Train Insurance Coverage! ట్రైన్ ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం?

Train Insurance Coverage! ట్రైన్ ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం?

Spread the love

Train Insurance Coverage! ట్రైన్ ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం?

Train Insurance Coverage:

Train Insurance Coverage: ట్రైన్‌లో ప్రయాణించే ప్రతి ప్రయాణికుడికి అనుకోకుండా ప్రమాదం జరగవచ్చు. ఈ ప్రమాదాల వల్ల గాయాలు, ఆస్తి నష్టం లేదా మరణం వంటి సమస్యలు ఎదురవుతాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రయాణికుడికి ఆర్థిక భద్రతను అందించడానికి ఉపయోగపడేది ట్రైన్ ఇన్సూరెన్స్ కవరేజ్.సాధారణంగా, మీరు ట్రైన్ టికెట్ బుక్ చేసేటప్పుడు చిన్న మొత్తంలో ప్రీమియం చెల్లిస్తే, ఈ ఇన్సూరెన్స్ మీకు అందుతుంది. ఇది ముఖ్యంగా భారతదేశంలో IRCTC ద్వారా అందించబడుతుంది.
అనుకోని ప్రమాదాలు ఎప్పుడైనా జరగవచ్చు. అలాంటి సందర్భాల్లో మీకు మరియు మీ కుటుంబానికి ఆర్థిక రక్షణ అందించేది ట్రైన్ ఇన్సూరెన్స్ కవరేజ్.చిన్న ప్రీమియంతో పెద్ద భద్రత పొందగలిగే ఈ సదుపాయం ప్రతి ప్రయాణికుడు తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా భారతదేశంలో IRCTC అందించే ఈ సేవ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి, ఇకమీదట ట్రైన్ టికెట్ బుక్ చేసేటప్పుడు “Travel Insurance” ఆప్షన్‌ను ఎప్పుడూ ఎంచుకోవడం మర్చిపోవద్దు.

ట్రైన్ ప్రమాదాలు కి గల కారణాలు:

భారతదేశంలో ట్రైన్ ప్రమాదాలు కొన్నిసార్లు జరుగుతుంటాయి. ఎందువల్లంటే..ట్రాక్ సమస్యలు..సిగ్నల్ లోపాలు..డ్రైవర్ పొరపాట్లు..వాతావరణ పరిస్థితులు..ఇలా అనేక కారణాలు వల్ల జరగవచ్చు.అందుకే ట్రైన్ ఇన్సూరెన్స్ తీసికోవడం చాలా అవసరం.

ట్రైన్ ఇన్సూరెన్స్ ఎలా పని చేస్తుంది:Train Insurance Coverage

ట్రైన్ ఇన్సూరెన్స్ చాలా సింపుల్‌గా పని చేస్తుంది..మీరు ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేస్తారు..అప్పుడు ఇన్సూరెన్స్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేయాలి.. అనుకున్న ప్రీమియం కట్టాలి అప్పుడు..మీకు ఇన్సూరెన్స్ పాలసీ యాక్టివ్ అవుతుంది…ఇన్సూరెన్స్ కంపెనీలు అనేవి IRCTCతో కలిసి పనిచేస్తాయి.

train insurance ఎందుకు అవసరం:https://amzn.to/4cAttMr

ఆర్థిక భద్రత:

ప్రమాదం జరిగినప్పుడు చికిత్స ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఇన్సూరెన్స్ ఈ ఖర్చులను తగ్గిస్తుంది.కుటంబానికి ఆర్థిక భద్రతని ఇస్తుంది.

 కుటుంబానికి సహాయం:

ప్రయాణికుడు మరణించినప్పుడు కుటుంబానికి పరిహారం అందుతుంది.

తక్కువ ప్రీమియం:

కేవలం ₹0.35 నుంచి ₹1 వరకు మాత్రమే ప్రీమియం ఉంటుంది.తక్కువ ప్రీమియం తో 1000000/ వరకు పరిహారం పొందవచు 

సులభంగా పొందవచ్చు:Train Insurance Coverage

టికెట్ బుక్ చేసేటప్పుడు ఒక క్లిక్‌తోనే పొందవచ్చు.టికెట్ బుక్ చేసికున్నపుడు ఈ ఆప్షన్ కనిపిస్తుంది.

train ఇన్సూరెన్స్ కవరేజ్ కిందకు ఏమి వస్తాయ్ :

మరణం (Death Coverage):

ప్రమాదం వల్ల ప్రయాణికుడు మరణిస్తే..₹10 లక్షల వరకు పరిహారం వస్తుంది.

పూర్తి శాశ్వత వికలాంగత్వం (Permanent Disability):

ప్రయాణికుడు పూర్తిగా వికలాంగుడైతే..₹10 లక్షల వరకు కవరేజ్ లభించును.

గాయాల చికిత్స (Medical Expenses):

ఒక వేల ప్రయానికుడికి గాయాలయితే ..₹2 లక్షల వరకు మెడికల్ ఖర్చులు లభించును.https://amzn.to/4cAttMr

మృతదేహ రవాణా (Transportation of Remains):

₹10,000 వరకు ఖర్చు పొందవచ్చు.

వికలాంగత్వం (Partial Disability):Train Insurance Coverage

₹7.5 లక్షల వరకు సుమారుగా రావచ్చు

ట్రైన్ ఇన్సూరెన్స్ కవరేజ్ పట్టిక

కవరేజ్ రకం                                                                                          మొత్తం
మరణం                                                                                                 ₹10 లక్షలు
పూర్తి వికలాంగత్వం                                                                             ₹10 లక్షలు
భాగశః వికలాంగత్వం                                                                          ₹7.5 లక్షలు
మెడికల్ ఖర్చులు                                                                               ₹2 లక్షలు
మృతదేహ రవాణా                                                                               ₹10,000

ఇన్సూరెన్స్ పొందడానికి కొన్ని నియమాలు ఉంటాయి:

అర్హత:
కన్‌ఫర్మ్ టికెట్ ఉండాలి…ప్రయాణికుడు టికెట్‌లో ఉండాలి.
 కవరేజ్ లేని సందర్భాలు:
స్వీయహాని (suicide)…మద్యం లేదా డ్రగ్స్ ప్రభావంలో ప్రమాదం..టికెట్ లేకుండా ప్రయాణం.

క్లెయిమ్ ఎలా చేయాలిTrain Insurance Coverage?

ప్రమాదం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇలా చేయాలి..
స్టెప్స్:
ఇన్సూరెన్స్ కంపెనీకి సమాచారం ఇవ్వాలి..FIR కాపీ ఇవ్వాలి..మెడికల్ రిపోర్ట్స్ సమర్పించాలి..టికెట్ వివరాలు ఇవ్వాలి
అవసరమైన డాక్యుమెంట్స్:
టికెట్..ఐడీ ప్రూఫ్..హాస్పిటల్ రిపోర్ట్..మరణ ధృవీకరణ పత్రం (అవసరమైతే).

ఇన్సూరెన్స్ అందించే కంపెనీలు:

IRCTC ద్వారా అనేక ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ సర్వీస్లు అందిస్తున్నాయి అందులో కొన్ని
ICICI Lombard
Royal Sundaram
SBI General Insurance
Liberty Insurance

ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలి:

ఆన్‌లైన్ (IRCTC వెబ్‌సైట్):
టికెట్ బుక్ చేయండి..“Travel Insurance” ఆప్షన్ సెలెక్ట్ చేయండి..ప్రయాణికుడి వివరాలు నమోదు చేయండి..పేమెంట్ చేయండి. ఇదే విదంగా మొబైల్ యాప్ ద్వారా కూడా same ప్రోసెస్ ఉంటుంది.

ముఖ్యమైన సూచనలు:

* ఇన్సూరెన్స్ తీసుకోవడం చాల మంచిది
*చిన్న మొత్తం అయినా పెద్ద సహాయం చేస్తుంది
*కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వండి
*ప్రయాణానికి ముందు పాలసీ చెక్ చేయండి
*ఎవరైనా తీసుకోవచ్చు
*తక్కువ ఖర్చు – ఎక్కువ కవరేజ్(₹1లో ₹10 లక్షల భద్రత)
*సులభమైన క్లెయిమ్ ప్రాసెస్.
*నామినీ వివరాలు ఇవ్వండి.
*ప్రమాదం జరిగినప్పుడు కుటుంబానికి సహాయం.https://digitaldasaradh.com/digital-marketing-services/?preview

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *