Passive income vs Active income?ప్యాసివ్ ఇన్కమ్/యాక్టీవ్ ఇన్కమ్ అంటే ఏమిటి ?

Passive income vs Active income?ప్యాసివ్ ఇన్కమ్/యాక్టీవ్ ఇన్కమ్ అంటే ఏమిటి ?

Spread the love

Passive income vs Active income?ప్యాసివ్ ఇన్కమ్/యాక్టీవ్ ఇన్కమ్ అంటే ఏమిటి ?

passive income vs Active income:

Passive income ideas: ప్యాసివ్ ఇన్కమ్ అంటే మీరు రోజూ పని చేయకపోయినా, ఒకసారి చేసిన కృషి లేదా పెట్టుబడి ద్వారా ఎప్పటికప్పుడు ఆదాయం వస్తువుంటాది .నిద్రపోతున్నప్పుడు కూడా డబ్బులు వస్తుంటాయి.  మీరు  సమయం పెట్టకపోయినా, గతంలో చేసిన ప్రయత్నం లేదా పెట్టుబడి వల్ల నిరంతరంగా వస్తూనే ఉండే ఆదాయం( “Earn Money While You Sleep” ).

    Active Income అంటే మీరు నేరుగా మీ శ్రమ, సమయం, నైపుణ్యాలను పెట్టి సంపాదించే ఆదాయం.అంటే మీరు పనిచేసేంత వరకు మాత్రమే డబ్బు వస్తుంది. EX :ఉద్యోగం , వ్యాపారం, ఫ్రీలాన్సింగ్, కన్సల్టింగ్, ….డాక్టర్, లాయర్, టీచర్‌……మీకు laptops offers లో కావాలంటేhttps://amzn.to/4oD2S4K 

Financial Freedom(ఆర్థిక స్వేచ్ఛ ):

మనకు ఆర్థికస్వేచ్ఛ వుండాలి అంటే active income కంటే passive income ఎక్కువ ఉండాలి. అంటే మనకు వచ్చే active income కంటే extra source income అనేది ఎక్కువ ఉండాలి. అప్పుడు మన….ఇంటి  ఖర్చులు….EMI ….insurance (health &Life)….savings …..ఇలా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆర్థికస్వేచ్ఛ ఉంటుంది.

ఎందుకు ప్యాసివ్ ఇన్కమ్ అవసరం?

ఆర్థిక భద్రత – ఉద్యోగం పోయినా ఆదాయం కొనసాగుతుంది. సమయ స్వేచ్ఛ – మీకు ఇష్టమైన పని చేసుకునే అవకాశం.బహుళ ఆదాయ వనరులు – ఒకదాని మీద ఆధారపడాల్సిన అవసరం లేదు.రిటైర్మెంట్ భద్రత – వయస్సు పెరిగినా ఆదాయం వస్తూనే ఉంటుంది.సంపద సృష్టి (Wealth Creation) – దీర్ఘకాలిక పెట్టుబడులు పెద్ద ఫలితాలు ఇస్తాయి. అంటే ఒక్కసారి మాత్రమే కష్టపడతారు. కానీ జీవితాంతం అమౌంట్ వస్తువుంటుంది. అప్పుడు ఆర్థిక స్వేచ్ఛ వస్తుంది. అప్పులు అనేవి తగ్గుతాయి టెన్షన్ ఉండదు. మన దేశంలో చాల మంది  ఒక సోర్స్ అఫ్ income మీద మాత్రమే బతుకుతున్నారు. అదే ఒక సోర్స్ అఫ్ income పైన ఆధారపడితే . వీటివల్ల అప్పులు పెరిగిపోతాయి,ఫైనాన్స్ లు పెరిగిపోతాయి…debt track లో పడిపోతాము.డబ్బు సంపాదించడం ప్రతి మనిషి జీవితంలో అవసరం. కానీ మనం సంపాదించే డబ్బు రెండు రకాలు.Active Income (యాక్టివ్ ఇన్కమ్) మరియు Passive Income (ప్యాసివ్ ఇన్కమ్).

భారతదేశంలో ప్యాసివ్ ఇన్కమ్ అవకాశాలు

ఇప్పటి యువత డిజిటల్ మార్గాల్లో ఎక్కువగా ఆకర్షితమవుతున్నారు.ఎక్కువ సమయం ఆన్లైన్లో గడుపుతున్నారు. YouTubers, Bloggers, Freelancers రోజుకు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు.Digital India కార్యక్రమం వల్ల గ్రామీణ ప్రాంతాల నుండి కూడా వీలవుతోంది.

ప్యాసివ్ ఇన్కమ్ ప్రారంభించడానికి కావలసినవి:

మీ స్కిల్ / ఆసక్తి గుర్తించండి. ప్రతి ఒక్కరిలో ఎదో ఒక స్కిల్/టాలెంట్ ఉంటుంది వాటిని క్యాచ్ చేసికోవాలి. ఏదయినా ఒక  (Platform) ఎంచుకోండి.ప్రారంభంలో సమయం మరియు కృషి పెట్టండి.ఏదయినా (DM )మార్కెటింగ్ నేర్చుకోండి (SEO, Ads, Social Media).పట్టుదలతో వుండాలి.ఇవి లాంగ్ టర్మ్ లో result ని ఇస్తాయి.ఓపిక ఉండాలి. 

ఉదాహరణలు (సక్సెస్ స్టోరీలు)

  • Gaurav Chaudhary (Technical Guruji) – YouTube ద్వారా కోట్ల ఆదాయం సంపాదిస్తున్నారు. 

  • Amit Agarwal (Labnol.org) – Blogging ద్వారా Passive Income Pioneer. బ్లాగింగ్ చేసేవారు ఈయన పేరు చెప్పికోవాలిసిందే . ఓన్లీ బ్లాగింగ్ ద్వారా  కోట్ల ఆదాయం సంపాదిస్తున్నారు. ఈయన బ్లాగింగ్ కి ప్రసిద్ధి. 

  • Ranveer Allahbadia (Beer Biceps) – Podcasts, YouTube, Brand Deals ద్వారా కోట్ల ఆదాయం సంపాదిస్తున్నారు. వీరు అందరు ఇండియా వారే.

ఉత్తమ ప్యాసివ్ ఇన్కమ్ మార్గాలు ఒకసారి వస్తే  సంవత్సరాల పాటు ఆదాయం వస్తుంది:

YouTube Channel:

ఇప్పటి యుగంలో యూట్యూబ్ అనేది ఒక శక్తివంతమైన ప్యాసివ్ ఇన్కమ్ platform.మీరు ఒక నైపుణ్యం (Skill), హాబీ, లేదా సమాచారం పంచుకుంటే వీడియోల ద్వారా యాడ్ ఆదాయం, Sponsorships, Affiliate Income పొందవచ్చు.ex : టెక్ రివ్యూస్, కుకింగ్, ఎడ్యుకేషన్, డిజిటల్ మార్కెటింగ్, మోటివేషన్ వీడియోలు.

Blogging / Website:

బ్లాగ్ అంటే మీకు తెలిసిన విషయాలను(content) వెబ్‌సైట్‌లో రాయడం.Google AdSense, Affiliate Links ద్వారా ఆదాయం పొందవచ్చు.ex : travel blog….news blog….movie revues blog…..fashion blog….food blog….health blog …..

Affiliate Marketing:

మీ బ్లాగ్, యూట్యూబ్ లేదా సోషల్ మీడియాలో ఉత్పత్తులు ప్రమోట్ చేసి, ప్రతి విక్రయం మీద కమీషన్ పొందడం.ex :మీరు ₹1000 ఉత్పత్తి విక్రయిస్తే ₹100 కమీషన్ వస్తుంది అనుకుంటే . అదే 100 సేల్స్ = ₹10,000 ప్యాసివ్ ఆదాయం వస్తుంది. Affiliate Platforms: Amazon Associates ,…Flipkart Affiliate… ,Share Sale….. ,Click Bank…..

Online Courses & Digital Products:

ప్రతి ఒక్కరిలోనూ ఎదో ఒక talent/skill ఉంటుంది. ఏదైనా నైపుణ్యం ఉంటే (ఉదా: కోడింగ్,వెబ్ development,యాప్ డెవలప్మెంట్,కంటెంట్ రైటింగ్,dancing, singing, కుకింగ్,ఫొటోగ్రఫీ, డ్రైవింగ్, వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైన్, డిజిటల్ మార్కెటింగ్) ….extra 
దాన్ని వీడియో కోర్సుగా తయారు చేసి Udemy, Skill share, లేదా మీ వెబ్‌సైట్‌లో విక్రయించండి.

E-Book Writing:

passive income vs Active income:

మీకు రాయడం అంటే ఇష్టం ఉంటే —మీకు నచ్చిన subject పైన  ఒక ఇ-బుక్ రాసి Amazon Kindle (KDP)లో ప్రచురించండి.ప్రతి సారి ఎవరైనా మీ పుస్తకం కొంటే, మీకు income  వస్తుంది.

Mobile App Development:

మీకు కోడింగ్ స్కిల్ ఉంటే, ఒక App తయారు చేసి Play Storeలో ఉంచండి.యాడ్స్, Paid Downloads, లేదా In-App Purchases ద్వారా ఆదాయం.ex : Expense Tracker App, Learning App, Quiz App.

 property Rental Income:

ఫంక్షన్ హాల్, లైటింగ్, సౌండ్ సిస్టమ్ ,ఇల్లు , గది, లేదా షాప్…. అద్దెకి ఇచ్చి నెలనెలా రెంట్ రూపంలో ఆదాయం పొందవచ్చు.

Stock Market Investments/Mutual Funds (SIP):

మ్యూచువల్ ఫండ్స్‌లో నెలనెలా SIP ద్వారా పెట్టుబడి పెట్టడం.మరియు  స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టినట్లుఅయితే 
దీర్ఘకాలంలో ప్యాసివ్ రిటర్న్స్ అందిస్తుంది.

finance/chits income :

ఇతరులకు చిన్న మొత్తంలో అప్పు ఇచ్చి, వడ్డీ రూపంలో ఆదాయం పొందవచ్చు. డైలీ, వీక్లీ , మంత్లీ, రూపంలో ఫైనాన్స్ ఇవ్వచ్చు. అలాగే చిట్స్ ద్వారా కూడా పాసివ్ income పొందవచ్చు.

Drop shipping Business:

ఇది ఆన్లైన్ రిటైల్ బిజినెస్. ఇక్కడ మీరు ఉత్పత్తులు నిల్వ చేయకుండానే, ఆన్‌లైన్ ద్వారా విక్రయిస్తారు.కస్టమర్ ఆర్డర్ ఇస్తే, సప్లయర్ నుంచి నేరుగా డెలివరీ అవుతుంది.మీరు మధ్యలో లాభం పొందుతారు. వీటికి website/app ఉండాలి .

Print-on-Demand (T-Shirts, Mugs, Books):

మీరు డిజైన్‌లు అప్‌లోడ్ చేస్తే, Print-on-Demand ప్లాట్‌ఫారమ్‌లు వాటిని ప్రింట్ చేసి అమ్ముతాయి.
ప్రతి సారి సేల్ అయినప్పుడు మీకు కమీషన్ వస్తుంది.ex : Redbubble, Teespring, Merch by Amazon.

Social Media Influencing:

Instagram, Facebook లేదా YouTube(సోషల్ మీడియా platforms )లో ఫాలోవర్స్ పెంచికోవాలి , వేరేవాళ్ళ బ్రాండ్/బిజినెస్  ప్రమోషన్ల ద్వారా ఆదాయం పొందవచ్చు.

Photography:

మీ ఫోటోలు, వీడియోలు Shutterstock, Adobe Stock వంటి సైట్లలో అప్‌లోడ్ చేస్తే, ప్రతి డౌన్‌లోడ్‌కి income  వస్తుంది.

Website /Domain Name Selling:

మీరు వెబ్‌సైట్‌ తయారు చేసి ట్రాఫిక్ పెంచి, తరువాత దానిని అమ్మవచ్చు(ex : Flippa.com).మరియు ఉత్తమ పేర్లతో డొమైన్‌లు కొనుగోలు చేసి, భవిష్యత్తులో అధిక ధరకు అమ్మి డబ్బులు సంపాదించవచ్చు .

E-commerce Store Automation:

Shopify లేదా WooCommerce ద్వారా ఒక ఆన్‌లైన్ స్టోర్ ప్రారంభించి, ఆటోమేటెడ్ సేల్స్ ద్వారా ఆదాయం పొందవచ్చు.

ప్యాసివ్ ఇన్కమ్‌కు ఎంత సమయం పడుతుంది:

సాధారణంగా 6 నెలల నుండి 1 సంవత్సరం వరకు సమయం పడుతుంది. మీ యొక్క హార్డవర్క్ బట్టి result ఉంటుంది. ఆ తరువాత  క్రమంగా ఫలితాలు మనము చూడవచ్చు.ప్యాసివ్ ఇన్కమ్ ఒక్కరోజులో రాదు. కానీ మీరు మూడు నెలలు, ఆరు నెలలు, లేదా ఏడాది పట్టుదలతో పనిచేస్తే — అది జీవితాంతం ఆదాయం ఇస్తుంది.పట్టుదలగా కొనసాగించండి – మొదట్లో ఫలితం రాకపోయినా ఫీల్ అవ్వద్దు.

ప్రపంచంలో ప్యాసివ్ ఇన్కమ్ శాతం :

విదేశాలలో ప్యాసివ్ ఇన్కమ్ పైన ఆధారపడేవారు 50% మంది వుంటారు. అమెరికా, జపాన్, కెనడా వంటి దేశాల్లో 40% మంది వ్యక్తులకు కనీసం ఒక ప్యాసివ్ ఇన్కమ్ అవసరం  ఉంటుంది.భారతదేశంలో ఈ అవగాహన ఇప్పుడు ఇప్పుడే పెరుగుతోంది. యూట్యూబ్ క్రియేటర్లు, బ్లాగర్లు, డిజిటల్ మార్కెటర్లు ఈ మార్పుకు ఉదాహరణలు.

income  లెక్కలు example :

ఒక ఉద్యోగి నెలకు ₹30,000 సంపాదిస్తాడు అనుకుందాం . అతనికి ఒక బ్లాగ్ ఉంది, అది నెలకు ₹10,000 ప్యాసివ్ ఇన్కమ్ ఇస్తుంది.ఒక సంవత్సరం తర్వాత అతని బ్లాగ్ ₹25,000 ఇస్తే, అతని మొత్తం ఆదాయం ₹55,000 అవుతుంది.అంటే ప్యాసివ్ ఇన్కమ్ అతని జీవన ప్రమాణాన్ని రెట్టింపు చేసింది.

What is Active Income? యాక్టివ్ ఇన్కమ్ యొక్క ప్రయోజనాలు?

What is Active Income: Active Income అంటే మీరు నేరుగా మీ శ్రమ, సమయం, నైపుణ్యాలను పెట్టి సంపాదించే ఆదాయం.అంటే మీరు పనిచేసేంత వరకు మాత్రమే డబ్బు వస్తుంది. EX :ఉద్యోగం , వ్యాపారం, ఫ్రీలాన్సింగ్, కన్సల్టింగ్, ….డాక్టర్, లాయర్, టీచర్‌……మీకు laptops offers లో కావాలంటేhttps://amzn.to/4oD2S4K .

ఉదాహరణ:

passive income vs Active income:


మీరు ఒక కంపెనీలో ఉద్యోగిగా పని చేస్తే నెలకు ₹30,000 జీతం వస్తుంది. మీరు పని చేయకపోతే ఆ నెల డబ్బు రావడం లేదు.ఉద్యోగం ద్వారా వచ్చే జీతం (Salary),వ్యాపారంలో రోజువారీ లాభం,ఫ్రీలాన్సింగ్, ట్యూటరింగ్, కన్సల్టింగ్ ఫీజులు,కూలి పని,…….ఇలా చాల చెప్పికోవచ్చు.

యాక్టివ్ ఇన్కమ్ వల్ల వచ్చే లోపాలు:

మీరు పని చేయకపోతే ఆదాయం ఆగిపోతుంది.వర్షాలు వచ్చిన తూఫాన్ లు వచ్చిన ఆదాయం ఆగిపోతుంది.మనం ఒకరికింద ఫని చేయాలి. సమయం పరిమితి ఉంటుంది.ఒత్తిడి, బాస్ డిమాండ్లు ఎక్కువగా ఉంటాయి.సంపద పెరగడం చాలా నెమ్మదిగా జరుగుతుంది. అనుకున్నంత సంపాదించలేము.అదే కొన్ని ప్రైవేట్ sectors కి ఆఫీస్ సెలవలు వుండవు.స్ట్రెస్ మరియు డెడ్‌లైన్, ఒత్తిడి ఉంటుంది .

యాక్టివ్ ఇన్కమ్ వల్ల వచ్చే లాభాలు :

ఎవరీ మంత్/డే  శాలరీ వస్తుంది. నిరంతర క్యాష్ ఫ్లో.ఆత్మవిశ్వాసం మరియు అనుభవం ఉంటుంది.ప్యాసివ్ ఇన్కమ్ సృష్టించడానికి యాక్టీవ్ ఇన్కమ్ ఉండాలి.నైపుణ్య అభివృద్ధి కలుగుతుంది.

 ఉత్తమ యాక్టివ్ ఇన్కమ్ ఐడియాస్:

ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగం (Job):

మీరు ఒక కంపెనీలో లేదా ప్రభుత్వ విభాగంలో పనిచేస్తే నెలనెలా జీతం వస్తుంది.ఇది ఒక సాధారణమైన యాక్టివ్ ఇన్కమ్. ex :బ్యాంక్ ఉద్యోగాలు,టీచింగ్ జాబ్స్,సాఫ్ట్‌వేర్ కంపెనీలు (IT Jobs),ప్రభుత్వ కార్యాలయాలు…..

ఫ్రీలాన్సింగ్ (Freelancing):

మీ skill /talent (నైపుణ్యాలను) ప్రాజెక్టుల రూపంలో విక్రయించడం ద్వారా వచ్చే ఆదాయం.
ex : కంటెంట్ రైటింగ్,గ్రాఫిక్ డిజైన్,వెబ్ డెవలప్‌మెంట్,వీడియో ఎడిటింగ్,SEO ,SMM ,PPC ………..freelancing platforms: fiverr.com, freelancer.com, upwork.com …….

డిజిటల్ మార్కెటింగ్ సర్వీసులు:

డిజిటల్ మార్కెటింగ్ అంటే వ్యాపారాలను ఆన్‌లైన్‌లో ప్రమోట్ చేయడం.ఇది ఇప్పుడు అత్యధిక ఆదాయం ఇచ్చే యాక్టివ్ ఇన్కమ్.వీటి platforms: WEBSITE/BLOG,  SEO, SMM, PPC ,EMAIL MARKETING,…..

టీచింగ్ / ట్యూషన్ క్లాసెస్ చెప్పడం:

మీరు ఒక సబ్జెక్టులో నైపుణ్యం ఉన్నవారయితే, స్టూడెంట్స్‌కి ట్యూషన్ క్లాసెస్ చెప్పవచ్చు .ఇది ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ రెండు రూపాల్లో కూడా చెప్పవచ్చు . ఇది ఒక ఐడియా. వీటి PLOTFORMS :Vedanta,.. Biju’s….Unacademic….Zoom Classes…

సేల్స్ & మార్కెటింగ్ జాబ్స్:

ప్రతీ కంపెనీకి ప్రోడక్ట్స్ విక్రయించడానికి సేల్స్/మార్కెటింగ్ /ఫీల్డ్  టీమ్ అవసరం.ఇది ఒక యాక్టీవ్ ఇన్కమ్. ex : ఫార్మా సేల్స్, రియల్ ఎస్టేట్ ఏజెంట్, బ్యాంకు లోన్స్ , ఇన్సూరెన్స్ ఏజెంట్………

వెబ్ డెవలప్‌మెంట్ / యాప్ డెవలప్‌మెంట్:

మీకు కోడింగ్ skill ఉన్నట్లు అయితే , క్లయింట్లకు వెబ్‌సైట్లు లేదా మొబైల్ యాప్‌లు తయారు చేసి ఆదాయం పొందవచ్చు.

గ్రాఫిక్ డిజైనింగ్ ద్వారా :

బిజినెస్ /బ్రాండ్స్‌కు లోగోలు, పోస్టర్లు, బ్యానర్లు డిజైన్ చేయడం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు.Tools: Canva, Photoshop, Illustrator….

వీడియో ఎడిటింగ్ & యానిమేషన్:

YouTube మరియు సోషల్ మీడియా యుగంలో వీడియో ఎడిటర్స్‌కి మంచి డిమాండ్ ఉంది.
Software: Premiere Pro, DaVinci Resolve, Cap Cut.

కంటెంట్ రైటింగ్ / కాపీ రైటింగ్:

వెబ్‌సైట్లు, కంపెనీలు, మార్కెటింగ్ క్యాంపెయిన్ల కోసం కంటెంట్ అవసరం. మీకు రాయడం మీద ఆసక్తి ఉంటే ఇది మంచి  యాక్టివ్ ఇన్కమ్ ఐడియా.

ఫోటోగ్రఫీ & వీడియోగ్రఫీ:

వివాహాలు, ఈవెంట్స్, ఫ్యాషన్ షూట్స్ కోసం ఫోటోగ్రాఫర్స్‌కి మంచి డిమాండ్  ఉంది. ఇది కూడా ఒక మంచి ఐడియా, ఇందులో నైపుణ్యం ఉన్నట్లు అయితే చాలా బెటర్ ఫీల్డ్ .

ఇన్సూరెన్స్ ఏజెంట్/రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్:

Life Insurance, Health Insurance, Vehicle Insurance అమ్మడం ద్వారా కమిషన్ ఆదాయం పొందవచ్చు.అలాగే ప్రాపర్టీ కొనుగోలు, అమ్మకం మధ్యలో బ్రోకర్‌గా పనిచేసి ఆదాయం  పొందవచ్చు.

స్మాల్ షాప్స్ / రీటైల్ బిజినెస్:

గ్రాసరీ, మొబైల్ రిపేర్, స్టేషనరీ షాప్స్ వంటి వ్యాపారాలు స్థిరమైన యాక్టివ్ ఇన్కమ్ ని ఇస్తాయి.

కన్స్ట్రక్షన్ వర్క్ / కాంట్రాక్టర్ బిజినెస్:

ఇంటీరియర్ వర్క్స్, పెయింటింగ్,ఎలక్ట్రికల్ ,ప్లంబింగ్ , టైల్స్ , సిమెంట్ కాంట్రాక్టింగ్ వంటి రంగాల్లో రోజువారీ లేదా ప్రాజెక్టు ఆధారంగా ఆదాయం పొందవచ్చు.

ట్రావెల్ ఏజెన్సీ లేదా టూర్ గైడ్:

టూరిస్ట్ ప్లేస్‌ల్లో గైడ్‌గా లేదా ట్రావెల్ బుకింగ్స్ ద్వారా ఆదాయం పొందవచ్చు .

ఫిట్‌నెస్ ట్రైనర్ / యోగా ఇన్‌స్ట్రక్టర్:

జిమ్ ట్రైనర్ /యోగ ట్రైనర్ కి మంచి డిమాండ్ వుంది .హెల్త్ ఫీల్డ్‌లో అవగాహన పెరిగినందున ఫిట్‌నెస్ ట్రైనర్స్‌కి మంచి డిమాండ్ ఉంది.

ఇవెంట్ మేనేజ్మెంట్:

వివాహాలు, కార్పొరేట్ ఈవెంట్స్, బర్త్‌డే పార్టీలు నిర్వహించడం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు.

బ్యూటిషన్ /hairdresser:

వివాహాలు,పెద్దపిల్ల ఫంక్షన్స్ , కార్పొరేట్ ఈవెంట్స్, బర్త్‌డే పార్టీలు కి బ్యూటిషన్/hairdresser ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు.

హ్యాండ్‌క్రాఫ్ట్/ ఆర్ట్ బిజినెస్:

passive income vs Active income:

చేతిపనులు, పూల మాలలు, డెకరేటివ్ ఐటమ్స్ తయారు చేసి మార్కెట్‌లో అమ్మడం.

ఫుడ్ డెలివరీ / రైడ్ షేర్ జాబ్స్:

Swiggy, Zomato, Ola, Uber వంటి కంపెనీలతో డ్రైవర్ లేదా డెలివరీ ఏజెంట్‌గా పని చేస్తూ పార్ట్ /ఫుల్ టైం ఇన్కమ్ సంపాదించవచ్చు.

హోమ్ టిఫిన్ సర్వీస్ / క్యాటరింగ్:

ఇంటిలో రుచికరమైన వంటలు చేసేవారికి  ఇది ఒక అద్భుతమైన  యాక్టివ్ ఇన్కమ్ ఇచ్చేది. మీరు వండే వంటకాలు బాగుంటే క్యాటరింగ్ ఆర్డర్స్ వస్తాయ్ అలాగే ఇంటి వద్దే ఫుడ్ బిజినెస్ పెట్టుకోవచ్చు .

ఆన్‌లైన్ ట్యూషన్ చెప్పడం:

మీరు ఏదయినా ఒక సబ్జెక్ట్‌లో నైపుణ్యం ఉన్నవారయితే Zoom లేదా Google Meet ద్వారా ఆన్‌లైన్ క్లాసులు ఇవ్వండి.

సోషల్ మీడియా మేనేజర్:

బిజినెస్ /బ్రాండ్స్‌కి అలాగే actors కి పొలిటిషన్స్ కి ,డాక్టర్స్ ,లాయర్స్ కి …. సోషల్ అకౌంట్స్ నిర్వహించడం, పోస్టులు ప్లాన్ చేయడం, రిపోర్ట్స్ రూపొందించడం….ఇలా చాలానే చెప్పికోవచ్చు .

డిజిటల్ మార్కెటింగ్ అవసరం ఎందుకు?

ఈ రోజుల్లో 80% కంటే ఎక్కువ మంది తమ అవసరాలను గూగుల్, యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి ఆన్‌లైన్ platforms ద్వారా వెతుకుతున్నారు. కాబట్టి వ్యాపారం ఆన్‌లైన్‌లో లేకపోతే, అది మార్కెట్‌లో వెనుకబడిపోతుంది. ఎందుకు అంటే పూర్వం షాపింగ్ మాల్ లేదా బజారుకి వెళ్లి కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పుడు ఆన్లైన్లో గూగుల్ లో చర్చ్ చేసి, రివ్యూలు చదివి, ఇంటివద్దకు ఆర్డర్ తీసికుంటున్నారు.

తక్కువ ఖర్చుతో ప్రచారం:

పేపర్, TV, రేడియో ప్రకటనలు  ఖరీదైనవే. కానీ డిజిటల్ మార్కెటింగ్‌లో చిన్న వ్యాపారాలు కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి చేరుకోవచ్చు. తక్కువ ఖర్చుతో ప్రపంచవ్యాప్తంగా చేరుకోవడం.మీ వ్యాపారం ప్రపంచంలోని ఎక్కడికైనా విస్తరించవచ్చు, మీ సైట్‌ను ఎవరైనా చూసే అవకాశం ఉంటుంది.

టార్గెట్ ఆడియన్స్‌కు చేరుకోవచ్చు :

డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మీ ప్రకటనను వయసు, ప్రదేశం, ఆసక్తులు, వంటి లక్షణాల ఆధారంగా సరైన ప్రేక్షకులకే చూపించవచ్చు.మీ ఉత్పత్తికి సంబంధించి సరైన వయస్సు, ప్రాంతం, లైఫ్‌స్టైల్ కలిగిన ప్రజలను టార్గెట్ చేయవచ్చు.

ముగింపు:

డిజిటల్ మార్కెటింగ్ లేకుండా ఈ రోజుల్లో బిజినెస్ విజయవంతం కావడం చాలా కష్టం. ముఖ్యంగా Vizag వంటి పోటీ మార్కెట్లో, సరైన డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీని ఎంచుకోవడం అత్యవసరం.

DigitalDasaradh.com విశాఖలో వ్యాపారాల కోసం నంబర్ వన్ డిజిటల్ మార్కెటింగ్ పార్ట్నర్.website design, SEO, Social Media, Google Ads, email marketing, graphic design, Branding అన్ని సర్వీసులతో మీ బిజినెస్‌ను విజయవంతం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం.

👉 మీ వ్యాపారం డిజిటల్ రూపంలో ఎదగాలని కోరుకుంటే, ఈ రోజు నుండే digitaldasaradh.com (8977507907) ని సంప్రదించండి.

 

 

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *