digital marketing in Telegu? డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమిటి?
digital marketing in Telegu:
digital marketing in Telegu: కస్టమర్లను ఆన్లైన్లో రీచ్ కావడానికి, వాళ్లతో కమ్యునికేట్ కావడానికి ఉపయోగించే ప్రచారం విధానమే డిజిటల్ మార్కెటింగ్.వీటిని ఇంటర్నెట్ మార్కెటింగ్ లేదా ఆన్లైన్ మార్కెటింగ్ అనే పేర్లతో కూడా పిలుస్తారు.డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇంటర్నెట్, మొబైల్, సోషల్ మీడియా, వెబ్సైట్లు, ఇమెయిల్ వంటి ఆన్లైన్ ప్లాట్‌ఫార్మ్‌ల ద్వారా ప్రొడక్ట్‌లు, సర్వీస్‌లు లేదా బ్రాండ్‌ను ప్రచారం చేయడం.
ఎవరైనా నేర్చికోవచ్చా:
ఇప్పుడు మంచి డిమాండ్ వున్నా కోర్స్ చదువు తో సంబంధం లేదు. వాళ్ళు 10th క్లాస్ అయినా నేర్సికోవాలని తపన వుంటే రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసినట్లు అయితే ఈజీ గా నేర్చికోవచ్చు. అలాగే ఈ కోర్స్ కి మొబైల్ లేదా ట్యాబు లేదా laptop ఉంటే సరిపోతుంది. సింపుల్ గా వర్క్ చేయటకు laptop బెటర్. అలా అని costly లాప్టాప్ అవసరం లేదు,..తక్కువ రేట్ లాప్టాప్ వున్నా సరిపోతుంది . మంచి laptop కోసం https://amzn.to/4fI7qn2
డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమిటి?
What is Digital Marketing In Telugu: ఎలక్ట్రానిక్ డివైస్ ని వాడుకోని చేసే ప్రతి మార్కెట్ ని డిజిటల్ మార్కెటింగ్ అంటారు. కొన్నింటిలో ఇంటర్నెట్ ఉండవచ్చు లేకపోవచ్చు. వీటిలో రెండు రకాలు ఒకటి ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్. రెండవది offline డిజిటల్ మార్కెటింగ్…. ఇప్పుడు offline డిజిటల్ మార్కెటింగ్ గురించి చెప్పుకుంటే.
డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇప్పుడు ప్రతి వ్యాపారానికి అవసరం. సరైన వ్యూహం, కంటెంట్, టూల్స్‌తో మీరు చిన్న వ్యాపారాన్ని కూడా గ్లోబల్ బ్రాండ్‌గా మార్చవచ్చు.ఈ పరిస్థితిలో డిజిటల్ మార్కెటింగ్ అనేది వ్యాపారాలు తమ ఉత్పత్తులు, సేవలు సరైన కస్టమర్‌కి సరైన సమయంలో చేరవేయడానికి ఉపయోగించే అద్భుతమైన సాధనం.
offline digital marketing:
ఇంటర్నెట్ లేకుండా చేసే మార్కెట్‌ని offline డిజిటల్ మార్కెటింగ్ అంటారు లేదా traditional మార్కెటింగ్ అంటారు. ఈ offline మార్కెటింగ్ ఒకప్పుడు అంటే ఇంటర్నెట్ అందుబాటులో లేనప్పుడు మంచి ప్రాముఖ్యత ఉండేది. అవి రేడియో,..టీవీ,..పేపర్…LED డిజిటల్ బోర్డ్స్,..ఫోన్ (కాలింగ్, SMS),….
రేడియో మార్కెటింగ్:
రేడియో అంటే మన అందరికి తెలిసిందే,..పాతరోజుల్లో ఇంటిలోనే కాకుండా అరుగు బయట అలాగే పోలల్లులోకి వెళ్లిన బయటకి ఎక్కడకి వెళ్లిన రేడియో ని పట్టుకొని వెళ్లి సాంగ్స్ వినే వాళ్ళము. ఆ రోజులు ఇప్పుడు రావు అనుకోండి. చాల మంది వాళ్ళ బిజినెస్ ప్రమోషన్స్ కోసం రేడియోలో యాడ్స్ ఇచ్చేవారు. యాడ్స్ కోసం కొంత అమౌంట్ కట్టేవారు..అప్పుడు సాంగ్స్ మధ్యలో కానీ న్యూస్ మధ్యలో కానీ వాళ్ళ కంపెనీ యాడ్స్ వచ్చేవి.. అలా వారి బిజినెస్ ని రేడియో లా ద్వారా మార్కెటింగ్ చేసికునేవాళ్ళు.
tv మార్కెటింగ్ :
మనం టీవీ చూస్తున్నప్పుడు టీవీ కింద భాగం లో కానీ పైన భాగంలో కానీ.. అలాగే సినిమా చూస్తున్నపుడు మధ్యలో కొన్ని యాడ్స్ మనకు కనిపిస్తాయి. వాటినే టీవీ మార్కెటింగ్ అంటారు,..వీటికి కూడా కొంత అమౌంట్ యాడ్స్ కి చెల్లించ వలిసి ఉంటుంది. ఇలా వాళ్ళ బిజినెస్ ప్రమోట్ చేసికొనేవాళ్ళు..ఇప్పుడుకూడా ఈవిదంగా మార్కెటింగ్ చేసికొనేవాళ్ళు వున్నారు.
ఫోన్ మార్కెటింగ్ :
ఇంటర్నెట్ లేని టైం లో ఫోన్ మార్కెటింగ్ ఎలా ఉండేది అంటే…tele callers ని పెట్టుకొని ఫోన్ లు చేయించెవాళ్ళు. అలాగే SMSs పంపేంచేవారు. ఇప్పుడు లా స్మార్ట్ ఫోన్ లు ఉండేవి కాదు,..చిన్న ఫోన్ లు ఉండేవి. అలా వారి ఫీడ్ బ్యాక్ తీసికొని బిజినెస్ ని పెంచుకొనేవారు.
LED డిజిటల్ బోర్డ్స్ :
ఇవి ఎక్కడ అయితే జనాలు ఎక్కువ వుంటారో(బీచ్ ,..షాపింగ్ కాంప్లెక్స్ ..రెస్టారెంట్స్…సినిమాహాల్…ఎక్సిబిషన్…) అక్కడ పెద్ద పెద్ద డిజిటల్ బోర్డ్స్ పెట్టేవారు.అందులో యాడ్స్ కనిపించేవి,.. ఆ విదంగా వాళ్ళ బిసినెస్ ని ప్రమోట్ చేసికొనేవాళ్ళు.
పాంపులేట్ &బిల్ బుక్ మార్కెటింగ్ :
చాల మంది వాళ్ళ కంపనీ బిజినెస్ పాంపులేట్ తయారు చేసికొని.ఇవి ఎక్కడ అయితే జనాలు ఎక్కువ వుంటారో(బీచ్ ,..షాపింగ్ కాంప్లెక్స్ ..రెస్టారెంట్స్…సినిమాహాల్…ఎక్సిబిషన్…) అక్కడ వాళ్ళ పాంపులేట్ పంచేవారు.వీటికోసం కొన్ని కంపెనీస్ ఒక వక్తిని రెక్యూట్మెంట్ చేసికొనేవాళ్ళు. అదే మాదిరి పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళ బిల్ బుక్ పైన వాళ్ళ యాడ్ డిజైన్ చేసికొని మార్కెటింగ్ చేసికొనేవారు. ఇలా వాళ్ళ బిసినెస్ ని ప్రమోట్ చేసికొనేవాళ్ళు. ఆలా చాలానే ఉండేవి అవన్నీ ఇప్పుడు కనుమరుగు అయిపోయాయి. ఇప్పుడు ఆన్లైన్ మార్కెటింగ్ వచ్చింది.
న్యూస్ పేపర్ :
ఒకప్పుడు న్యూస్ పేపర్ చదివేవారు చాల మంది ఉండేవారు అలా వీటికి కూడా యాడ్స్ కి money ఇచ్చి బిసినెస్ ని ప్రమోట్ చేసికొనేవాళ్ళు.ఇప్పుడుకి కొంతమేర కొనసాగుతుంది.
online marketing digital marketing in Telegu:
offline మార్కెటింగ్ తగ్గి,..ఆన్లైన్ మార్కెటింగ్ ఎందుకు ఇప్పుడు పుంజు కుంది అంటే. ఇప్పుడు అందరి చేతిలో స్మార్ట్ ఫోన్ వాటితోపాటు నెట్. ఇప్పుడు వున్నా పరిస్థితిలు బట్టి చూస్తే 80% peoples ఆన్లైన్ లోనే వుంటున్నారు. ఒకప్పుడు మనకు ఏమి కావాలన్నా మనం అక్కడకు వెళ్లి తెచ్చికొనేవాళ్ళం. ఇప్పుడు మనదగ్గరకే మనకు కావలిసినది వచ్చేస్తుంది ఇంతకంటే ఏమి కావాలి.
డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమిటి?
ఈ రోజుల్లో మన జీవితంలో “ఇంటర్నెట్” ఎంత ముఖ్యమైందో చెప్పనవసరం లేదు. ఇంటర్నెట్ ద్వారా మనం మాట్లాడటం, చదవడం, కొనుగోలు చేయడం, వినోదం పొందడం – అన్నీ జరుగుతున్నాయి. ఇలాంటివేళలో వ్యాపారాలు కూడా తమ ఉత్పత్తులు, సేవలు వినియోగదారులకి చేరవేయడానికి “డిజిటల్ మార్కెటింగ్ ” అనే శక్తివంతమైన సాధనాన్ని ఉపయోగిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే
ఇంటర్నెట్, మొబైల్, సోషల్ మీడియా, సెర్చ్ ఇంజిన్లు, ఈమెయిల్, వెబ్సైట్లు, ఆప్స్ మొదలైన “డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ ” ద్వారా ఉత్పత్తులు లేదా సేవలను ప్రచారం చేయడమే.
డిజిటల్ మార్కెటింగ్ అనేది ఆధునిక వ్యాపార ప్రపంచంలో కళ్ళు లాంటిది. పాత కాలంలో వ్యాపారాలు కస్టమర్లను చేరుకోవడానికి పత్రికలూ, రేడియో,టీవీ వంటి సంప్రదాయ మీడియాను ఆధారపడి ఉండేవి.
కానీ ఇప్పుడు ఇంటర్నెట్ విప్లవం వల్ల, వినియోగదారులు తమ అవసరాలను గూగుల్, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లలో వెతుకుతున్నారు.
డిజిటల్ మార్కెటింగ్ అవసరం ఎందుకు?
ఈ రోజుల్లో 80% కంటే ఎక్కువ మంది తమ అవసరాలను గూగుల్, యూట్యూబ్, ఫేస్బుక్ వంటి ఆన్లైన్ వనరుల ద్వారా వెతుకుతున్నారు. కాబట్టి వ్యాపారం ఆన్లైన్లో లేకపోతే, అది మార్కెట్లో వెనుకబడిపోతుంది. ఎందుకు అంటే పూర్వం షాపింగ్ మాల్ లేదా బజారుకి వెళ్లి కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పుడు ఆన్లైన్లో గూగుల్ లో చర్చ్ చేసి, రివ్యూలు చదివి, ఇంటివద్దకు ఆర్డర్ తీసికుంటున్నారు.
తక్కువ ఖర్చుతో ప్రచారంdigital marketing in Telegu:
పారంపరిక ప్రకటనలు (పేపర్, TV, రేడియో) ఖరీదైనవే. కానీ డిజిటల్ మార్కెటింగ్‌లో చిన్న వ్యాపారాలు కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి చేరుకోవచ్చు. తక్కువ ఖర్చుతో ప్రపంచవ్యాప్తంగా చేరుకోవడం.మీ వ్యాపారం ప్రపంచంలోని ఎక్కడికైనా విస్తరించవచ్చు, మీ సైట్‌ను ఎవరైనా చూసే అవకాశం ఉంటుంది.
టార్గెట్ ఆడియన్స్‌కు చేరుకోవడం:
డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మీ ప్రకటనను వయసు, ప్రదేశం, ఆసక్తులు, వంటి లక్షణాల ఆధారంగా సరైన ప్రేక్షకులకే చూపించవచ్చు.మీ ఉత్పత్తికి సంబంధించి సరైన వయస్సు, ప్రాంతం, లైఫ్‌స్టైల్ కలిగిన ప్రజలను టార్గెట్ చేయవచ్చు.
మెజరబుల్ రిజల్ట్స్:
గూగుల్ అనలిటిక్స్ వంటి టూల్స్ ద్వారా ఫలితాలను ట్రాక్ చేయవచ్చు.
ఫాస్ట్ కమ్యూనికేషన్:
సోషియల్ మీడియా లేదా మెసేజింగ్ యాప్స్ ద్వారా తక్షణమే వినియోగదారుని చేరుకోవచ్చు.గ్లోబల్ ఆడియన్స్ చేరుకోవచ్చు.ROI (Return on Investment) ఎక్కువ.ఫలితాలను రియల్ టైమ్‌లో కనిపెట్టవచ్చు.బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది.కస్టమర్‌తో డైరెక్ట్ కమ్యూనికేషన్ పెరుగుతుంది.
డిజిటల్ మార్కెటింగ్ రకాలు:
SEO (Search Engine Optimization)
SEO అనేది వెబ్‌సైట్‌ను సెర్చ్ ఇంజిన్‌లో టాప్ ర్యాంక్‌లో చూపించడానికి ఉపయోగించే విధానం.
ఉదాహరణ: “విశాఖలో బెస్ట్ ఇంటీరియర్ designer ” అని సెర్చ్ చేస్తే మీ కంపెనీ వెబ్సైట్ మొదటి పేజీలో కనిపించాలి.
SEO ప్రధాన విభాగాలు:
On-page SEO
Off-page SEO
Technical SEO
ప్రయోజనాలు:
ఆర్గానిక్ ట్రాఫిక్ పెరుగుతుంది.బ్రాండ్ నమ్మకం పెరుగుతుంది.దీర్ఘకాలిక ఫలితాలు వస్తాయి.కీవర్డ్ రీసెర్చ్ ఐడియాస్ తెలిసికోవచ్చు. బ్యాక్లింక్ బిల్డింగ్ ఐడియాస్ వస్తాయి.
SEM (Search Engine Marketing)
ఇది పేడ్(paid) అడ్వర్టైజింగ్.ఇది ఒక చెల్లింపు ప్రకటన విధానం, గూగుల్ యాడ్స్, బింగ్ యాడ్స్ వంటివి ఇందులో వస్తాయి. వినియోగదారుడు మీ యాడ్‌పై క్లిక్ చేసినప్పుడు మాత్రమే మీరు చెల్లించాలి.
ఉదాహరణ: Google Ads.
ప్రయోజనాలు:
తక్షణ ఫలితాలు ఉంటాయి.ఖచ్చితమైన టార్గెటింగ్ చేయవచ్చు .
Social Media Marketing (SMM)
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, LinkedIn వంటి ప్లాట్‌ఫార్మ్‌లలో ప్రమోషన్.ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌ల ద్వారా ఉత్పత్తులను ప్రచారం చేయడం.
ఉపయోగాలు:
కస్టమర్ ఎంగేజ్మెంట్ పెరుగుతుంది.బ్రాండ్ అవేర్నెస్ పెరుగుతుంది.ఇన్స్టాగ్రామ్ రీల్స్‌లో బ్రాండ్ ప్రొమోషన్ చేయవచ్చు .ఫేస్బుక్ పేజీ ద్వారా ఆఫర్లు షేర్ చేయడం వంటివి చేయవచ్చు.
Content Marketing(digital marketing in Telegu)
విలువైన కంటెంట్ ద్వారా కస్టమర్లను ఆకర్షించడం.బ్లాగులు, వీడియోలు, ఇన్ఫోగ్రాఫిక్స్, ఈబుక్స్ ద్వారా వినియోగదారులకు విలువైన కంటెంట్ అందించడం
ప్రయోజనాలు:
ఆడియన్స్ ఎంగేజ్మెంట్ పెరుగుతుంది.బ్రాండ్‌కు నమ్మకం వస్తుంది.
Email Marketing
కస్టమర్లకి ఆఫర్లు, న్యూస్లెటర్లు పంపడం.వినియోగదారులకి ఈమెయిల్ ద్వారా ఆఫర్లు, న్యూస్లెటర్లు, అప్డేట్స్ పంపించడం.
Affiliate Marketing
మరొకరి ఉత్పత్తులు అమ్మి కమిషన్ పొందడం.మరొకరి ఉత్పత్తులు ప్రమోట్ చేసి, ప్రతి సేల్‌కి కమిషన్ పొందడం.
Influencer Marketing
సోషల్ మీడియా సెలబ్రిటీల ద్వారా ప్రమోషన్.సోషల్ మీడియాలో ఫేమస్ అయిన ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా ఉత్పత్తులను ప్రమోట్ చేయడం.
Video Marketing
యూట్యూబ్, రీల్స్, షార్ట్ వీడియోల ద్వారా ప్రచారం.యూట్యూబ్, ఫేస్బుక్ వీడియోలు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా మార్కెటింగ్ చేయడం.
డిజిటల్ మార్కెటింగ్ టూల్స్digital marketing in Telegu:
Google Analytics
వెబ్సైట్ ట్రాఫిక్‌ను విశ్లేషించేందుకు.
Google Ads
పేడ్ యాడ్వర్టైజింగ్ నిర్వహించేందుకు.
SEMrush, Ahrefs
SEO కీవర్డ్ రీసెర్చ్, బ్యాక్లింక్ విశ్లేషణ కోసం.
Canva
సోషియల్ మీడియా పోస్టర్స్ డిజైన్ చేయడానికి .
Mailchimp
ఇమెయిల్ మార్కెటింగ్ ఆటోమేషన్ కోసం.
Buffer / Hootsuite
సోషియల్ మీడియా పోస్టింగ్ షెడ్యూల్ చేసేందుకు.
డిజిటల్ మార్కెటింగ్ ఎక్కడ ఉపయోగపడుతుంది?
ఇ-కామర్స్ వ్యాపారాలు (Amazon, Flipkart….. వంటివి )
సర్వీస్ ఆధారిత సంస్థలు (డాక్టర్స్, లాయర్స్, కన్సల్టెంట్స్…..)
ఎడ్యుకేషన్ సంస్థలు (ఆన్లైన్ కోర్సులు, ఇనిస్టిట్యూట్స్….)
ఫ్రీలాన్సర్లు (డిజైనర్లు, రైటర్లు, డెవలపర్లు….)
స్థానిక వ్యాపారాలు (హోటల్స్, కాఫీ షాప్స్, బ్యూటీ పార్లర్లు,రియల్ ఎస్టేట్,కన్స్ట్రక్షన్ ….)
డిజిటల్ మార్కెటింగ్‌లో కెరీర్ అవకాశాలు:
ఈ రంగం రోజురోజుకూ విస్తరిస్తోంది. కొన్ని ప్రముఖ ఉద్యోగాలు ఇవే:
డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్
SEO స్పెషలిస్ట్
సోషల్ మీడియా మేనేజర్
కంటెంట్ రైటర్
PPC స్పెషలిస్ట్
ఇమెయిల్ మార్కెటింగ్ ఎక్సపర్ట్
వెబ్ అనలిటిక్స్ ఎక్స్పర్ట్
డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ ఎవరికీ అవసరం ;
డిజిటల్ మార్కెటర్స్ కి
స్టూడెంట్స్
ఫ్రెషర్స్
జాబ్ చేంజర్స్
ఫ్రీలాన్సర్స్
బిజినెస్ ఓనర్స్…..
అందరికీ సరిపడే ఫ్లెక్సిబుల్ & ఫ్యూచర్ కెరీర్….కంటెంట్ రైటింగ్ కెరీర్ అవకాశాలు:https://digitaldasaradh.com/content-writing-jobs
digitaldasaradh.com: digital marketing jobs
DigitalDasaradh.com అనేది ఒక నమ్మకమైన సంస్థ .ఈ సంస్థ Google Ads & PPC Service Provider in Vizag. SEO, SMM, Web Design, Content Marketing తో పాటు, “Digital marketing” లోనూ మంచి ఫలితాలు ఇచ్చే విధంగా పనిచేస్తుంది.మీ బిజినెస్‌ను ఒక లెవెల్ పైకి తీసుకెళ్లే Graphic Design Services కోసం digitaldasaradh.com ను సంప్రదించండి.
మీ వ్యాపారం Googleలో Top Position లో కనబడాలంటే, మరియు Quick Leads & Sales కావాలంటే మమ్మల్ని DigitalDasaradh.com ను సంప్రదించండి.వైజాగ్ లో వ్యాపారాలు డిజిటల్ రంగంలో ముందంజ వేయాలంటే “Digital Marketing’ అనేది తప్పనిసరి.best laptop కోసం https://amzn.to/3VsQec3


