Car Insurance Check! కార్ ఇన్సూరెన్స్ ఎందుకు చెక్ చేయాలి?
Car Insurance Check:
Car Insurance Check: కార్ కొనడం ప్రతి కుటుంబానికి ఒక పెద్ద కళ. కానీ కేవలం కార్ కొనడం మాత్రమే కాదు, దానికి సరైన ఇన్సూరెన్స్ తీసుకోవడం మరియు ఆ ఇన్సూరెన్స్ స్టేటస్‌ని రెగ్యులర్‌గా చెక్ చేయడం చాలా ముఖ్యం. చాలామంది ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత అది ఎప్పటికి ఎక్స్పైర్ అవుతుంది, క్లెయిమ్ ఎలా చెయ్యాలి, పాలసీ డిటేల్స్ ఏమిటి అనే విషయాలు పట్టించుకోరు. కార్ ఇన్సూరెన్స్ అనేది ఒక రకమైన ఆర్థిక రక్షణ. మీ కార్కు ప్రమాదం జరిగితే, దొంగతనం అయితే లేదా ఇతరులకు నష్టం కలిగితే, ఇన్సూరెన్స్ కంపెనీ ఆ ఖర్చులను కవర్ చేస్తుంది.“Car Insurance Check” అనేది చిన్న విషయం అనిపించినా చాలా ముఖ్యమైనది. మీ కార్ సేఫ్టీతో పాటు మీ ఆర్థిక భద్రత కూడా దీనిపై ఆధారపడి ఉంటుంది. రెగ్యులర్‌గా మీ ఇన్సూరెన్స్ స్టేటస్ చెక్ చేయడం ద్వారా మీరు అనవసర సమస్యలను అధిగమించవచ్చు.
కార్ ఇన్సూరెన్స్ చెక్ ఎందుకు చేయాలి:
కార్ ఇన్సూరెన్స్ చెక్ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే.. పాలసీ ఎక్స్పైరీ తెలుసుకోవచు..మీ ఇన్సూరెన్స్ ఎప్పుడు ముగుస్తుందో తెలుసుకుంటే ముందుగానే రిన్యూవల్ చేసుకోవచ్చు..అలాగే జరిమానాలు నుండి తప్పించుకోవడానికి…ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే భారీ ఫైన్ పడుతుంది కాబట్టి .. క్లెయిమ్ టైంలో సమస్యలు రాకుండా ఉంటుంది …పాలసీ డిటేల్స్ సరిగ్గా ఉన్నాయా అని ముందుగానే చెక్ చేస్తే క్లెయిమ్ చేయడం సులభం అవుతుంది.. నకిలీ పాలసీలను గుర్తించడానికి..కొన్ని సందర్భాల్లో ఫేక్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటాయి. చెక్ చేయడం ద్వారా అవి గుర్తించవచ్చు.
ఇన్సూరెన్స్ చెక్ చేసే పద్ధతులు:Car Insurance Check
కార్ ఇన్సూరెన్స్ చెక్ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి
ఆన్లైన్ ద్వారా చెక్ చేయడం:
ఇది చాలా సులభమైన మరియు వేగవంతమైన పద్ధతి.
విధానం:
ఇన్సూరెన్స్ కంపెనీ వెబ్‌సైట్‌కి వెళ్లాలి
“Policy Status” లేదా “Check Insurance” ఆప్షన్ ఎంచుకోవాలి
వాహనం నంబర్ లేదా పాలసీ నంబర్ ఇవ్వాలి
వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి
వాహన్ పోర్టల్ ద్వారా చెక్:
భారత ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ ద్వారా కూడా చెక్ చేయవచ్చు.అవసరమైన వివరాలు…
వాహనం రిజిస్ట్రేషన్ నంబర్….OTP వెరిఫికేషన్…ఇది పూర్తిగా విశ్వసనీయమైన పద్ధతి.
మొబైల్ యాప్ ద్వారా చెక్:
DigiLocker
mParivahan
ఈ యాప్స్‌లో మీ వాహనం వివరాలు మరియు ఇన్సూరెన్స్ స్టేటస్ సులభంగా కనిపిస్తాయి.
ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా:
మీరు ఇన్సూరెన్స్ తీసుకున్న కంపెనీని సంప్రదించి కూడా చెక్ చేయవచ్చు.
కార్ ఇన్సూరెన్స్ పాలసీ డిటేల్స్‌లో ఏమేమి ఉంటాయి:Car Insurance Check
పాలసీ నంబర్..పాలసీ హోల్డర్ పేరు..వాహనం నంబర్..పాలసీ ప్రారంభ తేదీ..పాలసీ ముగింపు తేదీ..కవరేజ్ టైప్..ప్రీమియం మొత్తం..
కార్ ఇన్సూరెన్స్ రకాలు:
థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్
ఇది తప్పనిసరి. ఇతరులకు కలిగిన నష్టం మాత్రమే కవర్ అవుతుంది.
కంప్రెహెన్సివ్ ఇన్సూరెన్స్
ఇది పూర్తి రక్షణ ఇస్తుంది..యాక్సిడెంట్..దొంగతనం..నేచురల్ డ్యామేజ్..
ఓన్ డ్యామేజ్ కవర్
మీ కార్కు జరిగిన నష్టం మాత్రమే కవర్ అవుతుంది.
కార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎలా చెయ్యాలి?
*ప్రమాదం జరిగిన వెంటనే కంపెనీకి సమాచారం ఇవ్వండి
*FIR నమోదు చేయండి (అవసరమైతే)
*డాక్యుమెంట్స్ సమర్పించండి
*సర్వే పూర్తయ్యాక క్లెయిమ్ సెటిల్ అవుతుంది..
*సరైన వెబ్సైట్ ఉపయోగించండి
*వ్యక్తిగత వివరాలు ఎక్కడైనా ఇవ్వకండి
*OTP ఎవరికీ చెప్పకండి..
third-party Bheema/థర్డ్-పార్టీ బీమా:Car Insurance Check
కార్,బైక్ ఇన్సురెన్సులలో థర్డ్ -పార్టీ భీమా చాలా ముఖ్యమైనది.ఇందులో ఇన్సూరెన్సు కొన్నవారు ఫస్ట్-పార్టీ అయితే..ఇన్సూరెన్సు అమ్మిన వారు సెకండ్ పార్టీ అవుతారు.ఒకవేల మీ వాహనం వల్ల ఏడైన ప్రమాదం జరిగి నష్టపోయిన (లేదా )చనిపోయిన వారిని థర్డ్ పార్టీ అని పిలుస్తారు.ఒకవేళ ఆ ఆ థర్డ్-పార్టీ వ్యక్తికి ఇన్సూరెన్సు లేకపోతె..ఆ భారమంతా వాహన దారుడే మోయాలి.కనుక ఈ బీమా తప్పనిసరిగా తీసికోవడం మంచిది.
claim/క్లెయిమ్ ఎలా పొందాలిCar Insurance Check ?
ప్రమాదం జరిగిన వెంటనే భీమా కంపెనీ కి చెప్పాలి.నిర్దిష్ట సమయంలోగా వారికీ సమాసారం ఇవ్వకపోతే.. మీరు ఇన్సూరెన్సు క్లెయిమ్ చేయలేరు.అలాగే పోలిసుల నుంచి FIR కాపీ కూడా పొందాలి .మీరు సమర్పించే పత్రాలకు ఆ FIR కాపీ ని జతచేయాలి.ఆ తరువాత ప్రమాద నష్టాన్ని అంచనా వేయడానికి భీమా కంపెనీ సర్వే కోసం ఒకర్ని పంపిస్తుంది.వారి నివేదికను బట్టి క్లెయిమ్ వస్తుంది.
ఈ జాగ్రత్తలు అవసరం:
అందుబాటులో వున్నా వివిధ రకాల మోటర్ ఇన్సూరెన్సు లను క్షున్నంగా పరిశీలించాలి.ఆ తరువాత మీకు ఏది బెటర్ అనిపించిందో దాన్ని బట్టి ఓ నిర్ణయానికి రావాలి.మీరు ఇన్సూరెన్సు తీసికొనే ముందు క్యాష్ లెస్,గ్యారేజ్ నెటవర్క్స్,ప్రీమియం ధరలు,యాడ్ ఆన్ ఫీచర్స్,భీమా సమస్తకువున్న విశ్వసనీయత,కవరేజ్ వంటి వాటిని కచ్చితంగా ప్రామాణికంగా తీసికోవాలి.అయితే డ్రైవింగ్ లైసెన్స్ లేనివారు వాహనం నడిపిన,మద్యం సేవించి వాహనం డ్రైవ్ చేసిన నిబంధనలు ఉల్లంఘించినట్లు అవుతుంది.దింతో కవరేజిలు వర్తించవు.
థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?
థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది ఒక వాహనం వల్ల ఇతర వ్యక్తులకు లేదా వారి ఆస్తికి జరిగిన నష్టాన్ని కవర్ చేసే ఇన్సూరెన్స్ పాలసీ.భారతదేశంలో వాహనాలు ఉపయోగించే ప్రతి ఒక్కరికీ Third Party Insurance (థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్) తప్పనిసరి. ఇది ఒక లీగల్ రిక్వైర్మెంట్ కూడా .సాధారణంగా ఈ పాలసీలో మూడు పార్టీస్ ఉంటాయి:
First Party – వాహన యజమాని (పాలసీ హోల్డర్)
Second Party – ఇన్సూరెన్స్ కంపెనీ
Third Party – ప్రమాదంలో నష్టపోయిన ఇతర వ్యక్తి లేదా వారి ఆస్తి
అంటే, మీ వాహనం వల్ల ఎవరికైనా గాయం అయితే లేదా వారి వాహనం లేదా ఆస్తి దెబ్బతిన్నా, ఆ నష్టాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది.
భారతదేశంలో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఎందుకు తప్పనిసరి?
భారతదేశంలో Motor Vehicles Act, 1988 ప్రకారం ప్రతి వాహనానికి కనీసం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉండాలి. ఇది ప్రభుత్వ నిబంధన.ఇది ఎందుకు తప్పనిసరి అంటే..రోడ్డు ప్రమాదాల్లో బాధితులకు ఆర్థిక సహాయం అందించడానికి..వాహన యజమాని మీద పెద్ద ఆర్థిక భారం పడకుండా ఉండటానికి..రోడ్డు భద్రతను మెరుగుపరచడానికి..థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే జరిమానా లేదా జైలుశిక్ష కూడా పడవచ్చు.
థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కవర్ చేసే విషయాలు:
వ్యక్తిగత గాయాలు (Injury):
మీ వాహనం వల్ల ఇతరులకు గాయం అయితే వారి వైద్య ఖర్చులు ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది.
మరణం (Death):
ప్రమాదంలో ఒక వ్యక్తి మరణిస్తే వారి కుటుంబానికి పరిహారం ఇవ్వబడుతుంది.
ఆస్తి నష్టం (Property Damage):
ఇతరుల వాహనం, ఇల్లు, గోడలు లేదా ఇతర ఆస్తులకు నష్టం జరిగితే అది కూడా కవర్ అవుతుంది.
థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కవర్ చేయనివి:
మీ వాహనానికి జరిగిన నష్టం..మీకు జరిగిన గాయాలు..మద్యం సేవించి డ్రైవింగ్ చేసినప్పుడు జరిగిన ప్రమాదాలు..లైసెన్స్ లేకుండా వాహనం నడిపినప్పుడు జరిగిన ప్రమాదాలు..అంటే ఇది మీ నష్టాన్ని కాదు, ఇతరుల నష్టాన్ని మాత్రమే కవర్ చేస్తుంది.
ప్రీమియం ఈ అంశాలపై ఆధారపడి ఉంటుంది:
*వాహనం రకం (బైక్ / కార్ / ట్రక్)
*ఇంజిన్ సామర్థ్యం (CC)
*వాహనం వయస్సు
*వాహనం ఉపయోగం
ఉదాహరణకు:
*చిన్న బైక్ కి ప్రీమియం తక్కువ
*పెద్ద కార్ కి ప్రీమియం ఎక్కువ
*థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం సాధారణంగా ప్రభుత్వ సంస్థ అయిన IRDAI (Insurance Regulatory and Development Authority of India) నిర్ణయిస్తుంది.https://amzn.to/4sCfdIg
భారతదేశంలో కొన్ని ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీలు:
ICICI Lombard
HDFC ERGO
Tata AIG
Bajaj Allianz
New India Assurance ..
థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఎవరికీ అవసరం:
ఈ వాహనాల యజమానులకు తప్పనిసరి..బైక్..కార్..ఆటో..ట్రక్..బస్సు..అంటే రోడ్డుపై నడిచే ప్రతి మోటార్ వాహనానికి ఇది అవసరం.https://digitaldasaradh.com/best-personal-accident-insurance-policy/?preview

