website vs blog? Website & Blog – ఏది మీకు సరైనది?
website/blog:
website vs blog: ఈ డిజిటల్ ప్రపంచంలో “వెబ్సైట్” (Website) మరియు “బ్లాగ్” (Blog) అనేవి రెండూ చాలా ప్రాముఖ్యమైనవి. ఈ రెండు ఒకేలా కనిపించినప్పటికీ, వాటి లక్ష్యం, నిర్మాణం, కంటెంట్ అప్డేట్ విధానం, మార్కెటింగ్ ప్రయోజనం, మరియు మనీ-మేకింగ్ అవకాశాలు పూర్తిగా వేర్వేరు. చాలా మంది ఒక వెబ్సైట్ అంటే ఏమిటి, బ్లాగ్ అంటే ఏమిటి, మరియు తాము ఏది తయారు చేసుకోవాలి అన్న సందేహంలో పడుతుంటారు. ముఖ్యంగా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునేవాళ్లు లేదా కొత్త బిజినెస్ ప్రారంభించేవాళ్లు ఈ రెండు మధ్య తేడాలు స్పష్టంగా తెలిసి ఉండాలి.మీరు best laptop కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.https://amzn.to/44THXTg
వెబ్సైట్ (Website) అంటే ఏమిటి?
వెబ్సైట్ అనేది ఏదయినా ఒక సంస్థ లేదా బిజినెస్ లేదా వ్యక్తి యొక్క సర్వీసెస్ గురించి స్థిరంగా వివరాలు ఇచ్చే ఒక డిజిటల్ ప్లాట్ఫార్మ్. వెబ్సైట్ ప్రధాన లక్ష్యం – సమాచారం ఇవ్వడం + బ్రాండ్‌ను ప్రొఫెషనల్‌గా ప్రదర్శించడం. ఒకసారి ఇన్ఫర్మేషన్ని ఇస్తాము రెగులర్ గా చేంజ్ చెయ్యము.వెబ్సైటు లో ఇన్ఫర్మేషన్ అనేది statistic గా ఉండిపోతుంది. తరచుగా అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉండదు .ఎప్పుడో కానీ అంతవరకూ మార్చాము.ex : డాక్టర్స్, లాయర్లు, corporate కంపెనీస్,it కంపెనీస్.small or మీడియం businesses ….. వీళ్ళకి వెబ్సైటు అనేది ఉండాలి.
ఏ బిజినెస్ చేసినా, నేటి కాలంలో ఒక వెబ్సైట్ అనేది డిజిటల్ విజిటింగ్ కార్డు. కస్టమర్‌కి మొదటి ఇంప్రెషన్ చాలా ముఖ్యం.కంపెనీకి మంచి వెబ్సైట్ ఉంటే, కస్టమర్ నమ్మకం పెరుగుతుంది.లీడ్స్ జనరేషన్ కు వెబ్సైటు బాగా ఉపయోగపడ్తుంది.”Contact Form”, “Call Now”, “WhatsApp” బటన్ ద్వారా కస్టమర్లు సులభంగా సంప్రదించగలరు. వెబ్సైటు అనేదిబిజినెస్ చేసే వారికీ అవసరం.వెబ్సైటు ఉంటే కస్టమర్లకు మంచి విశ్వాసం కలుగుతుంది. స్థిరమైన పేజీలతో (Static Pages) నిర్మించబడుతుంది. “About Us”, “Services”, “Contact Us”, “Portfolio” వంటి పేజీలు సాధారణంగా కలిగి ఉంటాయి.
వెబ్సైటు ఎవరకి అవసరం/ఎలా ఉపయోగపడుతుంది:
Shop ఓనర్స్,Real estate బ్రోకర్స్/ఓనర్స్ , Builders & interior designers , Coaches & trainers ,ఫ్రీలాన్సర్స్,Digital marketers , Doctors, lawyers, consultants , Restaurants ,Beauty salons ,స్టూడెంట్స్,NGos , Startups & entrepreneurs ….అంటే ప్రస్తుతం దాదాపు అందరికీ వెబ్సైటు అవసరమే!
కస్టమర్లు ఏ సేవ/ఇన్ఫర్మేషన్ అయినా తీసుకోవాలంటే ముందు గూగుల్‌లో సెర్చ్ చేస్తారు. వెబ్సైటు ఉంటే “ఇది నిజమైన వ్యాపారం” అని నమ్మకం పెరుగుతుంది.షాప్ timings ఉండవచ్చు కానీ వెబ్సైటు 24 గంటలు, 365 రోజులు పనిచేస్తుంది.
అర్ధరాత్రి కూడా మీ ప్రొడక్ట్స్ చూసి ఎవరో కొనగలరు.బ్రాండింగ్ & మార్కెటింగ్‌కు బెస్ట్,Google Ads, Facebook Ads, SEO అన్నీ వెబ్సైటు మీదే డిపెండ్ అవుతాయి.వెబ్సైటు లేకుండా ఆన్లైన్ మార్కెటింగ్ పూర్తి కాదు.కాంటాక్ట్ ఫార్మ్స్, WhatsApp బటన్, కాల్ బటన్ ద్వారా leads & sales పెరుగుతాయి.https://digitaldasaradh.com/startup-vs-business-vs-job-vs-content-creator-vs-freelancer/
వెబ్సైటు ఎందుకు అవసరం లేకపోతె ఏమౌతుంది:website vs blog:
ఎవరైనా మీ సేవలు గురించి తెలుసుకోవాలంటే మొదటి అడుగు Google Search — అక్కడ మీరు కనిపించాలంటే వెబ్సైటు తప్పనిసరి.ఇప్పుడు మార్కెట్లో competition పెరుగుతోంది. Google సెర్చ్ usage పెరుగుతోంది. Ads + SEO ద్వారా earning chances ఎక్కువ వుంటుంది.వెబ్సైటు లేకపోతే ఏమి కోల్పోతారు?Google లో కనిపించరు,కస్టమర్లుకు మనపై నమ్మకం రాదు . Ads run చేయలేరు.మీ competitors ముందు ఉంటారు. Online earning ఛాన్స్ తగ్గుతుంది.
ఫ్రీలాన్సర్స్ & సర్వీస్ ప్రొవైడర్స్‌కి ఎలా ఉపయోగం?
మీ పనుల పోర్ట్‌ఫోలియో లో చూపవచ్చు. ex :Graphic designer, digital marketer, photographer… ఎవరు అయినా మీ పని examples వెబ్సైటులో పెట్టగలరు.Fiverr, Upwork బయట కూడా పెద్ద క్లయింట్లను సంపాదించడానికి ప్రొఫెషనల్ వెబ్సైటు చాలా ముఖ్యము.పెద్ద కస్టమర్లు trust చేస్తారు.కస్టమర్ repeatedly “మీ ఛార్జీలు ఎంత?” అని అడగడం తగ్గుతుంది.సమయం ఆదా అవుతుంది.మీ రేట్స్, సేవలు క్లియర్‌గా చూపించవచ్చు.చిన్న వ్యాపారాలు (local shops)కి వెబ్సైటు ప్రయోజనం ఎక్కువ ఉంటుంది.
విద్యార్థులు & జాబ్ సీకర్స్కి వెబ్సైటు ఎలా ఉపయోగం?
Resume అందరూ పంపుతారు. కానీ మీరు personal resume website పంపితే HR వెంటనే గుర్తుంచుకుంటారు.skills ప్రూవ్ చేయడానికి బెస్ట్ ప్లాట్ఫార్మ్(Projects, certificates, achievements—all in one place).Blog రాస్తే Google AdSense ద్వారా డబ్బు సంపాదించవచ్చు(side income ).
బ్లాగ్ (Blog) అంటే ఏమిటి?website vs blog:
బ్లాగ్ అంటే content /ఇన్ఫర్మేషన్ ని పబ్లిష్ చేసే platform. కంటెంట్ ఎలా పబ్లిష్ అవుతుంది అంటే chronological ఆర్డర్లో పబ్లిష్ అవుతుంది.అంటే లేటెస్టుగా రాసె పోస్ట్ ముందుగా కనిపిస్తుంది.బ్లాగ్ అనేది వెబ్సైటు లో ఒక భాగం.బ్లాగ్ అనేది కంటెంట్ మీద డిఫెండ్ అవుతుంది.రెగులర్ గా పోస్ట్ చేయాలంటే బ్లాగ్ ఉండాలి. బిజినెస్‌కి కస్టమర్లను ఆకర్షించడంలో బ్లాగ్ చాలా ఉపయోగపడుతుంది.అయితే, బిజినెస్ ఉన్నప్పుడు బ్లాగ్ + వెబ్సైట్ కలిపితే మరింత శక్తివంతం అవుతుంది. మీ బ్లాగ్ క్లిక్ అయితే పెద్ద పెద్ద కంపెనీస్ నుండి స్పాన్సర్స్ వస్తారు.బ్లాగ్ క్రియేట్ చేయడం చాలా ఈజీ.
BLOG NICHES అంటే ఏమిటీ /ఐడియాస్ :
బ్లాగ్ నిచ్ అంటే మీ బ్లాగ్ మొత్తం ఏ విషయం మీద కంటెంట్ రాయబోతుందో ఆ టాపిక్‌నే నిచ్ అంటారు. ex :మీరు Digital Marketing గురించే రాస్తే అది మీ బ్లాగ్ నిచ్.మీరు House Construction గురించి రాస్తే అది మీ నిచ్,మీరు Travel పై రాస్తే Travel నిచ్,మీరు Recipes రాస్తే Food నిచ్ అవుతుంది. ఇందులో కొన్ని ఐడియాస్.1) డిజిటల్ మార్కెటింగ్ & ఆన్లైన్ మనీ, 2) హౌస్ కన్స్ట్రక్షన్ & ఇంటీరియర్ డిజైన్, 3) పర్సనల్ ఫైనాన్స్ & ఇన్వెస్ట్మెంట్స్, 4) హెల్త్ & ఫిట్నెస్ (సింపుల్ లాంగ్వేజ్‌లో), 5) ఫుడ్ & కుకింగ్, 6) టెక్నాలజీ & మొబైల్, 7) ట్రావెల్ & లోకల్ టూరిజం, 8) స్టూడెంట్స్ & ఎడ్యుకేషన్, 9) బ్యూటీ & స్కిన్‌కేర్, 10) ఫ్యామిలీ & లైఫ్‌స్టైల్, 11) Real estate niche , 12 ) AI + Digital Marketing niche ,13) Home appliances niche , 14) WordPress నిచ్.
ఎందుకు బ్లాగ్ నిచ్ అవసరం?website vs blog:
Googleకి స్పష్టత వస్తుంది.మీ బ్లాగ్ ఏ రంగానికి సంబంధించినదో Google త్వరగా అర్థం చేసుకుంటుంది వీటినుంచి ర్యాంకింగ్ ఇంప్రూవ్ అవుతుంది.ఆడియన్స్ మీపై నమ్మకం పెరుగుతుంది.ఒకే టాఫిక్ పైన బాగా రాస్తే మీరు ఆ రంగంలో expert లాగా కనిపిస్తారు.AdSense & Affiliate Earnings పెరుగుతాయి.స్పష్టమైన నిచ్ ఉన్న బ్లాగ్‌లకు హై-క్వాలిటీ ట్రాఫిక్ వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. కంటెంట్ ప్లాన్ చేయడం సులువు.ఒక టాపిక్‌కి పరిమితం అవ్వడం వల్ల ఏం రాయాలో confusion ఉండదు.
భవిష్యత్తులో ఏది ఎక్కువ అవకాశాలు ఇస్తుంది?
రెండు కూడా మంచి అవకశాలు ఇస్తాయి.ఇందులో బ్లాగింగ్ + కంటెంట్ క్రియేషన్ అంటే భవిష్యత్తు పూర్తిగా కంటెంట్ పైన ఆధారపడి ఉంది.Google, YouTube, Social Media ఇవి అన్నీ కంటెంట్ ప్లాట్ఫార్మ్స్.కాబట్టి బ్లాగ్‌కు భవిష్యత్ స్కోప్ చాలా పెద్దది.SEO సరిగ్గా చేస్తే బ్లాగ్‌తో కొన్ని లక్షల ఆర్గానిక్ ట్రాఫిక్ రావచ్చు.ఏదయినా ఒక విషయంపై(ఒక నిష్ (Niche)) పై ఎక్కువ దృష్టి వరుసగా మంచి కంటెంట్ అందిస్తే పాఠకులు నమ్మకాన్ని పెంచుకుంటారు. ప్రముఖ రచయిత/ఎక్స్‌పర్ట్‌గా మారే అవకాశం ఉంటుంది.
సంపాదన (Monetization) దృష్ట్యా ఏది మంచిది?
ఈ రెండు ఇంటిలో బ్లాగ్ ద్వారా సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి.అందులో ముందుగా Google AdSense.మీ బ్లాగ్ బాగా సక్సెస్ అయితే గూగుల్ యాడ్స్(యాడ్ పై క్లిక్ చేస్తే) ద్వారా మనీ ఎర్న్ చేయవచ్చు. అలాగే మన బ్లాగ్ లో అఫిలియేట్ లింకు ఇచ్చి Affiliateమార్కెటింగ్ ద్వారా మనీ ఎర్న్ చేయవచ్చు….Sponsored పోస్ట్స్.మీ ఓన్ ప్రొడక్ట్స్, Digital Products బ్లాగులో అమ్మి (courses, eBooks). Brand deals కోసం పెద్ద పెద్ద కంపెనీస్ వస్తాయ్. బ్లాగ్ సక్సెస్ వల్ల పెద పెద్ద స్పాన్సర్స్ వస్తారు వాళ్ల బ్రాండ్ ప్రమోట్ చేయమని. కొంతమంది వాళ్ళ గురించి ఆర్టికల్స్ రాయమని అడుగుతారు.అలాగే మీ బిజినెస్/బ్రాండ్(పెంచుకోవచ్చు) ని ప్రమోట్ చేసికోవచ్చు. బ్లాగ్‌తో మీరు passive income కూడా పొందగలరు.
డిజిటల్ మార్కెటింగ్ వారికీ ఏది బెటర్:
బ్లాగ్ /వెబ్సైటు ఈ రెండుఇంటిలో Blog ఉత్తమం ఎందుకంటే మీరు SEO నేర్చుకుంటారు,ట్రాఫిక్ సంపాదిస్తారు,Money earn చేయగలరు,వెబ్సైటు/బ్లాగ్ పైన పట్టు సాధిస్తారు.అలాగే SEO కోణంలో ఇది అత్యుత్తమము.బ్లాగ్ ద్వారా ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది.SEO సులువు గా నేర్చికోవచ్చు.డబ్బు సంపాదించే అవకాశాలు ఎక్కువ.ఇది కంటెంట్ ఆధారంగా ఎదగగల బ్రాండ్.అంటే బ్లాగ్ వల్ల ర్యాంకింగ్ అవకాశాలు 10 రెట్లు పెరుగుతాయి.Website + Blog కలిపి వాడితే మీ ఆన్లైన్ ప్రెజెన్స్ 5x పెరుగుతుంది.
మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చికోవాలి అనుకుంటే పూర్తి డీటెయిల్స్ కోసం http://digital marketing roadmap for beginners! డిజిటల్ మార్కెటింగ్ రోడ్డుమాప్! https://digitaldasaradh.com/digital-marketing-roadmap-for-beginners-%e0%b0%a1%e0%b0%bf%e0%b0%9c%e0%b0%bf%e0%b0%9f%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%ae%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%95%e0%b1%86%e0%b0%9f%e0%b0%bf%e0%b0%82%e0%b0%97/?preview_id=4457&preview_nonce=432f95341d&post_format=standard&_thumbnail_id=4496&preview=true

