ సామర్థ్యం (CC)
*వాహనం వయస్సు
*వాహనం ఉపయోగం
ఉదాహరణకు:
*చిన్న బైక్ కి ప్రీమియం తక్కువ
*పెద్ద కార్ కి ప్రీమియం ఎక్కువ
*థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం సాధారణంగా ప్రభుత్వ సంస్థ అయిన IRDAI (Insurance Regulatory and Development Authority of India) నిర్ణయిస్తుంది.https://amzn.to/4sCfdIg

భారతదేశంలో కొన్ని ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీలు:

ICICI Lombard
HDFC ERGO
Tata AIG
Bajaj Allianz
New India Assurance ..

థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఎవరికీ అవసరం:What is Third Party Insurance

ఈ వాహనాల యజమానులకు తప్పనిసరి..బైక్..కార్..ఆటో..ట్రక్..బస్సు..అంటే రోడ్డుపై నడిచే ప్రతి మోటార్ వాహనానికి ఇది అవసరం.https://digitaldasaradh.com/best-personal-accident-insurance-policy/?preview

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *