What is Digital Marketing in Telugu? డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమిటి వీటి వల్ల ఎవరకి ఉపయోగం:

What is Digital Marketing in Telugu? డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమిటి వీటి వల్ల ఎవరకి ఉపయోగం:

Spread the love

What is Digital Marketing in Telugu? డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమిటి వీటి వల్ల ఎవరకి ఉపయోగం:

What is Digital Marketing In Telugu: ఎలక్ట్రానిక్ డివైస్ ని వాడుకోని చేసే  ప్రతి మార్కెట్ ని డిజిటల్ మార్కెటింగ్ అంటారు. కొన్నింటిలో ఇంటర్నెట్ ఉండవచ్చు లేకపోవచ్చు. వీటిలో రెండు రకాలు ఒకటి ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్. రెండవది offline డిజిటల్ మార్కెటింగ్…. ఇప్పుడు offline డిజిటల్ మార్కెటింగ్ గురించి చెప్పుకుంటే.

డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇప్పుడు  ప్రతి వ్యాపారానికి అవసరం. సరైన వ్యూహం, కంటెంట్, టూల్స్‌తో మీరు చిన్న వ్యాపారాన్ని కూడా గ్లోబల్ బ్రాండ్‌గా మార్చవచ్చు.ఈ పరిస్థితిలో డిజిటల్ మార్కెటింగ్ అనేది వ్యాపారాలు తమ ఉత్పత్తులు, సేవలు సరైన కస్టమర్‌కి సరైన సమయంలో చేరవేయడానికి ఉపయోగించే అద్భుతమైన సాధనం.

offline digital marketing:

ఇంటర్నెట్ లేకుండా చేసే మార్కెట్ని offline డిజిటల్ మార్కెటింగ్ అంటారు లేదా traditional మార్కెటింగ్ అంటారు. ఈ offline మార్కెటింగ్ ఒకప్పుడు అంటే ఇంటర్నెట్ అందుబాటులో లేనప్పుడు మంచి ప్రాముఖ్యత ఉండేది. అవి రేడియో,..టీవీ,..పేపర్…LED డిజిటల్ బోర్డ్స్,..ఫోన్ (కాలింగ్, SMS),….

*రేడియో మార్కెటింగ్:

రేడియో అంటే మన అందరికి తెలిసిందే,..పాతరోజుల్లో ఇంటిలోనే కాకుండా అరుగు బయట అలాగే పోలల్లులోకి వెళ్లిన బయటకి ఎక్కడకి వెళ్లిన రేడియో ని పట్టుకొని వెళ్లి సాంగ్స్ వినే వాళ్ళము. ఆ రోజులు ఇప్పుడు రావు అనుకోండి. చాల మంది వాళ్ళ బిజినెస్  ప్రమోషన్స్ కోసం రేడియోలో యాడ్స్ ఇచ్చేవారు. యాడ్స్ కోసం కొంత అమౌంట్ కట్టేవారు..అప్పుడు సాంగ్స్ మధ్యలో కానీ న్యూస్ మధ్యలో కానీ వాళ్ళ కంపెనీ యాడ్స్ వచ్చేవి.. అలా వారి బిజినెస్ ని రేడియో లా ద్వారా మార్కెటింగ్ చేసికునేవాళ్ళు.

tv మార్కెటింగ్ :

మనం టీవీ చూస్తున్నప్పుడు టీవీ కింద భాగం లో కానీ పైన భాగంలో కానీ.. అలాగే సినిమా చూస్తున్నపుడు మధ్యలో కొన్ని యాడ్స్ మనకు కనిపిస్తాయి. వాటినే టీవీ మార్కెటింగ్ అంటారు,..వీటికి కూడా కొంత అమౌంట్ యాడ్స్ కి చెల్లించ వలిసి ఉంటుంది. ఇలా వాళ్ళ బిజినెస్ ప్రమోట్ చేసికొనేవాళ్ళు..ఇప్పుడుకూడా ఈవిదంగా మార్కెటింగ్ చేసికొనేవాళ్ళు వున్నారు.

ఫోన్ మార్కెటింగ్ :

ఇంటర్నెట్ లేని టైం లో ఫోన్ మార్కెటింగ్ ఎలా ఉండేది అంటే…tele callers ని పెట్టుకొని ఫోన్ లు చేయించెవాళ్ళు. అలాగే SMSs పంపేంచేవారు. ఇప్పుడు లా స్మార్ట్ ఫోన్ లు ఉండేవి కాదు,..చిన్న ఫోన్ లు ఉండేవి. అలా వారి ఫీడ్ బ్యాక్ తీసికొని బిజినెస్ ని పెంచుకొనేవారు.

LED డిజిటల్ బోర్డ్స్ :

ఇవి ఎక్కడ అయితే జనాలు ఎక్కువ వుంటారో(బీచ్ ,..షాపింగ్ కాంప్లెక్స్ ..రెస్టారెంట్స్…సినిమాహాల్…ఎక్సిబిషన్…) అక్కడ పెద్ద పెద్ద డిజిటల్ బోర్డ్స్ పెట్టేవారు.అందులో యాడ్స్ కనిపించేవి,.. ఆ విదంగా వాళ్ళ బిసినెస్ ని ప్రమోట్ చేసికొనేవాళ్ళు.

పాంపులేట్ &బిల్ బుక్ మార్కెటింగ్ :

చాల మంది వాళ్ళ కంపనీ బిజినెస్ పాంపులేట్ తయారు చేసికొని.ఇవి ఎక్కడ అయితే జనాలు ఎక్కువ వుంటారో(బీచ్ ,..షాపింగ్ కాంప్లెక్స్ ..రెస్టారెంట్స్…సినిమాహాల్…ఎక్సిబిషన్…) అక్కడ వాళ్ళ పాంపులేట్ పంచేవారు.వీటికోసం కొన్ని కంపెనీస్ ఒక వక్తిని రెక్యూట్మెంట్ చేసికొనేవాళ్ళు. అదే మాదిరి పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళ బిల్ బుక్ పైన వాళ్ళ యాడ్ డిజైన్ చేసికొని మార్కెటింగ్ చేసికొనేవారు. ఇలా వాళ్ళ బిసినెస్ ని ప్రమోట్ చేసికొనేవాళ్ళు. ఆలా చాలానే ఉండేవి అవన్నీ ఇప్పుడు కనుమరుగు అయిపోయాయి. ఇప్పుడు ఆన్లైన్ మార్కెటింగ్ వచ్చింది.

న్యూస్ పేపర్ :

ఒకప్పుడు న్యూస్ పేపర్ చదివేవారు చాల మంది ఉండేవారు అలా వీటికి కూడా యాడ్స్ కి money  ఇచ్చి బిసినెస్ ని ప్రమోట్ చేసికొనేవాళ్ళు.ఇప్పుడుకి కొంతమేర కొనసాగుతుంది.  

online marketing :

offline మార్కెటింగ్ తగ్గి,..ఆన్లైన్ మార్కెటింగ్ ఎందుకు ఇప్పుడు పుంజు కుంది అంటే. ఇప్పుడు అందరి చేతిలో స్మార్ట్ ఫోన్ వాటితోపాటు నెట్. ఇప్పుడు వున్నా పరిస్థితిలు బట్టి చూస్తే 80% peoples ఆన్లైన్ లోనే వుంటున్నారు. ఒకప్పుడు మనకు ఏమి కావాలన్నా మనం అక్కడకు వెళ్లి తెచ్చికొనేవాళ్ళం. ఇప్పుడు మనదగ్గరకే మనకు కావలిసినది వచ్చేస్తుంది ఇంతకంటే ఏమి కావాలి. 

డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమిటి?

పరిచయం :What is Digital Marketing In Telugu

ఈ రోజుల్లో మన జీవితంలో “ఇంటర్నెట్”  ఎంత ముఖ్యమైందో చెప్పనవసరం లేదు. ఇంటర్నెట్ ద్వారా మనం మాట్లాడటం, చదవడం, కొనుగోలు చేయడం, వినోదం పొందడం – అన్నీ జరుగుతున్నాయి. ఇలాంటివేళలో వ్యాపారాలు కూడా తమ ఉత్పత్తులు, సేవలు వినియోగదారులకి చేరవేయడానికి “డిజిటల్ మార్కెటింగ్ ”  అనే శక్తివంతమైన సాధనాన్ని ఉపయోగిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే 

ఇంటర్నెట్, మొబైల్, సోషల్ మీడియా, సెర్చ్ ఇంజిన్లు, ఈమెయిల్, వెబ్‌సైట్‌లు, ఆప్స్ మొదలైన “డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ ” ద్వారా ఉత్పత్తులు లేదా సేవలను ప్రచారం చేయడమే.

డిజిటల్ మార్కెటింగ్ అనేది ఆధునిక వ్యాపార ప్రపంచంలో కళ్ళు  లాంటిది. పాత కాలంలో వ్యాపారాలు కస్టమర్లను చేరుకోవడానికి పత్రికలూ, రేడియో,టీవీ వంటి సంప్రదాయ మీడియాను ఆధారపడి ఉండేవి.
కానీ ఇప్పుడు ఇంటర్నెట్ విప్లవం వల్ల, వినియోగదారులు తమ అవసరాలను గూగుల్, యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లలో వెతుకుతున్నారు.

డిజిటల్ మార్కెటింగ్ అవసరం ఎందుకు?

 వినియోగదారులు ఆన్‌లైన్‌లో ఉండటం:

ఈ రోజుల్లో 80% కంటే ఎక్కువ మంది తమ అవసరాలను గూగుల్, యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి ఆన్‌లైన్ వనరుల ద్వారా వెతుకుతున్నారు. కాబట్టి వ్యాపారం ఆన్‌లైన్‌లో లేకపోతే, అది మార్కెట్‌లో వెనుకబడిపోతుంది. ఎందుకు అంటే పూర్వం షాపింగ్ మాల్ లేదా బజారుకి వెళ్లి కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పుడు ఆన్లైన్లో గూగుల్ లో చర్చ్ చేసి, రివ్యూలు చదివి, ఇంటివద్దకు ఆర్డర్ తీసికుంటున్నారు.

 తక్కువ ఖర్చుతో ప్రచారం:

పారంపరిక ప్రకటనలు (పేపర్, TV, రేడియో) ఖరీదైనవే. కానీ డిజిటల్ మార్కెటింగ్‌లో చిన్న వ్యాపారాలు కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి చేరుకోవచ్చు. తక్కువ ఖర్చుతో ప్రపంచవ్యాప్తంగా చేరుకోవడం.మీ వ్యాపారం ప్రపంచంలోని ఎక్కడికైనా విస్తరించవచ్చు, మీ సైట్‌ను ఎవరైనా చూసే అవకాశం ఉంటుంది.

 టార్గెట్ ఆడియన్స్‌కు చేరుకోవడం:

డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మీ ప్రకటనను వయసు, ప్రదేశం, ఆసక్తులు, వంటి లక్షణాల ఆధారంగా సరైన ప్రేక్షకులకే చూపించవచ్చు.మీ ఉత్పత్తికి సంబంధించి సరైన వయస్సు, ప్రాంతం, లైఫ్‌స్టైల్ కలిగిన ప్రజలను టార్గెట్ చేయవచ్చు.

మెజరబుల్ రిజల్ట్స్:

గూగుల్ అనలిటిక్స్ వంటి టూల్స్ ద్వారా ప్రచార ఫలితాలను ట్రాక్ చేయవచ్చు.

ఫాస్ట్ కమ్యూనికేషన్:

సోషియల్ మీడియా లేదా మెసేజింగ్ యాప్స్ ద్వారా తక్షణమే వినియోగదారుని చేరుకోవచ్చు.

  1. గ్లోబల్ ఆడియన్స్ చేరుకోవచ్చు.

  2. ROI (Return on Investment) ఎక్కువ.

  3. ఫలితాలను రియల్ టైమ్‌లో కొలవచ్చు.

  4. బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది.

  5. కస్టమర్‌తో డైరెక్ట్ కమ్యూనికేషన్.


డిజిటల్ మార్కెటింగ్ కోసం అవసరమైన పద్ధతులు

కంటెంట్ క్రియేషన్

మీ టార్గెట్ ఆడియెన్స్‌కు సరిపోయే కంటెంట్‌ను రూపొందించాలి. కంటెంట్ రైటింగ్, గ్రాఫిక్స్ డిజైన్, వీడియో ఎడిటింగ్ వంటివి అవసరం.

టెక్నికల్ నాలెడ్జ్

SEO, వెబ్ అనలిటిక్స్, ఇమెయిల్ ఆటోమేషన్ టూల్స్ వంటి టెక్నికల్ అంశాలు తెలుసుకోవాలి.

సోషియల్ మీడియా టెక్నిక్స్

ట్రెండింగ్ Hashtags, వాచింగ్ టైమింగ్, ట్రాఫిక్ విశ్లేషణ వంటివి తెలుసుకోవాలి.

కస్టమర్ అనలిసిస్

మీ టార్గెట్ వినియోగదారుల ప్రవర్తనను అధ్యయనం చేయడం ద్వారా వారికీ నచ్చే విధంగా ప్రచారం చేయవచ్చు.


డిజిటల్ మార్కెటింగ్ ఎక్కడ ఉపయోగపడుతుంది?

  • ఇ-కామర్స్ వ్యాపారాలు (Amazon, Flipkart వంటి)

  • సర్వీస్ ఆధారిత సంస్థలు (డాక్టర్స్, లాయర్స్, కన్సల్టెంట్స్)

  • ఎడ్యుకేషన్ సంస్థలు (ఆన్‌లైన్ కోర్సులు, ఇనిస్టిట్యూట్స్)

  • ఫ్రీలాన్సర్లు (డిజైనర్లు, రైటర్లు, డెవలపర్లు)

  • స్థానిక వ్యాపారాలు (హోటల్స్, కాఫీ షాప్స్, బ్యూటీ పార్లర్లు)


డిజిటల్ మార్కెటింగ్‌లో కెరీర్ అవకాశాలు

ఈ రంగం రోజురోజుకూ విస్తరిస్తోంది. కొన్ని ప్రముఖ ఉద్యోగాలు ఇవే:

  • డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్

  • SEO స్పెషలిస్ట్

  • సోషల్ మీడియా మేనేజర్

  • కంటెంట్ రైటర్

  • PPC స్పెషలిస్ట్

  • ఇమెయిల్ మార్కెటింగ్ ఎక్సపర్ట్

  • వెబ్ అనలిటిక్స్ ఎక్స్‌పర్ట్


డిజిటల్ మార్కెటింగ్ టూల్స్

1. Google Analytics

వెబ్‌సైట్ ట్రాఫిక్‌ను విశ్లేషించేందుకు.

2. Google Ads

పేడ్ యాడ్వర్టైజింగ్ నిర్వహించేందుకు.

3. SEMRush, Ahrefs

SEO రీసెర్చ్, బ్యాక్‌లింక్ విశ్లేషణ కోసం.

4. Canva

సోషియల్ మీడియా డిజైన్స్ తయారీకి.

5. Mailchimp

ఇమెయిల్ మార్కెటింగ్ ఆటోమేషన్ కోసం.

6. Buffer / Hootsuite

సోషియల్ మీడియా పోస్టింగ్ షెడ్యూల్ చేసేందుకు.

డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడానికి దశలు

  1. డిజిటల్ మార్కెటింగ్ బేసిక్స్ అర్థం చేసుకోండి.

  2. SEO, SMM, Ads టెక్నిక్స్ నేర్చుకోండి.

  3. ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్టులు చేయండి.

  4. డేటా అనలిటిక్స్‌లో నైపుణ్యం పెంచుకోండి. 

    డిజిటల్ మార్కెటింగ్ రకాలు:

     SEO (Search Engine Optimization)

    SEO అనేది వెబ్‌సైట్‌ను సెర్చ్ ఇంజిన్‌లో టాప్ ర్యాంక్‌లో చూపించడానికి ఉపయోగించే విధానం.
    ఉదాహరణ: “విశాఖలో  బెస్ట్ ఇంటీరియర్ designer ” అని సెర్చ్ చేస్తే మీ కంపెనీ  వెబ్‌సైట్ మొదటి పేజీలో కనిపించాలి.What is Digital Marketing In Telugu

    SEO ప్రధాన విభాగాలు:

    • On-page SEO

    • Off-page SEO

    • Technical SEO

    ప్రయోజనాలు:

    • ఆర్గానిక్ ట్రాఫిక్ పెరుగుతుంది.

    • బ్రాండ్ నమ్మకం పెరుగుతుంది.

    • దీర్ఘకాలిక ఫలితాలు.

      • కీవర్డ్ రీసెర్చ్

      • వెబ్‌సైట్ కంటెంట్ ఆప్టిమైజేషన్

      • బ్యాక్‌లింక్ బిల్డింగ్


     SEM (Search Engine Marketing)

    ఇది పేడ్ అడ్వర్టైజింగ్.ఇది ఒక చెల్లింపు ప్రకటన విధానం, గూగుల్ యాడ్స్, బింగ్ యాడ్స్ వంటివి ఇందులో వస్తాయి. వినియోగదారు మీ యాడ్‌పై క్లిక్ చేసినప్పుడు మాత్రమే మీరు చెల్లించాలి.
    ఉదాహరణ: Google Ads.

    ప్రయోజనాలు:

    • తక్షణ ఫలితాలు.

    • ఖచ్చితమైన టార్గెటింగ్.


     Social Media Marketing (SMM)

    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, LinkedIn  వంటి ప్లాట్‌ఫార్మ్‌లలో ప్రమోషన్.ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్‌ఇన్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌ల ద్వారా ఉత్పత్తులను ప్రచారం చేయడం.

    ఉపయోగాలు:

    • కస్టమర్ ఎంగేజ్‌మెంట్ పెరుగుతుంది.

    • బ్రాండ్ అవేర్‌నెస్ పెరుగుతుంది.

    • ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో బ్రాండ్ ప్రొమోషన్.

    • ఫేస్‌బుక్ పేజీ ద్వారా ఆఫర్‌లు షేర్ చేయడం.


     Content Marketing

    విలువైన కంటెంట్ ద్వారా కస్టమర్లను ఆకర్షించడం.బ్లాగులు, వీడియోలు, ఇన్ఫోగ్రాఫిక్స్, ఈబుక్స్ ద్వారా వినియోగదారులకు విలువైన కంటెంట్ అందించడం

    ప్రయోజనాలు:

    • ఆడియన్స్ ఎంగేజ్‌మెంట్ పెరుగుతుంది.

    • బ్రాండ్‌కు నమ్మకం వస్తుంది.


     Email Marketing

    కస్టమర్లకి ఆఫర్లు, న్యూస్‌లెటర్లు పంపడం.వినియోగదారులకి ఈమెయిల్ ద్వారా ఆఫర్లు, న్యూస్‌లెటర్లు, అప్‌డేట్స్ పంపించడం.


     Affiliate Marketing

    మరొకరి ఉత్పత్తులు అమ్మి కమిషన్ పొందడం.మరొకరి ఉత్పత్తులు ప్రమోట్ చేసి, ప్రతి సేల్‌కి కమిషన్ పొందడం.


     Influencer Marketing

    సోషల్ మీడియా సెలబ్రిటీల ద్వారా ప్రమోషన్.సోషల్ మీడియాలో ఫేమస్ అయిన ఇన్‌ఫ్లుయెన్సర్ల ద్వారా ఉత్పత్తులను ప్రమోట్ చేయడం.


     Video Marketing

    యూట్యూబ్, రీల్స్, షార్ట్ వీడియోల ద్వారా ప్రచారం.యూట్యూబ్, ఫేస్‌బుక్ వీడియోలు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా మార్కెటింగ్ చేయడం.

    ముగింపు :

    ఇప్పుడు మంచి డిమాండ్ వున్నా కోర్స్ చదువు తో సంబంధం లేదు. వాళ్ళు 10th క్లాస్ అయినా నేర్సికోవాలని తపన వుంటే రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసినట్లు అయితే ఈజీ గా నేర్చికోవచ్చు. అలాగే ఈ కోర్స్ కి మొబైల్ లేదా ట్యాబు లేదా  laptop ఉంటే సరిపోతుంది. సింపుల్ గా వర్క్ చేయటకు laptop బెటర్. అలా అని costly లాప్టాప్ అవసరం లేదు,..తక్కువ రేట్ లాప్టాప్ వున్నా సరిపోతుంది . మంచి laptop కోసం https://amzn.to/4fI7qn2 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *