Digital marketing jobs for freshers

Digital Marketing Jobs For Freshers? డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ ఎలా ఉంటాయి?

Spread the love

Digital Marketing Jobs For Freshers? డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ ఎలా ఉంటాయి:

Digital marketing jobs for freshers :ప్రస్తుత కాలంలో ప్రతి రంగంలోనూ డిజిటల్ టెక్నాలజీ వేగంగా విస్తరిస్తోంది. ఒక చిన్న వ్యాపారాన్ని కూడా ప్రమోట్ చేయడానికి ఆన్‌లైన్ మార్కెటింగ్ తప్పనిసరి అయింది. ఈ ట్రెండ్ వలన డిజిటల్మార్కెటింగ్ లో ఉద్యోగాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఫ్రెషర్స్ (కొత్తవారికోసం)కోసం ఈ రంగం ఒక అద్భుతమైన కెరీర్ అవకాశాన్ని ఇస్తోంది.

ఇంజనీరింగ్, డిగ్రీ, మాస్టర్స్ ఏ కోర్సు చేసినా, డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ నేర్చుకుంటే ఉద్యోగ అవకాశాలు పొందడం చాలా సులభం.ఫ్రెషర్స్ కోసం డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక మంచి ఆప్షన్ అని చెప్పికోవచ్చు . ఈ రంగంలో ప్రారంభంలో జీతం తక్కువగా ఉన్నా, అనుభవం పెరిగేకొద్దీ జీతం కూడా వేగంగా పెరుగుతుంది. ముఖ్యంగా ఫ్రీలాన్సింగ్ ద్వారా ఆదాయం రెట్టింపు చేసే అవకాశం ఉంటుంది.

డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ డిమాండ్:

ప్రస్తుత కాలంలో  “డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్”  కి భారీ డిమాండ్ ఏర్పడింది. ఐటి ఉద్యోగాలు లాగా డిజిటల్ మార్కెటింగ్ కూడా స్థిరమైన మరియు అభివృద్ధి చెందుతున్న రంగంగా మారింది.డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ భవిష్యత్తు దృష్ట్యా చాలా ప్రాముఖ్యత కలిగినవి. కచ్చితమైన స్కిల్స్ నేర్చుకుంటే, ఈ రంగంలో స్థిరమైన కెరీర్ తో పాటు మంచి ఆదాయం కూడా పొందవచ్చు. ఫ్రీలాన్సింగ్ ద్వారా కూడా మంచి ఆదాయం పొందవచ్చు .రాబోయే సంవత్సరాల్లో డిజిటల్ మార్కెటింగ్ ఉద్యోగాలు మరింత పెరుగుతాయి.ఇంటర్నెట్ వినియోగం పెరిగే కొద్దీ ఈ ఫీల్డ్‌లో జాబ్స్ ఎప్పుడూ ఉంటాయి.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్, చాట్‌బాట్స్ వంటి కోర్స్ లు  నేర్చికొవాలి.

డిజిటల్ మార్కెటింగ్‌లో ప్రధానమైన ఉద్యోగ రకాలూ

1. SEO స్పెషలిస్ట్(search engine optimization):

వెబ్‌సైట్ గూగుల్‌లో ర్యాంక్ అయ్యేలా కీవర్డ్ రీసెర్చ్, లింక్ బిల్డింగ్, ఆన్-పేజ్, ఆఫ్-పేజ్ ఆప్టిమైజేషన్ చేసే నిపుణుడు.ఇప్పటి డిజిటల్ యుగంలో ఏ బిజినెస్ అయినా ఆన్‌లైన్‌లో కనిపించకపోతే కస్టమర్లను కోల్పోతుంది. వెబ్‌సైట్ ఉన్నా అది గూగుల్‌లో మొదటి పేజీలో కనిపించకపోతే ఉపయోగం ఉండదు. ఇక్కడే “SEO” ప్రాముఖ్యత పెరుగుతుంది. వెబ్‌సైట్‌ని గూగుల్ సెర్చ్ రిజల్ట్స్‌లో టాప్ ర్యాంక్ చేయించడం కోసం కృషి చేసే నిపుణుడిని “SEOస్పెషలిస్ట్”అంటారు. SEO స్పెషలిస్ట్ ఉద్యోగం డిజిటల్ మార్కెటింగ్‌లో అత్యంత డిమాండ్ ఉన్న జాబ్స్‌లో ఒకటి. ఫ్రెషర్స్ కూడా ప్రాథమిక SEO కోర్సులు నేర్చుకుని ఈ రంగంలోకి ప్రవేశించవచ్చు. ఒకసారి అనుభవం పెరిగాక, మంచి జీతంతో పాటు ఫ్రీలాన్స్ ద్వారా అదనపు ఆదాయం కూడా పొందవచ్చు.

2. సోషల్ మీడియా మేనేజర్(Social Media Marketing):

Facebook, Instagram, Twitter వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో బ్రాండ్ ప్రొమోషన్, ఫాలోవర్స్ పెంపు, క్యాంపెయిన్లు నిర్వహించడం.ఇప్పటి డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతున్నారు. Facebook, Instagram, YouTube, Twitter (X), LinkedIn వంటి ప్లాట్‌ఫారమ్‌లు కేవలం వినోదం కోసం కాకుండా, వ్యాపారాలను కస్టమర్ల దగ్గరికి తీసుకెళ్లే శక్తివంతమైన సాధనాలుగా మారాయి. ఈ ప్రక్రియనే సోషల్ మీడియా మార్కెటింగ్ అంటారు.సోషల్ మీడియా మార్కెటింగ్ వ్యాపారాలకు కస్టమర్లతో అనుసంధానం కలిగించే శక్తివంతమైన సాధనం. ఫ్రెషర్స్ ఈ ఫీల్డ్‌లోకి రావడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. సరైన స్కిల్స్ నేర్చుకుని, కంటెంట్ క్రియేటివ్‌గా తయారు చేస్తే మంచి జాబ్‌లు, ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ దొరుకుతాయి.

3. కంటెంట్ రైటర్ / కాపీరైటర్:

బ్లాగ్ ఆర్టికల్స్, అడ్స్ కాపీలు, వెబ్‌సైట్ కంటెంట్ వ్రాసే పని.ప్రస్తుత డిజిటల్ యుగంలో “కంటెంట్” అనేది రాజు (Content is King) అని అంటారు. ఒక వెబ్‌సైట్, బ్లాగ్, సోషల్ మీడియా పేజీ లేదా యాప్ అయినా అది విజయవంతం కావడానికి మంచికంటెంట్ తప్పనిసరి. ఆ కంటెంట్‌ను సృష్టించే వ్యక్తిని “కంటెంట్ రైటర్” అంటారు.కంటెంట్ రైటర్ ఉద్యోగం డిజిటల్ మార్కెటింగ్‌లో చాలా ప్రాముఖ్యతకలిగినది . ఫ్రెషర్స్ కూడా రైటింగ్ మీద ఆసక్తి ఉంటే ఈ రంగంలో మంచి కెరీర్‌ను నిర్మించుకోవచ్చు. మొదట తక్కువ జీతం వచ్చినా, అనుభవం పెరిగేకొద్దీ ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. ఫ్రీలాన్సింగ్ ద్వారా కూడా అంతర్జాతీయ ప్రాజెక్ట్స్ చేస్తూ ఎక్కువ సంపాదించవచ్చు.

4. PPC స్పెషలిస్ట్ (Paid Ads)(Pay-Per-Click):

Google Ads, Facebook Ads వంటి పేడ్ క్యాంపెయిన్లను ప్లాన్ చేసి రన్ చేయడం.ప్రస్తుతం డిజిటల్ మార్కెటింగ్‌లో వ్యాపారాలు ఆన్‌లైన్‌లో తక్షణ ఫలితాలు పొందడానికి ఎక్కువగా ఉపయోగించే పద్ధతి PPC advertising . గూగుల్ సెర్చ్ రిజల్ట్స్, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్, వెబ్‌సైట్స్‌లో కనిపించే యాడ్స్ అన్నీ PPC భాగం. ఈ యాడ్స్‌ని ప్లాన్ చేసి, రన్ చేసి, ఆప్టిమైజ్ చేసే నిపుణుడే PPCస్పెషలిస్ట్. ఈ ఉద్యోగం డిజిటల్ మార్కెటింగ్‌లో అత్యంత వేగంగా ఎదుగుతున్న రోల్స్‌లో ఒకటి. సరైన కోర్సులు చేసి, ప్రాక్టికల్ అనుభవం పొందితే ఫ్రెషర్స్ కూడా ఈ రంగంలో సులభంగా ప్రవేశించవచ్చు. ROI మీద దృష్టి పెట్టి పనిచేస్తే, కంపెనీలు PPC నిపుణులను ఎక్కువగా కోరుకుంటాయి.

5. ఈమెయిల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్(Email Marketing):

లీడ్స్‌కు ఈమెయిల్ క్యాంపెయిన్లు పంపి కన్వర్షన్లు సాధించడం.డిజిటల్ మార్కెటింగ్‌లో అత్యంత శక్తివంతమైన పద్ధతుల్లో ఒకటి ఈమెయిల్ మార్కెటింగ్. కస్టమర్లతో నేరుగా సంబంధం పెట్టుకోవడానికి, కొత్త ఆఫర్లు తెలియజేయడానికి, లీడ్స్‌ని సేల్స్‌గా మార్చడానికి ఈమెయిల్ మార్కెటింగ్ చాలా ప్రభావవంతమైన సాధనం. ఈమెయిల్ మార్కెటింగ్ అనేది  డిజిటల్ మార్కెటింగ్‌లో ఖర్చు తక్కువగా, ఫలితాలు ఎక్కువగా ఇచ్చే మార్కెటింగ్ స్ట్రాటజీ. వ్యాపారాలు కస్టమర్లతో నేరుగా మాట్లాడటానికి, కొత్త లీడ్స్ సంపాదించడానికి ఇది ఉత్తమ మార్గం. సరైన టూల్స్ వాడి, మంచి కంటెంట్‌తో, సరైన ఆడియన్స్‌ని టార్గెట్ చేస్తే వ్యాపారాలు గొప్ప విజయాలు సాధించగలవు.

6. వెబ్ అనలిటిక్స్ స్పెషలిస్ట్:

Google Analytics, Search Console ద్వారా వెబ్‌సైట్ పనితీరు విశ్లేషించడం.వెబ్అనలిటిక్స్ అనేది ఒక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లో యూజర్లు ఎలా ప్రవర్తిస్తున్నారు? ఎంతసేపు వెబ్‌సైట్‌లో గడుపుతున్నారు? ఏ పేజీలు ఎక్కువగా చూస్తున్నారు? ఎవరు కొనుగోలు చేస్తున్నారు? అన్న విషయాలను విశ్లేషించే ప్రక్రియ.వెబ్ అనలిటిక్స్ స్పెషలిస్ట్ అనేది డిజిటల్ మార్కెటింగ్ ప్రపంచంలో కీలకమైన కెరీర్. వెబ్‌సైట్‌లో డేటా విశ్లేషణ ద్వారా వ్యాపారం ఎలా పెంచాలో నిర్ణయించే వ్యక్తి. డేటా అనలిసిస్ స్కిల్స్ కలిగిన వారికి ఇది ఒక అద్భుతమైన కెరీర్ ఆప్షన్.

7. డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్:Digital marketing jobs for freshers:

మొత్తం మార్కెటింగ్ టీమ్‌ని మానిటర్ చేసి స్ట్రాటజీ ప్లాన్ చేయడం.ప్రస్తుతం ప్రతి వ్యాపారం డిజిటల్ మీడియా ద్వారా తమ కస్టమర్లను చేరుకోవాలని కోరుకుంటోంది. ఈ క్రమంలో డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్  పాత్ర అత్యంత కీలకం. ఒక సంస్థలోని అన్ని డిజిటల్ మార్కెటింగ్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ, వ్యూహాలను రూపొందించి, విజయవంతంగా అమలు చేసే వ్యక్తే డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్.డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ అనేది కంపెనీ ఆన్‌లైన్ ప్రెజెన్స్‌ను పెంచడం, ట్రాఫిక్‌ను తీసుకురావడం, కస్టమర్లను ఆకర్షించడం, చివరికి సేల్స్‌ను పెంచడం వంటి లక్ష్యాలతో పని చేసే నిపుణుడు.

8. Digital Marketing Intern:

డిజిటల్ మార్కెటింగ్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ రంగంలో కెరీర్ చేయాలనుకునే విద్యార్థులు, ఫ్రెషర్స్ ముందుగా “ఇంటర్న్సిప్” ద్వారా ప్రాక్టికల్ అనుభవం సంపాదించడం చాలా అవసరం.
అందుకే digital marketing intern అనేది  ప్రస్తుతకాలంలో విపరీతమైన డిమాండ్ ఉంది.ఈ కోర్స్ అనేది డిజిటల్ మార్కెటింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే ఫ్రెషర్స్‌కి బంగారు అవకాశం. సరైన ఇంటర్న్‌షిప్‌ను ఎంచుకుని, ప్రాక్టికల్ అనుభవం పొందితే, భవిష్యత్తులో మంచి ఉద్యోగం లేదా ఫ్రీలాన్సింగ్ కెరీర్ సులభంగా సాధ్యమవుతుంది.


డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ ఎక్కడ దొరుకుతాయి?

  • IT కంపెనీలు

  • ఈ-కామర్స్ సంస్థలు (Amazon, Flipkart లాంటి)

  • డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీలు

  • స్టార్టప్ కంపెనీలు

  • ఫ్రీలాన్సింగ్ & వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు 

digital marketing agency in vizag

జాబ్ రోల్స్‌కు అంచనా జీతం (Salary)

  • freshers : నెలకు ₹15,000 – ₹25,000

  • middle level : ₹30,000 – ₹60,000

  • experts : ₹1,00,000 వరకు లేదా అంతకంటే ఎక్కువ

  • freelancer : ప్రాజెక్ట్ ఆధారంగా మంచి ఆదాయం

ఒక బ్రాండ్‌ను కస్టమర్ దగ్గరికి తీసుకెళ్లే ప్రధాన ప్లాట్‌ఫారమ్‌లు:

  • వెబ్‌సైట్

  • సోషల్ మీడియా

  • సెర్చ్ ఇంజిన్స్

  • ఈమెయిల్

  • మొబైల్ యాప్స్

ఫ్రెషర్స్ కోసం డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు బెటర్ కెరీర్?

  • ఎక్కువ డిమాండ్: ప్రతి కంపెనీకి డిజిటల్ మార్కెటింగ్ అవసరం.

  • ఎంట్రీ ఈజీ: పెద్ద టెక్నికల్ డిగ్రీ అవసరం లేదు, ప్రాక్టికల్ స్కిల్స్ చాలు.

  • ఫ్రీలాన్స్ ఆప్షన్స్: ఆఫీస్ జాబ్స్ తో పాటు ఇంటి నుంచే ప్రాజెక్ట్స్ చేయవచ్చు.

  • గ్రోత్ ఫాస్ట్: 1–2 ఏళ్ల అనుభవం తర్వాత మంచి జీతాలు వస్తాయి.

  • క్రియేటివ్ ఫీల్డ్: కొత్త ఐడియాస్ తో పని చేసే అవకాశం.

  • ఫ్రెషర్స్‌కు అవసరమైన స్కిల్స్

    • SEO & SEM బేసిక్స్

    • Social Media Marketing

    • Content Writing

    • Google Analytics & Search Console

    • Email Marketing Tools (Mailchimp మొదలైనవి)

    • Graphic Design & Video Editing (బేసిక్)

    • Communication Skills

    • ఫ్రెషర్స్ ఎక్కడ జాబ్స్ పొందవచ్చు?

      • డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీలు

      • స్టార్టప్ కంపెనీలు

      • ఈ-కామర్స్ వెబ్‌సైట్స్ (Amazon, Flipkart, Myntra)

      • IT కంపెనీలు

      • ఫ్రీలాన్సింగ్ వెబ్‌సైట్స్ (Upwork, Fiverr, Freelancer)

      • ప్రతి చిన్న బిజినెస్ కి వర్క్ చేయవచ్చు.ఫ్రెషర్స్ ప్రారంభంలో చిన్న చిన్న ప్రాజెక్ట్స్‌తో మొదలు పెట్టవచ్చు.

      డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ పొందడానికి టిప్స్

      1. కోర్సులు పూర్తి చేసి సర్టిఫికేషన్లు పొందండి.

      2. ప్రాక్టీస్ కోసం బ్లాగ్ లేదా సోషల్ మీడియా పేజీ క్రియేట్ చేయండి.

      3. LinkedIn ప్రొఫైల్ అప్‌డేట్ చేసి నెట్‌వర్కింగ్ చేయండి.

      4. ఇంటర్న్‌షిప్స్ చేయండి – అనుభవం కలిసొస్తుంది.

      5. ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ తీసుకుని రియల్ టైమ్ వర్క్ నేర్చుకోండి.


      * ఫ్రెషర్స్ ప్రారంభంలో చిన్న చిన్న ప్రాజెక్ట్స్‌తో మొదలు పెట్టవచ్చు.

      దీని ద్వారా అనుభవం రావడమే కాకుండా మంచి ఆదాయం కూడా వస్తుంది. అలాగే డిజిటల్ మార్కెటింగ్ బుక్స్ కోసంhttps://amzn.to/4oS5pcf 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *