Two Wheeler Insurance Check! టూ వీలర్ ఇన్సూరెన్స్ ఎలా check చేయాలి?

Two Wheeler Insurance Check! టూ వీలర్ ఇన్సూరెన్స్ ఎలా check చేయాలి?

Spread the love

Two Wheeler Insurance Check! టూ వీలర్ ఇన్సూరెన్స్ ఎలా check చేయాలి?

Two Wheeler Insurance Check:

Two Wheeler Insurance Check: టూ వీలర్ (బైక్ లేదా స్కూటర్) వాడే ప్రతి ఒక్కరికీ ఇన్సూరెన్స్ చాలా ముఖ్యమైనది. భారతదేశంలో బైక్‌కు కనీసం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి. అందుకే మీ బైక్ ఇన్సూరెన్స్ స్టేటస్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం చాలా అవసరం.టూ వీలర్ ఇన్సూరెన్స్ చెక్ అంటే మీ బైక్ లేదా స్కూటర్‌కు ఉన్న ఇన్సూరెన్స్ పాలసీ యాక్టివ్‌లో ఉందా లేదా, ఎప్పుడు ఎక్స్‌పైర్ అవుతుంది, ఏ కంపెనీ ద్వారా తీసుకున్నారో తెలుసుకోవడం.ఇది మీకు లీగల్ సమస్యల నుంచి రక్షణ ఇస్తుంది మరియు అనుకోని ప్రమాదాల్లో ఆర్థిక భద్రతను కల్పిస్తుంది.

బైక్ ఇన్సూరెన్స్ తీసుకున్నారా/byke insurance :

విద్యార్థుల నుంచి ఉద్యోగులు వరకు దాదాపు అందరికి బైక్ అంటే ఓ ఎమోషన్.ఏళ్లపాటు ఓర్చి చివరకు వారికీ కావాల్సిన బైకుని ఓ రోజు సొంతం చేసికుంటారు.కొత్తది కొంటె దానితో పాటె ఏడాది కాలానికి ఇన్సూరెన్సు వస్తుంది.మరి సెకండ్ హ్యాండ్ బైక్ కొంటె భీమా ఉందొ లేదో ఓసారి పరిశీలించాలి.భారతదేశంలో ప్రభుత్వం తప్పనిసరి చేసిన ఇన్సూరెన్సు ఏదయినా ఉందంటే అది కేవలం వెహికల్ ఇన్సూరెన్సు మాత్రమే.అయితే మనలో చాల మందికి దీని ప్రాముఖ్యత తెలియక పోలీసులు అడుగుతారని మాత్రమే తీసికుంటారు.

Byke insurance అసలెందుకు:

రోడ్ మీద వాహనం నడిపేటప్పుడు ప్రమాదం జరగవచ్చు.ఆ సమయంలో మన వాహనంతో పాటు ఎదుట వాహనానికి డామేజ్ అవ్వచ్చు.నడుపుతున్న వ్యక్తికీ ప్రమాదం జరగవచ్చు.ఈ ఖర్చులన్నిటిని కవర్ చేసేది ఇన్సూరెన్సు.భీమా తీసికోకపోతే మాత్రం జరిగిన ప్రమాదానికి మొత్తం కారణమైన వ్యక్తే భరించాల్సి ఉంటుంది.ఈ ఇన్సురన్సులలో సమగ్రమైన,థర్డ్ పార్టీ అంటూ రెండు రకాలు ఉంటాయి.

ఏది మంచిది?Two Wheeler Insurance Check

ముందుగా సమగ్రమైన భీమా గురించి తెలుసుకుందాం.ఇందులో ముక్యంగా ప్రమాదం జరిగినప్పుడు ఇరు వాహనాలకు పూర్తి భరోసా ఉంటుంది.అలాగే ప్రమాదంలో గాయపడిన వారందిరికి పూర్తి వైద్యఖర్చులు కవర్ అవుతాయి.అంతేకాకుండా ఫైర్ వల్ల ప్రమాదం జరిగిన..ప్రకృతి విపత్తులు ద్వారా అంటే ..వరదలు..బూకంపలు..వంటివి సంభవాయించిన ఈ ఇన్సురెన్సు భరిస్తుంది.అయితే రెండుంటికి పొల్సితే దీని ప్రీమియం ఖరీదయినది.

టూ వీలర్ ఇన్సూరెన్స్ చెక్ ఎలా చేయాలి?

ఇన్సూరెన్స్ చెక్ చేయడానికి పలు సులభమైన మార్గాలు ఉన్నాయి

VAHAN వెబ్‌సైట్ ద్వారా:

భారత ప్రభుత్వం అందించే VAHAN పోర్టల్ ద్వారా మీ వాహనం వివరాలు చెక్ చేయవచ్చు…VAHAN వెబ్‌సైట్ ఓపెన్ చేయండి…మీ వాహనం నంబర్ ఎంటర్ చేయండి..OTP వెరిఫై చేయండి..అప్పుడు ఇన్సూరెన్స్ వివరాలు కనిపిస్తాయి.

ఇన్సూరెన్స్ కంపెనీ వెబ్‌సైట్Two Wheeler Insurance Check:

మీరు పాలసీ తీసుకున్న కంపెనీ వెబ్‌సైట్‌లో కూడా చెక్ చేయవచ్చు.అవసరమైన వివరాలు ఇవ్వాలి ..పాలసీ నంబర్..వాహనం నంబర్..

మొబైల్ యాప్స్ ద్వారా:

mParivahan App ..Policy Bazaar …InsuranceDekho ..

RTO ఆఫీస్:

మీరు దగ్గరలోని RTO కార్యాలయంలో కూడా వివరాలు తెలుసుకోవచ్చు.

ఇన్సూరెన్స్ చెక్ చేసినప్పుడు ఈ వివరాలు కనిపిస్తాయి:

ఇన్సూరెన్స్ కంపెనీ పేరు..పాలసీ నంబర్..పాలసీ ప్రారంభ తేదీ..ఎక్స్‌పైరీ తేదీ..ఇన్సూరెన్స్ టైప్ (Third Party / Comprehensive).

టూ వీలర్ ఇన్సూరెన్స్ చెక్ ఎందుకు చేయాలి?

లీగల్ అవసరం:
భారతదేశంలో ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడపడం చట్ట విరుద్ధం.
ఫైన్ నుంచి తప్పించుకోవచ్చు:
ఇన్సూరెన్స్ లేకపోతే భారీ జరిమానా పడుతుంది.
క్లెయిమ్స్ కోసం అవసరం:
అఘాతం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ యాక్టివ్‌లో ఉండాలి.
రిన్యూవల్ రిమైండర్:
పాలసీ ఎక్స్‌పైరీ డేట్ ముందే తెలుసుకోవచ్చు.

third-party Bheema/థర్డ్-పార్టీ బీమా:

కార్,బైక్ ఇన్సురెన్సులలో థర్డ్ -పార్టీ భీమా చాలా ముఖ్యమైనది.ఇందులో ఇన్సూరెన్సు కొన్నవారు ఫస్ట్-పార్టీ అయితే..ఇన్సూరెన్సు అమ్మిన వారు సెకండ్ పార్టీ అవుతారు.ఒకవేల మీ వాహనం వల్ల ఏడైన ప్రమాదం జరిగి నష్టపోయిన (లేదా )చనిపోయిన వారిని థర్డ్ పార్టీ అని పిలుస్తారు.ఒకవేళ ఆ  ఆ థర్డ్-పార్టీ వ్యక్తికి ఇన్సూరెన్సు లేకపోతె..ఆ భారమంతా వాహన దారుడే మోయాలి.కనుక ఈ బీమా తప్పనిసరిగా తీసికోవడం మంచిది.

claim/క్లెయిమ్ ఎలా పొందాలి?

ప్రమాదం జరిగిన వెంటనే భీమా కంపెనీ కి చెప్పాలి.నిర్దిష్ట సమయంలోగా వారికీ సమాసారం ఇవ్వకపోతే.. మీరు ఇన్సూరెన్సు క్లెయిమ్ చేయలేరు.అలాగే పోలిసుల నుంచి FIR కాపీ కూడా పొందాలి .మీరు సమర్పించే పత్రాలకు ఆ FIR కాపీ ని జతచేయాలి.ఆ తరువాత ప్రమాద నష్టాన్ని అంచనా వేయడానికి భీమా కంపెనీ సర్వే కోసం ఒకర్ని పంపిస్తుంది.వారి నివేదికను బట్టి క్లెయిమ్ వస్తుంది.

ఈ జాగ్రత్తలు అవసరంTwo Wheeler Insurance Check:

అందుబాటులో వున్నా వివిధ రకాల మోటర్ ఇన్సూరెన్సు లను క్షున్నంగా పరిశీలించాలి.ఆ తరువాత మీకు ఏది బెటర్ అనిపించిందో దాన్ని బట్టి ఓ నిర్ణయానికి రావాలి.మీరు ఇన్సూరెన్సు తీసికొనే ముందు క్యాష్ లెస్,గ్యారేజ్ నెటవర్క్స్,ప్రీమియం ధరలు,యాడ్ ఆన్ ఫీచర్స్,భీమా సమస్తకువున్న విశ్వసనీయత,కవరేజ్ వంటి వాటిని కచ్చితంగా ప్రామాణికంగా తీసికోవాలి.అయితే డ్రైవింగ్ లైసెన్స్ లేనివారు వాహనం నడిపిన,మద్యం సేవించి వాహనం డ్రైవ్ చేసిన నిబంధనలు ఉల్లంఘించినట్లు అవుతుంది.దింతో కవరేజిలు వర్తించవు.

థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది ఒక వాహనం వల్ల ఇతర వ్యక్తులకు లేదా వారి ఆస్తికి జరిగిన నష్టాన్ని కవర్ చేసే ఇన్సూరెన్స్ పాలసీ.భారతదేశంలో వాహనాలు ఉపయోగించే ప్రతి ఒక్కరికీ Third Party Insurance (థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్) తప్పనిసరి. ఇది ఒక లీగల్ రిక్వైర్మెంట్ కూడా .సాధారణంగా ఈ పాలసీలో మూడు పార్టీస్ ఉంటాయి:
First Party – వాహన యజమాని (పాలసీ హోల్డర్)
Second Party – ఇన్సూరెన్స్ కంపెనీ
Third Party – ప్రమాదంలో నష్టపోయిన ఇతర వ్యక్తి లేదా వారి ఆస్తి
అంటే, మీ వాహనం వల్ల ఎవరికైనా గాయం అయితే లేదా వారి వాహనం లేదా ఆస్తి దెబ్బతిన్నా, ఆ నష్టాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది.

భారతదేశంలో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఎందుకు తప్పనిసరి?

భారతదేశంలో Motor Vehicles Act, 1988 ప్రకారం ప్రతి వాహనానికి కనీసం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉండాలి. ఇది ప్రభుత్వ నిబంధన.ఇది ఎందుకు తప్పనిసరి అంటే..రోడ్డు ప్రమాదాల్లో బాధితులకు ఆర్థిక సహాయం అందించడానికి..వాహన యజమాని మీద పెద్ద ఆర్థిక భారం పడకుండా ఉండటానికి..రోడ్డు భద్రతను మెరుగుపరచడానికి..థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే జరిమానా లేదా జైలుశిక్ష కూడా పడవచ్చు.

థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కవర్ చేసే విషయాలు:

వ్యక్తిగత గాయాలు (Injury):

మీ వాహనం వల్ల ఇతరులకు గాయం అయితే వారి వైద్య ఖర్చులు ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది.

మరణం (Death):

ప్రమాదంలో ఒక వ్యక్తి మరణిస్తే వారి కుటుంబానికి పరిహారం ఇవ్వబడుతుంది.

ఆస్తి నష్టం (Property Damage):

ఇతరుల వాహనం, ఇల్లు, గోడలు లేదా ఇతర ఆస్తులకు నష్టం జరిగితే అది కూడా కవర్ అవుతుంది.

థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కవర్ చేయనివి:

మీ వాహనానికి జరిగిన నష్టం..మీకు జరిగిన గాయాలు..మద్యం సేవించి డ్రైవింగ్ చేసినప్పుడు జరిగిన ప్రమాదాలు..లైసెన్స్ లేకుండా వాహనం నడిపినప్పుడు జరిగిన ప్రమాదాలు..అంటే ఇది మీ నష్టాన్ని కాదు, ఇతరుల నష్టాన్ని మాత్రమే కవర్ చేస్తుంది.

ప్రీమియం ఈ అంశాలపై ఆధారపడి ఉంటుంది:

*వాహనం రకం (బైక్ / కార్ / ట్రక్)
*ఇంజిన్ సామర్థ్యం (CC)
*వాహనం వయస్సు
*వాహనం ఉపయోగం
ఉదాహరణకు:
*చిన్న బైక్ కి ప్రీమియం తక్కువ
*పెద్ద కార్ కి ప్రీమియం ఎక్కువ
*థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం సాధారణంగా ప్రభుత్వ సంస్థ అయిన IRDAI (Insurance Regulatory and Development Authority of India) నిర్ణయిస్తుంది.https://amzn.to/4sCfdIg

భారతదేశంలో కొన్ని ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీలు:

ICICI Lombard
HDFC ERGO
Tata AIG
Bajaj Allianz
New India Assurance ..

థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఎవరికీ అవసరంTwo Wheeler Insurance Check:

ఈ వాహనాల యజమానులకు తప్పనిసరి..బైక్..కార్..ఆటో..ట్రక్..బస్సు..అంటే రోడ్డుపై నడిచే ప్రతి మోటార్ వాహనానికి ఇది అవసరం.https://digitaldasaradh.com/best-personal-accident-insurance-policy/?preview

 

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *