Blog vs Blogging? Blog vs Blogging అంటే ఏమిటి? ఏది మనకి ఉపయోగం?
Blog vs Blogging?
Blog vs Blogging: ఇంటర్నెట్ డిజిటల్ ప్రపంచం రోజురోజుకూ పెరుగుతున్న కొద్దీ “బ్లాగ్” (Blog) మరియు “బ్లాగింగ్” (Blogging) అనే పదాలు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. బ్లాగ్ మరియు బ్లాగింగ్ రెండూ ఒకేలా అనిపించవచ్చు కానీ వాస్తవానికి అవి రెండు వేర్వేరు కాన్సెప్టులు.ఈ ఆర్టికల్‌లో మనం చాలా స్పష్టంగా….బ్లాగ్ అంటే ఏమిటి?….బ్లాగింగ్ అంటే ఏమిటి?….ఈ రెండు మధ్య తేడా ఏమిటి?…..ఏది నేర్చుకోవాలి?….ఎలా నేర్చికోవాలి ?…ఏది సంపాదనకు ఉపయోగపడుతుంది?…..ఇవి నేర్చికుంటే భవిష్యత్తు అవకాశాలు ఏమిటి?అన్న విషయాలను క్షున్నంగా తెలుసుకుందాం. ఇందులో ముందుగా
what is blog?
what is blog: బ్లాగ్ అంటే content /ఇన్ఫర్మేషన్ ని పబ్లిష్ చేసే platform. కంటెంట్ ఎలా పబ్లిష్ అవుతుంది అంటే chronological ఆర్డర్లో పబ్లిష్ అవుతుంది.అంటే లేటెస్టుగా రాసె పోస్ట్ ముందుగా కనిపిస్తుంది.బ్లాగ్ అనేది వెబ్సైటు లో ఒక భాగం.బ్లాగ్ అనేది కంటెంట్ మీద డిఫెండ్ అవుతుంది.రెగులర్ గా పోస్ట్ చేయాలంటే బ్లాగ్ ఉండాలి. బిజినెస్‌కి కస్టమర్లను ఆకర్షించడంలో బ్లాగ్ చాలా ఉపయోగపడుతుంది. అయితే, బిజినెస్ ఉన్నప్పుడు బ్లాగ్ + వెబ్సైట్ కలిపితే మరింత శక్తివంతం అవుతుంది. మీ బ్లాగ్ క్లిక్ అయితే పెద్ద పెద్ద కంపెనీస్ నుండి స్పాన్సర్స్ వస్తారు. బ్లాగ్ క్రియేట్ చేయడం చాలా ఈజీ.బ్లాగ్ అనేది మనం పాఠకులకు ఉపయోగకరమైన సమాచారాన్ని పంచుకునే ప్లాటుఫామ్ .
బ్లాగ్ ఎప్పుడు పుట్టింది? (History in Simple Words):
ప్రపంచంలో మొదటి బ్లాగ్ 1994లో రూపాంతరం చెందింది అని చెప్తారు. అప్పట్లో బ్లాగ్లు పర్సనల్ డైరీస్ లాగా ఉండేవి….ప్రతి రోజు ఎలా గడిచింది, ఏమి జరిగిందో రాసుకునే విధంగా.కానీ కాలక్రమేణా బ్లాగ్లు….పర్సనల్ డైరీల నుండి….. ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ సైట్లుగా మారాయి…..ఇప్పుడైతే బ్లాగ్ అనేది ఒక పెద్ద ఇండస్ట్రీగా ఎదిగింది.
Blog మొదలుపెట్టడానికి ఏమి అవసరం?
మొదలుపెట్టడానికి …ఒక ల్యాప్‌టాప్ / మొబైల్….ఇంటర్నెట్….ఒక డొమైన్ & హోస్టింగ్ (తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉన్నాయి)….రాయాలనే ఆసక్తి పట్టుదల ఉండాలి.బ్లాగ్ డిజైన్ ప్లాటుఫామ్. టెక్నికల్ స్కిల్స్ ఎక్కువ అవసరం లేదు.
Basic Requirements:
Laptop / Mobile
Internet
Domain name
Hosting
WordPress
Basic writing skill
Patience
Blog Definition in Simple Telugu:
బ్లాగ్ అనేది ఇంటర్నెట్లో ఉండే ఒక సమాచార వేదిక (website లేదా webpage), ఇందులో మనం పాఠకుల కోసం ఆర్టికల్స్, కథనాలు, సమాచారం, టిప్స్, న్యూస్, గైడ్స్ రూపంలో కంటెంట్‌ను పబ్లిష్ చేస్తాం. రాసిన కంటెంట్‌ను ప్రపంచానికి చూపే ఒక ఆన్లైన్ నోట్‌బుక్. ఇంటర్నెట్లో మన మాట, మన జ్ఞానం, మన అనుభవం పంచుకునే డిజిటల్ స్థలం.
Blog Can Change Your Life:Blog vs Blogging
బ్లాగ్ కి ఒక చిన్న పెట్టుబడి పెట్టినట్లు అయితే
మీ knowledge ….. income
మీ రాత…. brand
మీ articles ….. passive income
మీ blog ….. future security
6 నెలలు focus చేసి పనిచేస్తే, బ్లాగింగ్ మీకు:
Freedom
Money
Reputation
Opportunities
వీటి అన్నీటిని ఇస్తుంది.Earnings =Traffic × CTR × CPC × Affiliate Sales.

BLOG NICHES అంటే ఏమిటీ /కొన్ని టిప్స్:
బ్లాగ్ నిచ్ అంటే మీ బ్లాగ్ మొత్తం ఏ విషయం మీద కంటెంట్ రాయబోతుందో ఆ టాపిక్‌నే నిచ్ అంటారు. ex :మీరు Digital Marketing గురించే రాస్తే అది మీ బ్లాగ్ నిచ్.మీరు House Construction గురించి రాస్తే అది మీ నిచ్,మీరు Travel పై రాస్తే Travel నిచ్,మీరు Recipes రాస్తే Food నిచ్ అవుతుంది. ఇందులో కొన్ని ఐడియాస్.1) డిజిటల్ మార్కెటింగ్ & ఆన్లైన్ మనీ, 2) హౌస్ కన్స్ట్రక్షన్ & ఇంటీరియర్ డిజైన్, 3) పర్సనల్ ఫైనాన్స్ & ఇన్వెస్ట్మెంట్స్, 4) హెల్త్ & ఫిట్నెస్ (సింపుల్ లాంగ్వేజ్‌లో), 5) ఫుడ్ & కుకింగ్, 6) టెక్నాలజీ & మొబైల్, 7) ట్రావెల్ & లోకల్ టూరిజం, 8) స్టూడెంట్స్ & ఎడ్యుకేషన్, 9) బ్యూటీ & స్కిన్‌కేర్, 10) ఫ్యామిలీ & లైఫ్‌స్టైల్, 11) Real estate niche , 12 ) AI + Digital Marketing niche ,13) Home appliances niche , 14) WordPress నిచ్.
Niche ఎలా ఉండాలి?Blog vs Blogging
మీకు knowledge ఉన్నది, మీకు రాయడం ఇష్టం ఉన్నది ఎంచుకోవాలి.Google లో ఎక్కువ demand ఉన్నది సెలెక్ట్ చేసికుంటే మంచిది.అప్పుడే దాని ద్వారా సంపాదించగలం.
Niche ఎంచుకోవడంలో biggest mistakes ఏమిటీ అంటే వేరే వాళ్లు రాస్తున్నారని మీరు కూడా అదే టాపిక్ పై రాయడం.మీకు knowledge లేని విషయం ఎంచుకోవడం.
డిజిటల్ మార్కెటింగ్ వారికీ ఏది బెటర్:
బ్లాగ్ /వెబ్సైటు ఈ రెండుఇంటిలో Blog ఉత్తమం ఎందుకంటే మీరు SEO నేర్చుకుంటారు,ట్రాఫిక్ సంపాదిస్తారు,Money earn చేయగలరు,వెబ్సైటు/బ్లాగ్ పైన పట్టు సాధిస్తారు.అలాగే SEO కోణంలో ఇది అత్యుత్తమము.బ్లాగ్ ద్వారా ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది.SEO సులువు గా నేర్చికోవచ్చు.డబ్బు సంపాదించే అవకాశాలు ఎక్కువ.ఇది కంటెంట్ ఆధారంగా ఎదగగల బ్రాండ్.అంటే బ్లాగ్ వల్ల ర్యాంకింగ్ అవకాశాలు 10 రెట్లు పెరుగుతాయి.Website + Blog కలిపి వాడితే మీ ఆన్లైన్ ప్రెజెన్స్ 5x పెరుగుతుంది.
BLOG ఉపయోగం ఏమిటి:
ఈ రోజుల్లో సైడ్ ఇన్కమ్ కోసం చాలామంది వివిధ ఆదాయ మార్గాలను వెతుక్కుంటున్నారు.ఇలాంటి వారికీ బ్లాగ్ అనేది ఓ మంచి అవకాశముగా మారింది అని చెప్పవచ్చు.ఎందుకంటే బ్లాగ్ చేయడానికి ఎక్కువ పెట్టుబడి అవసరం లేదు.ప్రేక్షకులకి అలరించడానికి ఆకర్షణీయమైన కంటెంట్‌ని సృష్టిస్తే సరిపోతుంది.మీకు దేనిలో నైపుణ్యం వుందో ఆ విషయంపై మీ పాఠకులకు ఉపయోగకరమైన సమాసారాన్ని అందిస్తే అదే మీ ఆదాయ మార్గాన్ని పెంచడానికి సహాయపడుతుంది.మీరు గణనీయమైన రీడర్ షిప్ ను సొంతం చేసికోవడానికి ప్రయత్నించాలి.పెద్ద బ్రాండ్లు, పెద్ద కంపెనీస్ కూడా తమ వెబ్ ఆధారిత ప్లాటుఫామ్స్ కోసం ఆసక్తికరమైన వీడియోస్, పోస్టులను maintenance చేయగల బ్లాగర్లను నియమించుకుంటున్నాయి.సోషల్ మీడియా ద్వారా మీ ప్రేక్షకులతో పరస్పర చర్చ చేయడం వల్ల మీ బ్లాగ్ పరిధి, ఆదాయ సామర్థ్యం మరింత పెరగవచ్చు.
బ్లాగ్ ఎందుకు అవసరం?
బ్లాగ్ వల్ల మీరు మీకంటు ఆన్లైన్లో ఒక బ్రాండ్ సంపాదించుకుంటారు. మీకు నిష్‌లో authority వస్తుంది.మీ కంటెంట్ బాగుంటే పాఠకులు మీపై నమ్మకం పెంచుకుంటారు.SEO ద్వారా Google లో ర్యాంక్ పొందుతారు.Ads, affiliate ద్వారా డబ్బు సంపాదిస్తారు.ఇది మీకోసం 24/7 పనిచేసే ఒక platform.మీ జ్ఞానాన్ని పంచుకోగలరు.దీన్ని ఒక్కసారి క్రియేట్ చేస్తే జీవితాంతం ఉపయోగపడుతుంది.బ్లాగ్ అంటే మనం రాసిన కంటెంట్‌ను ప్రపంచానికి చూపే ఒక ఆన్లైన్ నోట్‌బుక్ లేదా డైరీ . బ్లాగ్ అంటే ఇంటర్నెట్లో మన మాట, మన జ్ఞానం, మన అనుభవం పంచుకునే డిజిటల్ స్థలం.Work from Home ….ఎక్కడ ఉన్నా పని చేయొచ్చు.
ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న bloggers:
Neil Patel
Darren Rowse
Harsh Agrawal (India)
Amit Agarwal (India)
వీరు ఇవాళ లక్షల ఆదాయం పొందుతున్నారు.
మీ బ్లాగ్‌లో ప్రారంభంలో ఉండాల్సిన pages:
ఒక ప్రొఫెషనల్ బ్లాగ్‌లో సాధారణంగా ఇవి ఉంటాయి:
Blog Posts
ఇవి బ్లాగ్‌లోని articles. ప్రతి పోస్ట్ ఒక separate topic మీద ఉంటుంది.
Categories
విషయాల ప్రకారం కంటెంట్‌ను విభజించడం.
ఉదా: Travel blog → Food, Places, Hotels, Tips…
Tags
ప్రతి పోస్ట్‌కు సంబంధించిన కీవర్డ్స్.
Homepage
బ్లాగ్‌లో తాజా ఆర్టికల్స్ కనిపించే పేజీ.
About Page
మీ గురించి, మీ బ్లాగ్ గురించి పాఠకులు తెలుసుకునే పేజీ.
Contact Page
పాఠకులు లేదా బ్రాండ్స్ మీను సంప్రదించడానికి.
terms and conditions
Privacy Policy
Disclaimer
ఇవి AdSense approval కోసం చాలా అవసరం.
బ్లాగ్ డిజైన్ ప్లాటుఫామ్స్ :Blog vs Blogging
WordPress.org
సర్వశ్రేష్ఠం — 70% బ్లాగర్లు ఉపయోగిస్తారు.
Blogger.com
ఫ్రీ కానీ లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి .
Wix, Squarespace ఇవి Simple drag & drop సైట్లు.
Medium, Weebly ,Web flow
Writing-only platform.
why Install WordPress:
WordPress ప్రపంచంలో 70% బ్లాగర్లు ఉపయోగిస్తారు.ఎందుకంటే ..Easy to use ….. SEO-friendly …..Plugins సపోర్ట్…..Themes సపోర్ట్…..No technical knowledge needed . అందుకే వర్డుప్రెస్సు అనేది అంత ఫేమస్ అయ్యింది.
Blog లో చేయకూడని Mistakes:
రోజూ కంటెంట్ రాయకపోవడం,Keyword research చేయకపోవడం.Copy content publish చేయడం. అప్పుడప్పుడూ blog ని అప్డేట్ చేయకపోవడం,Too many topics రాయడం.1–2 నెలల్లోనే blogని వదిలేయడం.
Keyword research చేయకపోవడం,Copy content వాడడం,SEO నేర్చుకోకపోవడం,10 articles రాసి ఆగిపోవడం,One-month expectations తో రావడంమొదటి 30 రోజుల్లోనే drop అవ్వడం, Short content (300–400 words) రాయడం….వంటివి చేయకూడదు.
Blog ద్వారా త్వరగా సంపాదించాలంటే ఏమి చేయాలి?
High CPC keywords target చేయండి(USA/UK traffic aim చేయండి). Long articles రాయండి (1500–3000 words).Affiliate articles ఎక్కువ రాయండి. 3–6 నెలలు consistent గా పని చేయండి(Consistency is Gold ). ఒకే niche పై దృష్టి పెట్టండి.
Digital Products అంటే ఏమిటీ?exmples?
మీ బ్లాగ్‌కు మంచి value వచ్చేలా మీరు మీ స్వంత products తయారు చేసి అమ్మవచ్చు. అయితే వాటిలో మీకు మంచి స్కిల్ ఉండాలి .
Digital Product Examples: E-బుక్స్……Diet plans …..Online courses …..Templates ….
Why digital products are best?
Zero cost
High profit
Sell unlimited
ఒక్కసారి తయారు చేసి జీవితాంతం అమ్మవచ్చు….మనీ ఎర్నింగ్ చేయవచ్చు.
Promote Your Blog in SM :
మీరు రాసిన బ్లాగ్ ని SM(సోషల్ మీడియా ) platform లలో ప్రమోట్ చేసికోవాలి.
Articles Promote చేయండి లేదా పబ్లిష్ చేయడానికి
WhatsApp groups
FB groups
Instagram stories
YouTube community
Promotion = fast indexing.
YouTube
Telegram
బ్లాగ్ రకాలేమిటి? (Types of Blogs)
ఇంటర్నెట్లో వేల రకాల బ్లాగ్లు ఉన్నాయి, అయితే ప్రధానంగా 10 టైప్స్ ముఖ్యమైనవి:
1. Personal Blog
వ్యక్తిగత అనుభవాలు, అభిప్రాయాలు….పంచుకోవచ్చు.
2. Niche Blog
ఒకే విషయం మీద బ్లాగ్.
ఉదా: SEO Blog, Cooking Blog…
3. Business Blog
మీకు మీ బిజినెస్ కోసం ట్రాఫిక్ తెచ్చే బ్లాగ్.
4. News Blog
తాజా విశేషాలు, అప్డేట్స్…..తెలిసికోవచు.
5. Review Blog
మొబైల్స్, గాడ్జెట్స్, ప్రొడక్ట్స్ , మూవీస్ గురించి రివ్యూలు రాయడం .
6. Travel Blog
ప్రయాణ అనుభవాలు, గైడ్లు…మంచి మంచి ప్లేసెస్ గురించి తెలిసికోవచ్చు.
7. Food Blog
రెసిపీలు, తినడానికి మంచిహోటల్స్…చోటులు….గురించి తెలిసికోవచ్చు.
8. Educational Blog
స్టడీ మెటీరియల్స్, గైడ్స్.జాబ్స్ గురించి రాసె బ్లాగ్ .
9. Health Blog(Blog vs Blogging)
హెల్త్ టిప్స్, ఫిట్నెస్ ఐడియాలు గురించి చెప్పే బ్లాగ్
10. Lifestyle Blog
రోజువారీ జీవనశైలి గురించి రాయవచ్చు.
AdSense అప్లై చేయడానికి ముందు;
Consistency = Success ……బ్లాగింగ్లో consistency అన్నది GOLD.మీరు 1 నెలలో drop అయితే, బ్లాగింగ్ మీకు కష్టమే.
Week కి 2 articles
Month కి 8–10 articles ….అయినా minimum రాయాలి అప్పుడు …6 నెలలలో మీ బ్లాగ్ కి బాగా ట్రాపిక్ పెరుగుతుంది.
Word count ఎంత ఉండాలి?
Minimum: 1200 words
Best: 2000–3000 words
SEO (Search Engine Optimization)
SEO అనేది వెబ్సైట్ కి కానీ బ్లాగ్ కి కానీ మంచి traffic రావాలంటే SEO చాల అవసరం.సెర్చ్ ఇంజిన్‌లో టాప్ ర్యాంక్‌లో కనిపించడాన్ని SEO అంటారు.SEO అనేది వెబ్సైట్ కి కానీ బ్లాగ్ కి కానీ first place లోకి తీసికొనిరావడానికి చాల ఉపయోగపడుతుంది. ఎటువంటి ఖర్చు పెట్టకుండను ఆర్గానిక్ గా రిజల్ట్స్ వస్తాయ్. కానీ ఒక్క రోజులో అయ్యేది కాదు 3 to 6 months time తీసికుంటుంది. best laptop కోసం https://amzn.to/4pAvxZr
మీకు వెబ్సైటు vs బ్లాగ్ ట్యుటోరియల్ కావాలంటే https://digitaldasaradh.com/website-vs-blog-website-blog-%e0%b0%8f%e0%b0%a6%e0%b0%bf-%e0%b0%ae%e0%b1%80%e0%b0%95%e0%b1%81-%e0%b0%b8%e0%b0%b0%e0%b1%88%e0%b0%a8%e0%b0%a6%e0%b0%bf/?preview_id=4519&preview_nonce=ced8cbadff&post_format=standard&_thumbnail_id=4554&preview=true
what is blogging?
what is blogging: ఈ రోజుల్లో సైడ్ ఇన్కమ్ కోసం చాలామంది వివిధ ఆదాయ మార్గాలను వెతుక్కుంటున్నారు.ఇలాంటి వారికీ బ్లాగింగ్ అనేది ఓ మంచి అవకాశముగా మారింది అని చెప్పవచ్చు.ఎందుకంటే బ్లాగింగ్ చేయడానికి ఎక్కువ పెట్టుబడి అవసరం లేదు.ప్రేక్షకులకి అలరించడానికి ఆకర్షణీయమైన కంటెంట్‌ని సృష్టిస్తే సరిపోతుంది.మీకు దేనిలో నైపుణ్యం వుందో ఆ విషయంపై మీ పాఠకులకు ఉపయోగకరమైన సమాసారాన్ని అందిస్తే అదే మీ ఆదాయ మార్గాన్ని పెంచడానికి సహాయపడుతుంది.మీరు గణనీయమైన రీడర్ షిప్ ను సొంతం చేసికోవడానికి ప్రయత్నించాలి.పెద్ద బ్రాండ్లు, పెద్ద కంపెనీస్ కూడా తమ వెబ్ ఆధారిత ప్లాటుఫామ్స్ కోసం ఆసక్తికరమైన వీడియోస్, పోస్టులను maintenance చేయగల బ్లాగర్లను నియమించుకుంటున్నాయి.సోషల్ మీడియా ద్వారా మీ ప్రేక్షకులతో పరస్పర చర్చ చేయడం వల్ల మీ బ్లాగ్ పరిధి, ఆదాయ సామర్థ్యం మరింత పెరగవచ్చు.
బ్లాగింగ్ (Blogging) అంటే ఏమిటి?
బ్లాగ్ అనేది ఒక “ప్లాట్ఫార్మ్” అయితే…బ్లాగింగ్ అనేది ఆ ప్లాట్ఫార్మ్ను నడిపేది(బ్లాగింగ్ = బ్లాగ్‌ను నిర్వహించడం + కంటెంట్ రాయడం + ప్రచారం చేయడం + SEO చేయడం). అంటే: బ్లాగ్ డిజైన్ చేయడం,అందులో ఆర్టికల్స్ రాయడం,కీవర్డ్ రీసెర్చ్ చేయడం, ఇమేజ్‌లు తయారు చేయడం,ఆబ్లాగ్ కి SEO చేయడం,ట్రాఫిక్ తీసుకురావడం,బ్లాగ్‌ను monetize చేయడం,ఈ మొత్తం ప్రక్రియనే బ్లాగింగ్ అంటారు.బ్లాగింగ్ అంటే కేవలం రాయడం కాదు(Writing ,..Editing ,…Publishing ,…Promotion ,….Analytics ,….Traffic building ,….Audience building ,….ఇవి అన్నీ కలిపి “బ్లాగింగ్” అవుతుంది). ex : బ్లాగ్ = హౌస్ అనుకుంటే,బ్లాగింగ్ = ఆ హౌస్‌ను క్లీన్ చేయటం, డెకరేట్ చేయటం, మెయింటెయిన్ చేయటం.బ్లాగ్‌ని ప్రమోట్ చేయడం,బ్లాగ్‌ని monetize చేయడం.
బ్లాగింగ్ ఎందుకు అవసరం?
బ్లాగ్‌ను సక్సెస్ చేయడానికి బ్లాగింగ్ చాలా ముఖ్యము.బ్లాగింగ్ వల్ల కొత్త కొత్త పాఠకులు వస్తారు.Google లో ర్యాంకింగ్ మెరుగుపడుతుంది.కంటెంట్ నాణ్యత పెరుగుతుంది.సైట్ authority పెరుగుతుంది.సైట్ కి ట్రాఫిక్ పెరుగుతుంది. Monetization అవకాశాలు పెరుగుతాయి.బ్లాగింగ్ అనేది ఒక నైపుణ్యం (Skill) దాన్ని నేర్చుకున్న తర్వాత మీరు జీవితాంతం వాటిని ఉపయోగించగలరు.
Blogging లో ఉండే లోపాలు:
మొదట్లో ట్రాఫిక్ రాకపోవడం,కొన్నిసార్లు one month కి result వస్తుంది,కొన్ని సార్లు 6months అయినా result రాకపోవచ్చు.నియమితంగా కంటెంట్ రాయకపోతే బ్లాగ్ grow కాదు.SEO అర్థం చేసుకోవాలి.సహనం, పట్టుదల,ఓపిక అవసరం.పోటీ ఎక్కువగా ఉంటుంది తట్టుకొని నిలబడాలి.అయినా…పట్టుదల ఉంటే 100% సక్సెస్ అవుతారు.
Blogging వల్ల కలిగే ప్రయోజనాలు:
జీవితాంతం ఉపయోగపడే SEO & Writing స్కిల్స్ నేర్చికోవచ్చు.Passive income వస్తుంది, Online identity వస్తుంది.Work from home జాబ్స్ ఉంటాయి.మీ Business ని grow చేసికోవచ్చు. Freelancing అవకాశాలు పొందవచ్చు.బ్రాండ్ image అండ్ సృజనాత్మకత పెరుగుతుంది.
ఎవరు బ్లాగింగ్ ప్రారంభించాలి?
రైటింగ్ పైన పట్టు ఉంటే బ్లాగింగ్ అనే skill ఏ రంగంలోవారికియైన ఉపయోగపడుతుంది. ex :స్టూడెంట్స్,Housewives , ఫ్రీలాన్సర్స్,Digital marketers , Business ఓనర్స్, టీచర్స్, Content creators , Small business owners,….వీలుఅందరు బ్లాగింగ్ ద్వారా ప్రతి నెల ₹10,000 – ₹1,00,000+ వరకు సంపాదిస్తున్నారు.(blogging Success formula = Quality content + Consistency + SEO).
Blogging vs Blog – ఏది ముఖ్యమైనది?
బ్లాగ్ ఉన్నా బ్లాగింగ్ లేకపోతే సైట్ grow కాదు.బ్లాగింగ్ ఉన్నా బ్లాగ్ లేకపోతే మీరు రాయలేరు.అంటే…రెండు కలిపి ఉంటేనే విజయం.బ్లాగ్ అనేది = ప్లాట్ఫార్మ్ అనుకుంటే , బ్లాగింగ్ = ఆ ప్లాట్ఫార్మ్ను రన్ చేసే ఇంధనం లాంటిది.డబ్బు సంపాదించేది బ్లాగ్ ద్వారా,కానీ ఆ డబ్బు రావడానికి బాధ్యత వహించేది బ్లాగింగ్.సరిగ్గా చేసుకున్నవారికి బ్లాగింగ్ కెరీర్, సైడ్ ఇన్కమ్, పర్సనల్ బ్రాండ్, మరియు డిజిటల్ ఫ్రీడమ్ ఇస్తుంది.
Blog (బ్లాగ్):
ఒక వెబ్సైట్ లేదా పేజీ లో కంటెంట్ కనిపించే లేదా చూపించే ప్లేస్…మీ content నచ్చితే పాఠకులు చదవడానికి వస్తారు.
Blogging (బ్లాగింగ్):
కంటెంట్ నిరంతరం రాసె ప్రక్రియ,…సైట్ ని ర్యాంక్ చేయడం…SEO, marketing చేయడం….సైట్ కి ట్రాఫిక్ తెస్తుంది.
Blogging లో ఉండే ముఖ్యమైన స్టెప్స్:
Niche Selection
ఏ విషయం(topic selection ) మీద రాయాలి? అనేది తెలిసికోవడం.
ఉదా: Digital marketing, travel, food, house construction…
Keyword Research
జనం ఎక్కువుగా గూగుల్ లో ఏమి సెర్చ్ చేస్తున్నారు అని తెలిసికోవడం వాటిపైన ఆర్టికల్ రాయాలి అప్పుడే మీ ఆర్టికల్ ఎక్కువమంది చూస్తారు.
Quality Content Writing
1000 – 3000 quality words articles రాయడం.
Publishing
ఆర్టికల్‌ను బ్లాగ్‌లో అప్లోడ్ చేసి పబ్లిష్ చేయడం.
SEO Optimization
Google లో ర్యాంక్ వచ్చేలా ఆప్టిమైజ్ చేయడం.
Blog Design
User-friendly థీమ్, మెను, categories. అనేవి బ్లాగ్ ఉండేటట్లు చూసికోవాలి.
Promotion
WhatsApp, Instagram, YouTube, FB లో షేర్ చేయడం.ట్రాఫిక్ ని పెంచుకోవడం.
Monetization
AdSense, Affiliate links, Sponsored posts.వీటి ద్వారా ఆదాయం పొందవచ్చు .
Updating
పాత ఆర్టికల్స్‌ను అప్పుడు అప్పుడు రిఫ్రెష్ చేయడం.
Blogging కి భవిష్యత్తు ఉందా?Blog vs Blogging
Blogging కి భవిష్యత్తు 100% ఉంది.గూగుల్, యూట్యూబ్, సోషల్ మీడియా—కంటెంట్ ఆధారంగా నడుస్తున్నాయి.AI వచ్చినా కూడా కంటెంట్ అవసరం తగ్గదు.ఇప్పుడు Telugu blogs వేగంగా ఎదుగుతున్నాయి.అలాగే AdSense రేట్లు బాగ పెరుగుతున్నాయి.Affiliate sales పెరుగుతున్నాయి.భవిష్యత్తు పూర్తిగా కంటెంట్ economy అవచ్చు.క్రియేటివ్‌గా ఉండటం(ఆలోసించడం), రాయడం ఇష్టం ఉండటం—ఇది చాలు!”. ఇవి సరిగ్గా చేస్తే బ్లాగింగ్ ఒక మంచి passive income source ని ఇస్తుంది.
Blogging ఎందుకు ప్రారంభించాలి?
Knowledge పంచుకోవచు.మీ జ్ఞానం, అనుభవం ప్రపంచానికి తెలుస్తుంది.Career గ్రోత్ అవుతుంది….Content writing, SEO, Digital marketing career లకు ఇది చాల ఇంపార్టెంట్.Traffic ఉన్న బ్లాగ్ ఎప్పుడూ డబ్బు సంపాదిస్తుంది.మీకు అంటూ ఒక Personal branding ఏర్పడుతుంది.మీరు ఒక industry expert గా కనిపిస్తారు.Work from home ఫ్రీడమ్…..ఎక్కడ ఉన్నా కంటెంట్ రాయవచ్చు. బిజినెస్ ఉన్నవారికి blogging ద్వారా organic traffic వస్తుంది..
Blogging రకాలేమిటి? (Types of Blogging):
బ్లాగింగ్లో అనేక రకాలున్నాయి. అవి మీ ఆసక్తి, మీ జ్ఞానం పైన ఆధారపడుతుంది . అందులో కొన్ని examples :
Personal Blogging
ఈ బ్లాగింగ్ ద్వారా(ఆన్లైన్ డైరీ) మీ అనుభవాలు, కథలు, కష్టాలు, సుఖాలు,మనోభావాలు ప్రపంచానికి పంచుకోవచ్చు(ex : అమితాబ్‌బచన్).
Professional Blogging(Blog vs Blogging)
మీరు ఎంచుకున్నఏదయినా విషయంపై professional content రాయడం .
Business Blogging
మీ బిజినెస్ దేనికి సంబందించిందో వాటిపై ఆర్టికల్స్ రాసి బిజినెస్‌కు ట్రాఫిక్ తెచ్చేకోవచ్చు,బిజినెస్ ని grow చేసికోవడం, బ్రాండింగ్ చేసికోవడం.
Review Blogging
movies కి రివ్యూ ఇచ్చే బ్లాగ్స్ రాయడం .Products, services, gadgets రివ్యూలు రాయడం.
News Blogging
తాజా వార్తలు, అప్డేట్లు ఇవ్వడం .
Blogging ద్వారా ఎలా డబ్బు సంపాదించవచ్చు?
Google AdSense
మీ బ్లాగ్ బాగా సక్సెస్ అయితే మీ బ్లాగ్‌పై Ads కనిపిస్తాయి వీటి ద్వారా మీరు earn చేయవచ్చు .
Affiliate Marketing
మీ బ్లాగ్ లో ప్రొడక్ట్స్ యొక్క affiliate links వుంచినప్పుడు, మీరు suggest చేసిన ప్రొడక్ట్ కొనుగోలు చేస్తే వీటిద్వారా కమిషన్ వస్తుంది.
Sponsorship
మీ బ్లాగ్ సక్సెస్ అయినాక కొంతమంది స్పానర్స్ వచ్చి వారి Brands గురించి మీ బ్లాగ్‌లో ఆర్టికల్ పెట్టమని అడుగుతారు ఇలా కూడా డబ్బులు వస్తాయి.
Digital Products
E-books, Courses, Templates మన బ్లాగ్ లో పబ్లిష్ చేసి sale చేసి డబ్బులు సంపాదించవచ్చు.
Services
మీ బిజినెస్ కి సంబంధించి సేవలు అందించి వీటి ద్వారా earn చేయవచ్చు. (ఉదా: SEO, DM, చిట్కాలు) కస్టమర్లు వస్తారు.
Freelance Opportunities
మీ రాతలు చూసి చాలా కంపెనీలు పనులు ఇస్తాయి.ఆఫీస్ జాబ్స్ తో పాటు ఇంటి నుంచే ప్రాజెక్ట్స్ చేయవచ్చు
Blogging కోసం అవసరమైన Tools:Blog vs Blogging
బ్లాగింగ్ సక్సెస్ కావడానికి ఇవి చాల ఉపయోగపడతాయి:
WordPress((Domain + Hosting + Theme Install )
Google Keyword Planner
Uber suggest
Canva
Grammarly
Google Analytics
Rank Math / Yoast SEO,…..digital marketing road map ట్యుటోరియల్ కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి https://digitaldasaradh.com/digital-marketing-roadmap-for-beginners-%e0%b0%a1%e0%b0%bf%e0%b0%9c%e0%b0%bf%e0%b0%9f%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%ae%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%95%e0%b1%86%e0%b0%9f%e0%b0%bf%e0%b0%82%e0%b0%97/?preview_id=4457&preview_nonce=963db68984&post_format=standard&_thumbnail_id=4496&preview=true
Blogging లో చేసే తప్పులు:Blog vs Blogging
కొత్తవారు సాధారణంగా చేసే mistakes ఏంటి అంటే Low-quality content రాయడం(కంటెంట్ high quality ఉండాలి).Daily consistency లేకపోవడం.అంటే గుర్తు వచ్చినప్పుడు పోస్టులు చేయడం కాదు డైలీ కానీ three days కానీ weekly అయిన పోస్ట్ చేయాలి.SEO చేయకపోవడం,SEO లేకపోతె గూగుల్ లో ర్యాంక్ అవ్వదు.Keyword research చేయకపోవడం, research అనేది చాల ఇంపార్టెంట్.చాల మంది కేవలం డబ్బు కోసమే చేస్తుంటారు,అలా కాకుండా passion తో చేయాలి అప్పుడే డబ్బులు అనేవి తన అంతటా అవి వస్తాయ్.చాల మంది 1–2 నెలల్లోనే drop అవ్వుతుంటారు అలా అవ్వకూడదు result అనేది ఎప్పుడో వస్తదో తెలియదు.బ్లాగింగ్ కి patience + quality content ఈ రెండు చాల important .
SEO (Search Engine Optimization)
SEO అనేది వెబ్సైట్ కి కానీ బ్లాగ్ కి కానీ మంచి traffic రావాలంటే SEO చాల అవసరం.సెర్చ్ ఇంజిన్‌లో టాప్ ర్యాంక్‌లో కనిపించడాన్ని SEO అంటారు.SEO అనేది వెబ్సైట్ కి కానీ బ్లాగ్ కి కానీ first place లోకి తీసికొనిరావడానికి చాల ఉపయోగపడుతుంది. ఎటువంటి ఖర్చు పెట్టకుండను ఆర్గానిక్ గా రిజల్ట్స్ వస్తాయ్. కానీ ఒక్క రోజులో అయ్యేది కాదు 3 to 6 months time తీసికుంటుంది. best laptop కోసం https://amzn.to/4pAvxZr


