digital marketing roadmap for beginners! డిజిటల్ మార్కెటింగ్ రోడ్డుమాప్!
Digital Marketing Roadmap: చాల మందికి డిజిటల్ మార్కెటింగ్ నేర్చికోవాలి అని ఉంటుంది. కానీ ఎలా నేర్చికోవాలి, వీటికి కావలిసిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి. వాటికీ ఏ స్కిల్ అవసరం, వీటికి కావలసిన ముడిసరుకులు ఏంటి, ఎక్కడ నేర్చికోవాలి. ఒకవేల నేర్చికుంటే జాబ్స్ వస్తాయా లేదంటే వీటి ఫ్యూచర్ ఏంటి అని చాల(doubts) కన్ఫ్యూషన్ లో వుంటారు. మనము ముందుగా తెలిసికోవాలిసింది. ఈ ఇండస్ట్రీలో ఏ ఏ టోపిక్స్ ఉన్నాయో అవగాహనా తెచుకోవాలి(EX: SMM, SEO, SEM, EMAIL MARKETING ……). రెండవది DM(DIGITAL MARKETING) లో కొన్ని పదాలు తెలిసికోవాలి (ex: PPC , CPV , RPM , LANDING PAGE OPTIMIZATION, BRAND ప్రొజిషన్ ….ఇలా చాల ఉంటాయి. గూగుల్ లో DM grocery అని చర్చ్ చేస్తే కనిపిస్తాయి ) వీటి వల్ల బేసిక్ అవర్నెస్ వస్తుంది.https://amzn.to/3KnoDqw
DM లో SPECIALIZATION:
DM లో వున్న అన్ని టాపిక్స్ తెలిసికోవాలి(నేర్చికోవాలి) అందులో ఎదో ఒకదానిలో(ఒక topic) స్పెషలిజషన్ అవ్వాలి. దేనిలో అనేది అది మీ పైన ఆధారపడివుంటుంది. మీరు ఏ సబ్జెక్టు లో బాగా ఎంజాయ్ చేస్తున్నారో ఆ టాపిక్ ని ఎంచుకోండి. ఆ టాపిక్ కి సంబంధించి స్పెషలిస్ట్ లని LinkedIn, twitter,..లాంటి social media platforms లో ఫాలో అవ్వాలి. వీరునుంచి రెగులర్ గా వాళ్లు పెట్టే పోస్ట్ ల నుంచి knowledge సంపాదించవచ్చు. అదేవిదంగా DM నేర్చికోవాలంటే institute లో జాయిన్ అవ్వచ్చు లేదంటే ఆన్లైన్లో నేర్చికోవచ్చు(online platforms: google…HubSpot… Udemy…Quora..). subject నేర్చికున్నాక ప్రాక్టీస్ అనేది చాల ముఖ్యం(practical implementation important).
Practical implementation ఎలా చెయ్యాలి:
కోర్స్ నేర్చికున్నాక ఏదయినా కంపెనీలో 3 to 6months internship join(free or paid ఉంటాయి)అవ్వాలి. మీ దగ్గర వున్న బంధువులు కానీ ఫ్రెండ్స్ కి బిజినెస్ ఉంటే ఫ్రీ గా వర్క్ చేసి పెట్టాలి. ఇలా 2 or 3 ప్రాజెక్ట్స్ చేయాలి. మీకు individual website/ blog ఉండాలి ప్రాక్టీస్ కోసం(నిత్యం ప్రాక్టీస్ చేస్తూఉండాలి). దీనివల్ల వర్క్ experience వస్తుంది. మీ పైన మీకు నమ్మకం కలుగుతుంది.ఈ experience resume లో add చేస్తే జాబ్స్ వస్తాయ్ లేదంటే freelancer projects వేగంగా వస్తాయి ఒకవేళ మీకు కనుక బిజినెస్ ఉంటే మీ బిజినెస్ ని ప్రమోట్ చేసికోవచ్చు.
డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమిటి?
డిజిటల్ మార్కెటింగ్ అంటే ఎలక్ట్రానిక్ device ని ఉపయోగించి ఇంటర్నెట్లో ఏదయినా వ్యాపారం లేదా ప్రోడక్ట్ యొక్క బ్రాండ్ లేదా సర్వీస్‌ను పాప్యులర్ చేయడం. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏ వ్యాపారాన్నైనా ఇంటర్నెట్లో ప్రమోట్ చేయడానికి ఉపయోగించే అన్ని ఆన్లైన్ పద్ధతులు, స్ట్రాటజీలు, టూల్స్ మరియు టెక్నిక్స్. కానీ ప్రారంభస్థాయి వారికి ఇది చాలా పెద్ద ప్రపంచంలా అనిపిస్తుంది. ఏం నేర్చుకోవాలి? ఏది ముందు? ఏది తర్వాత? ఏ స్కిల్స్ అత్యవసరం? ఏ దిశలో ముందుకు వెళ్లాలి? వంటి సందేహాలు చాలా ఉంటాయి.
డిజిటల్ మార్కెటింగ్‌లో ప్రధాన విభాగాలు:
-
SEO (Search Engine Optimization)
-
Search Engine Marketing (Google Ads / PPC)
-
Social Media Marketing (Facebook, Instagram, YouTube)
-
Content Marketing
-
Email Marketing
-
Website / Landing Page Creation
-
Analytics (Google Analytics, Search Console)
-
Graphic Designing Basics
-
Affiliate Marketing
-
Marketing Automation
ఈ స్కిల్స్‌లో మీకు అవసరమైనది ఏది అనేది మీ కెరీర్ గోల్ మరియు ఆసక్తిపై ఆధారపడి ఉంటుంది. కానీ బిగినర్ అయితే ప్రతి స్కిల్ నేర్చికోవాలి.
డిజిటల్ మార్కెటింగ్ నేర్చికోవడానికి ఈ బేసిక్ స్కిల్స్ తప్పనిసరి:
కంప్యూటర్ అండ్ ఇంటర్నెట్ బేసిక్ పరిజ్ఙానం కలిగి ఉండాలి. గూగుల్ లో ఏవైనా టాపిక్స్ సర్చ్ చేయడం .ఫైళ్లు ఎలా డౌన్లోడ్ చేసి సేవ్ చేయాలి.ఇమెయిల్ ఛెక్ చేయడం పంపించడం వంటి పరిజ్ఞానం కలిగి ఉండాలి. అలాగే బేసిక్ ఇంగ్లీష్ వచ్చి ఉండాలి.ఎందుకంటే టూల్స్ అన్నీ ఇంగ్లీష్‌లో ఉంటాయి కాబట్టి అలాగే క్లయింట్స్‌తో కమ్యూనికేట్ చేయడానికి.
కంటెంట్ రాయాలి లేదా అర్థం చేసుకోవాలి. బేసిక్ గ్రాఫిక్ డిజైన్ వచ్చి ఉండాలి పోస్టులు కోసం(ex: Canva). Audience psychology అర్థం చేసుకోవాలి ఇది చాల ఇంపార్టెంట్.
వెబ్సైట్ & బ్లాగ్ బేసిక్స్ నేర్చుకోండి:
ఒక డిజిటల్ మార్కెటర్‌కు Website/Blog అంటే ఒక స్కిల్ మాత్రమే కాదు, వీటి ద్వారా సంపాదన వస్తుంది అలాగే ప్రాక్టీస్ చేసికోవచ్చు. చాల మంది వెబ్సైటు అనగానే కోడింగ్ ఉండాలి కోడింగ్ అంటే మరి ఎలా మాకు రాదు కదా అనుకుంటారు అందుకే కోడింగ్ తో పనిలేకుండా WordPress అనే ఒక software ద్వారా చాల ఈజీ గా లుక్ అండ్ ఫీల్ వెబ్సైటు రెడీ చేసికోవచ్చు. అయితే ఇందులో డొమైన్ అండ్ హోస్టింగ్ కొనికోవాలి మిగిలినదిఅంతా ఫ్రీ గా డిజైన్ చేసికోవచ్చు. వీటిలో ముందుగా తెలిసికోవాలిసినవి Domain అంటే ఏమిటి?Hosting అంటే ఏమిటి?WordPress ఎలా ఇన్స్టాల్ చేయాలి?Themes, Plugins ఉపయోగం ఏమిటి ?Page Builder ( Elem enter ) అంటే ఏమిటీ ?
SEO (Search Engine Optimization) బేసిక్స్ నేర్చుకోవడం:
SEO డిజిటల్ మార్కెటింగ్‌లో అత్యంత డిమాండ్ ఉన్న స్కిల్. మీరు Digital Marketing లో కెరీర్ కావాలనికుంటే SEO ఒక తప్పనిసరి స్కిల్. వీటిలో తెలిసికోవాలిసినవి Local SEO అంటే ఏమిటి ? on page SEO అంటే ఏమిటి? off page SEO అంటే ఏమిటీ ? technical SEO అంటే ఏమిటీ ? keyword research అంటే ఏమిటీ?. SEO నేర్చికుంటే సంస్థలలో(పెద్ద పెద్ద కంపెనీస్) ఉద్యోగాలు సులభంగా వస్తాయ్. Freelancing Projects త్వరగా వస్తాయ్.Local business ownersకి భాగా ఉపయోగపడుతుంది.
Social Media Marketing (SMM):.
డిజిటల్ మార్కెటింగ్‌లో అత్యంత పాపులర్ అయ్యే స్కిల్ SMM. SMM నేర్చికుంటే పెద్ద పెద్ద సంస్థలలో ఉద్యోగాలు సులభంగా వస్తాయ్. Freelancing Projects త్వరగా వస్తాయ్.Local business ownersకి భాగా ఉపయోగపడుతుంది.సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్:Facebook , Instagram , YouTube , LinkedIn , Twitter / X , Pinterest . వీటిలో ఆర్గానిక్ పద్దతిలో బిజినెస్ ని ఎలా మార్కెటింగ్(branding) చేయాలి. paid ads ద్వారా లీడ్ జెనెరేషన్ ఎలా చేయాలి అనేది తెలిసికోవాలి.
Google Ads (SEM / PPC):
గూగుల్ అడ్స్ అనేది ప్రధానంగా Paid Advertisements. ఇది బిజినెస్‌లకు ఫలితాలు తక్షణమే ఇస్తుంది.Google Ads నేర్చుకుంటే సంస్థలలో ఉద్యోగాలు సులభంగా వస్తాయ్. Freelancing Projects త్వరగా లభిస్తాయి. Local business ownersకి భాగా ఉపయోగపడుతుంది. వీటిలో నేర్చికోవాలిసినవి, Search యాడ్స్ అంటే ఏమిటీ? Display యాడ్స్ అంటే ఏమిటీ? YouTube యాడ్స్ అంటే ఏమిటీ? Shopping యాడ్స్ అంటే ఏమిటీ?Digital Marketing Roadmap
Content Marketing నేర్చుకోండి:
Content Marketing లేకుండా ఏ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ పనిచేయదు. Content = Blogs + Videos + Social Media Posts + Reels + Infographics + PDFs. ఆకర్షణీయమైన కంటెంట్ ద్వారా కస్టమర్లను ఆకర్షించడం. ఈ స్కిల్ నేర్చుకుంటే సంస్థలలో ఉద్యోగాలు సులభంగా వస్తాయ్. Freelancing Projects త్వరగా లభిస్తాయి. Local business ownersకి భాగా ఉపయోగపడుతుంది.
Email Marketing:
Email Marketing అనేది అత్యంత ROI ఉన్న డిజిటల్ మార్కెటింగ్ స్కిల్. నేర్చుకోవాల్సినవి Lead Magnet Creation , Email List Building , Email writing skills Automation setup (Mailchimp, Convert Kit, Sender), Drip campaigns గురించి తెలిసికోవాలి. ఈ స్కిల్ నేర్చుకుంటే సంస్థలలో ఉద్యోగాలు సులభంగా వస్తాయ్. Freelancing Projects త్వరగా లభిస్తాయి. Local business ownersకి భాగా ఉపయోగపడుతుంది.Digital Marketing Roadmap
Analytics నేర్చుకోండి:
Analytical skills లేకుండా digital marketer కాలేరు. analytics అంటే వెబ్సైటు పనితీరు తెలిసికోవచ్చు. మన పోస్ట్ ఎంతమందికి రీచ్ అవుతుంది. మనతో ఎంతమంది ఇంట్రాక్ట్ అవుతున్నారు. వారు ఎక్కడవారు(location). ఏ ads better? Audience ఎలా react అవుతున్నారు?ఏ strategy పనిచేస్తోంది? ఇందులో ముఖ్యమైన టూల్స్ Google Analytics 4 (GA4), Google Search Console , Google Tag Manager , వీటి గురించి తెలిసికోవాలి.
ఈ స్కిల్స్ అన్ని నేర్చికున్నాక మీకు డిజిటల్ మార్కెటింగ్ పైన పూర్తి అవగాహన వస్తుంది. ఆ తరువాత మీరు జాబ్ చేయాలా ఫ్రీలన్సర్ చేయాలా స్టార్టుప్ పెట్టాలా అనేది మీ ఇష్టం.
డిజిటల్ మార్కెటింగ్‌లో విజయం పొందలంటే:
Regular practice చేయాలి, మీకిష్టమైన specialization ఎంచుకోండి, మీ సొంత వెబ్సైట్/బ్లాగ్ తప్పనిసరి, నేర్చుకోవడం ఎప్పుడూ ఆపకండి, Portfolio బలంగా ఉంచండి, Clients తో నమ్మకంగా పనిచేయండి, ఈ రోడ్‌మ్యాప్‌ను సరిగ్గా ఫాలో అయితే, 6 నెలల్లో మీరు ఒక పూర్తి Digital Marketer గా మారగలరు.
How to get projects:
ఎక్కడైనా ఈవెంట్స్ జరిగితే ఈవెంట్స్ కి వెళ్ళాలి (ex : Meera events,…) . టిక్కెటింగ్ platforms ఉంటాయి. గూగుల్ లో చర్చ్ చేసి తెలిసికోవచ్చు. what’s up గ్రూప్స్ Facebook groups follow అవ్వాలి. Freelancing Platforms (Fiverr , Upwork , Freelancer , People Per Hour….. ).
డిజిటల్ మార్కెటింగ్‌లో ఏ ఏ jobs ఉన్నాయి?:
మీరు జాబ్ కోసం చూసినట్లు అయితే మంచి రెస్యూమే తయారు చేయండి. LinkedIn వంటి platforms లో అప్లోడ్ చేయండి. what’s up గ్రూప్స్ Facebook groups follow అవ్వాలి. డిజిటల్ మార్కెటింగ్ ఉద్యోగ అవకాశాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. Vizag, Hyderabad, Bangalore, Chennai వంటి నగరాల్లో భారీ డిమాండ్ ఉంది.
-
SEO Executive
-
Social Media Executive
-
Google Ads Specialist
-
Content Writer
-
Digital Marketing Manager
-
Email Marketing Specialist
-
Analytics Specialist
-
WordPress Developer
-
Performance Marketer

