small investment ideas! ఇన్వెస్ట్ చేస్తున్నారా? అయితే ఈ తప్పులు చేయవద్దు?

small investment ideas! ఇన్వెస్ట్ చేస్తున్నారా? అయితే ఈ తప్పులు చేయవద్దు?

Spread the love

small investment ideas! ఇన్వెస్ట్ చేస్తున్నారా? అయితే ఈ తప్పులు చేయవద్దు?

small investment ideas:

small investment ideas: మనం డబ్బు పొదుపు చేయకుండా…ఎన్ని ప్రణాళికలు అమలు పరిసిన వ్యర్థమే.ఎందుకంటే ఈ ప్లానింగ్ అనేది వర్తమానం కోసం కాదు.భవిష్యత్తు కోసం.పదవీవిరమణ  తరువాత సుఖమయమైన జీవితాన్ని గడపాలంటే ఇప్పటనుంచే తప్పనిసరిగా పొదుపుచేయాలి.అది ఎలా అంటే మొత్తం ఆదాయంలో కనీసం 15-25% ధనాన్ని వివిధ పెట్టుబడి మార్గాల ద్వారా ఇన్వెస్ట్ చేయాలి.వాటిల్లో మ్యూచువల్ ఫండ్స్,ఎమర్జెన్సీ ఫండ్స్, డిపాజిట్ వంటివి ఉండాలి.ఇవి మీ భవిష్యత్తుకు భరోసా ఇస్తాయి.అలాగే అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి.50-30-20 రూల్ ఫాలో కావాలి.ఈ నియమము పాటించడం ద్వారా మీకు ప్రతి నెల 20% మేర పొదుపు చేసినట్లు అవుతుంది.ఎంటర్ ట్రైన్మెంట్ కోసం చేసే ఖర్చులు వీలైనంత వరకు తగ్గించుకోవాలి.

private job /ప్రైవేటు ఉద్యోగమా:

ప్రపంచవ్యాప్తంగా మాంద్యం భయాలు నానాటికి పెరుగుతున్నాయి.పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఉద్యోగులను తొలిగిస్తున్నాయ్. కాబట్టి ప్రైవేట్ ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి.వీలైనంతవరకు స్కిల్స్ మెరుగుపరుసుకోవాలి.జీతం పైన ఆధారపడకుండా..ఇతర సంపాదన మార్గాలను చూసికోవాలి.ఉద్యోగంతో పాటు చిన్నపాటి వ్యాపారం చేయడం వలన ప్రయోజనం ఉంటుంది.సడెన్ గ ఉద్యోగం పోయిన…వ్యాపారం వల్ల వచ్చే డబ్బు ఆర్థిక సమస్యలను తొలిగిస్తుంది.

ఆకస్మిక నిధి:small investment ideas

ఊహించని ఖర్చులు కోసం కనీసం నాలుగు నుంచి ఆరునెలలు పాటు అత్యవసర నిధిని కేటాయించుకోవాలి.అది ఆర్థికంగా ఎలాంటి లోటు లేకుండా కాపాడుతుంది.అనవసరమైన ఖర్చులను తగ్గించుకుంటూ ఈ ఆకస్మిక నిధిని పెంచుకునేలా ప్రణాళికలు రూపొందించుకోవాలి.మీరు ఈ అత్యవసర నిధిని బ్యాంకు సేవింగ్స్ కాత,లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్,ఫిక్సడ్ డిపాజిట్ ఫండ్ మొదలైన వాటిలో సేవ్ చేసికోవచ్చు.

policy’s/పాలిసీలు:https://amzn.to/4ch9zGx

ఎవరకి ఎప్పుడు ఎం జరుగుతుందో ముందుగానే చెప్పలేము.కానీ,మీకు జరగరానిది ఏదయినా జరిగినప్పుడు మీ కుటుంబం ఆర్థికంగా స్థిరంగా ఉండాలంటే…కచ్చితంగా టర్మ్ పోలిసీని తీసికోవాలి.ఇది మీ కుటంబాన్ని ఆర్థిక భద్రత ఇస్తుంది. పెరుగుతున్న వైద్యఖర్చులకు తగిన విదంగా ఉండేలా ఆరోగ్య భీమా కూడా తీసికోవాలి.కుటుంబ సభ్యులందరికి కనీసం రూ.5 లక్షల ఆరోగ్య భీమా పాలిసీ తీసికోవడం చాల ముఖ్యం.చిన్న వయస్సులోనే పాలిసీ తీసికోవడం వల్ల తక్కువ ప్రీమియం చెల్లించి, ఎక్కువ పరిహారం పొందవచ్చు .

children’s savings/పిల్లల భవిష్యత్తుకోసం:

తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని ప్రతి తల్లితండ్రుల కలలు కంటువుంటారు.ఆ కళలు నిజాం చేసికోవాలంటే…వారి కోసం పెట్టుబడి పెట్టడం చాల ముఖ్యం.ప్రస్తుత రోజుల్లో పిల్లల స్కూల్ ఫీజలు బాగా పెరిగిపోయాయి.యూనిఫామ్,పుస్తకాల ధరలు పెరిగాయ్.ఇవి తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా,కష్టాలను కూడా తెచ్చిపెడుతున్నాయి.ఇక కాలేజీ ఫీజలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.కాబట్టి పిల్లలకు ఇవన్నీ అందించాలంటే ఇప్పటినుంచే వారికోసం డబ్బుదాయాలి.పొదుపు చేయాలి.

అయితే ఈ తప్పులు చేయవద్దు:small investment ideas

* రుణం(అప్పు) తీసికోవాల్సిన పరిస్థితి అస్సలు రానివ్వకండి.ఎందుకంటే ఇది మీ ఆర్థిక ప్రణాలికను పూర్తిగా డిస్టర్బ్ చేస్తుంది.అదనంగా మీ పై భారం కూడా మోపుతోంది.అత్యవసరం అనుకుంటేనే బ్యాంకు నుంచి ఋణం పొందండి.

*పాత అప్పులు ఏవైనా ఉంటె..వెంటనే వాటిని తీర్చిసేలా లక్ష్యం పెట్టుకోండి.ఆ లోన్ క్లియర్ చేయడం వల్ల ఆర్థిక భారం నుంచి విముక్తి పొందవచ్చు.సకాలంలో చేసే లోన్ రేపేమెంట్ మీ క్రెడిట్ స్కోర్ ను మెరుగుపరుస్తుంది.

* tax లు గడువులోపు చెల్లించండి.లేకపోతె..పెనాల్టీలు పడతాయి.ఇవి వాయిదా వేయడం వల్ల అవసరమైన వాటికంటే ఎక్కువ పన్ను చెల్లించాల్సి వస్తుంది.

* అత్యవసరం కాకుండానే పర్సనల్ లోన్,క్రెడిట్ కార్డు రుణాలు తీసికోవడం వల్ల ఆర్థిక ప్రణాళిక దెబ్బతింటుంది.

*జీవన వ్యయానికంటే మించి ఖర్చు చేస్తే..ఆ ప్రబావం మిగితావాటిపై కూడా పడుతుంది.అందుకే ఈ తప్పు చేయకండి.

* కొత్తగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసేటప్పుడు చాలామందికి ఫండ్స్ గురించి అంతగా అవగాహనా ఉండదు.ఇష్టం వచ్చిన వాటిలో పొదుపు చేస్తుంటారు.ఇలా చేస్తే నష్టాలు రావచ్చు.

* భారీ లాభాలు పొందాలనే ఆశతో ఒకే తరహా ఫండ్లలో పెట్టుబడి పెడితే…అనిశ్చితి కారణంగా పెద్ద మొత్తంలో డబ్బు నష్టపోయే అవకాశం ఉంది.

Retirement /రిటైర్మెంట్ ప్లానింగ్:small investment ideas

రిటైర్మెంట్ గురించి ఆలోసించకపోవడం అతిపెద్ద తప్పు. పదవిరమణ కోసం ఎంత త్వరగా పొదుపు చేయడం ప్రారంభిస్తే…మలి వయసులో ఆర్థికంగా అంత బలంగా ఉంటారు.చిన్న వయస్సులో ఉన్నపటికీ,రిటైర్మెంట్ ప్లానింగ్ అస్సలు వాయిదా వేయకండి. 

కొన్నిముఖ్యమైన పెట్టుబడి రకాలు:

సేవింగ్స్ అకౌంట్:

సేవింగ్స్ అకౌంట్ అనేది బ్యాంకులో పొదుపు కోసం తెరిచే సాధారణ ఖాతా. ఇందులో మీ డబ్బును సురక్షితంగా డిపాజిట్ చేసి, అవసరమైనప్పుడు ఎప్పుడైనా విత్‌డ్రా చేసుకోవచ్చు, మరియు బ్యాలెన్స్ మీద 4-6% వడ్డీ లభిస్తుంది.. వడ్డీ తక్కువైనా డబ్బు సురక్షితంగా ఉంటుంది. అత్యవసర ఖర్చులకు ఉపయోగపడుతుంది.సేవింగ్స్‌లో వడ్డీ ఉంటుంది కానీ ట్రాన్సాక్షన్ లిమిట్ ఉంటుంది, అదే కరెంట్‌లో వడ్డీ లేదు కానీ అన్‌లిమిటెడ్ లావాదేవీలు చేసికోవచ్చు.

రికరింగ్ డిపాజిట్ (RD)

రికరింగ్ డిపాజిట్ (RD) అనేది బ్యాంకులు, పోస్టాఫీస్‌లు … అందించే పొదుపు పథకం, ప్రతి నెలా/ డిపాజిట్ చేసి, మెచ్యూరిటీ సమయంలో అసలు మొత్తం + వడ్డీతో ఒకేసారి పొందవచ్చు. ఇది సాధారణ పొదుపుకు అనుకూలం, వడ్డీ సాధారణంగా 6-8% ఉంటుంది మరియు 6 నెలల నుంచి 10 సంవత్సరాల వరకు పీరియడ్ ఎంచుకోవచ్చు. నెలకు ₹500 లేదా ₹1000తో ప్రారంభించవచ్చు.సేవింగ్స్‌లో ఎప్పుడైనా విత్‌డ్రా చేయవచ్చు కానీ RDలో ఫిక్స్డ్ పీరియడ్‌కు కట్టుబడి ఉంటాం, RDలో వడ్డీ ఎక్కువగా ఉంటుంది.

ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD):

ఫిక్స్డ్ డిపాజిట్ (FD) అనేది బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల్లో ఒకేసారి నిర్దిష్ట మొత్తాన్ని (7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు ) డిపాజిట్ చేసి, మెచ్యూరిటీ సమయంలో అసలు మొత్తం + వడ్డీతో పొందే సురక్షిత పెట్టుబడి పథకం. వడ్డీ రేటు సాధారణంగా 6-8% p.a. ఉంటుంది, సీనియర్ సిటిజన్లకు అదనపు 0.5% లభిస్తుంది.

ప్రయోజనాలు:

*ఇవి రిస్క్ లేకుండా వుండే పొదుపు మార్గం అని చెప్పవచ్చు…డిపాజిట్ పైన ఇన్సూరెన్స్ (₹5 లక్షల వరకు) సౌకర్యం ఉంటుంది.
​*లిక్విడిటీ కోసం లోన్ సౌకర్యం (FD విలువలో 90%) లభిస్తుంది.ఆన్‌లైన్‌ లో కూడా సులభంగా చేసికోవచ్చు.

*పన్ను ప్రయోజనాలు: 5 సంవత్సరాల వరకు FDకు 80C కింద ₹1.5 లక్షల వరకు మినహాయింపు లభించును .

మ్యూచువల్ ఫండ్ SIP: small investment ideas

SIP అనేది చిన్న పెట్టుబడులకు చాలా మంచి ఆప్షన్. నెలకు ₹500తో కూడా స్టార్ట్ చేయవచ్చు.మ్యూచువల్ ఫండ్ SIP అనేది సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్, ప్రతి నెలా (లేదా క్వార్టర్‌లో) నిర్దిష్ట మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టే విధానం. ఇది చిన్న మొత్తాలతో (రూ.500 నుంచి) మొదలుపెట్టి, దీర్ఘకాలంలో 10-15% రిటర్న్స్ ఇస్తుంది.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF):small investment ideas

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అనేది భారత ప్రభుత్వం చేత నడుపబడే దీర్ఘకాలిక పొదుపు పథకం, 15 సంవత్సరాల లాక్-ఇన్‌తో సురక్షిత రాబడిని అందిస్తుంది. ఇందులో సంవత్సరానికి కనీసం ₹500, గరిష్ఠం ₹1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు, ప్రస్తుతం 7.1% వడ్డీ (ప్రభుత్వం నిర్ణయించే ఫ్లోటింగ్ రేటు) లభిస్తుంది. మరియు మెచ్యూరిటీ తర్వాత పూర్తిగా ట్యాక్స్ ఫ్రీ(సెక్షన్ 80c ).

బంగారం పెట్టుబడి /gold:

ఫిజికల్ గోల్డ్ కొనకుండానే డిజిటల్ గోల్డ్ లేదా గోల్డ్ స్కీమ్స్‌లో చిన్న మొత్తాలు పెట్టుబడి చేయవచ్చు.ద్రవ్యోల్బణం నుంచి రక్షణగ ఉంటుంది. వీటి విలువ దీర్ఘకాలంలో  పెరుగుతుంది.

స్టాక్ మార్కెట్ /stock market:

సరైన అవగాహన ఉంటే స్టాక్ మార్కెట్‌లో కూడా చిన్న పెట్టుబడులు చేయవచ్చు.దీర్ఘకాలంలో 12-15% సగటు రిటర్న్స్ ఇస్తుంది కానీ మార్కెట్ మార్పులు, కంపెనీ పనితీరు మీద ఆధారపడి రిస్క్ ఎక్కువగా ఉంటుంది.

పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్/post office:

పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ చాలా సురక్షితమైనవి.పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్‌లు అనేవి భారత ప్రభుత్వం చేత నడుపబడే సురక్షిత పొదుపు పథకాలు, దేశవ్యాప్తంగా ప్రతి ప్రాంతంలో అందుబాటులో ఉన్నాయి. మరియు చిన్న పెట్టుబడిదారులకు అనుకూలం. ఇందులో సేవింగ్స్ అకౌంట్, రికరింగ్ డిపాజిట్ (RD), ఫిక్స్డ్ డిపాజిట్ (TD), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), నెలవారీ ఆదాయ స్కీమ్ (MIS), సీనియర్ సిటిజన్ స్కీమ్ (SCSS), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC), సుకన్య సమృద్ధి వంటివి చాల ఉన్నాయి.

స్కిల్ డెవలప్‌మెంట్‌లో పెట్టుబడి:small investment ideas

మన మీద మనం పెట్టుబడి పెట్టడం అంటే డబ్బు, సమయం, శ్రమను మన జ్ఞానం, నైపుణ్యాలు, ఆరోగ్యం, వ్యక్తిత్వం మీద ఖర్చు చేయడం. ఇది షేర్లు, బంగారం లాంటి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్‌మెంట్ కాదు… కానీ దీని రిటర్న్ చాలా పెద్దది—మంచి ఆదాయం, కెరీర్ గ్రోత్, ఆత్మవిశ్వాసం.మన మీద పెట్టుకున్న పెట్టుబడి ఎప్పటికీ వృథా కాదు—అది జీవితాంతం లాభం ఇస్తుంది.

how to స్టార్ట్ ఎలా స్టార్ట్ చేయాలి(skill development) ?

*మీకు ఆసక్తి ఉన్న స్కిల్ ఎంచుకోండి….
*నెలకు ఒక చిన్న అమౌంట్ సెట్ చేయండి….
*ప్రతి రోజూ కొద్దిగా కొద్దిగా మీ టైం బట్టి నేర్చుకోండి….
*ప్రాక్టీస్ చేయండి…
*ఆదాయం వచ్చేలా అప్లై చేయండి….
*డబ్బు పోయినా మళ్లీ వస్తుంది. కానీ మనపై మనం పెట్టుబడి పెట్టకపోతే కోల్పోయేది మన భవిష్యత్తు.అందుకే ముందుగా మన మీదే పెట్టుబడి పెట్టాలి—అది బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్.

ఎందుకు మన మీద పెట్టుబడి పెట్టాలి:https://amzn.to/4ch9zGx

*ఆదాయం పెరుగుతుంది – కొత్త స్కిల్స్ వల్ల మంచి అవకాశాలు వస్తాయి.
*జాబ్ సెక్యూరిటీ – ఒకే పనిపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది.
*ఆత్మవిశ్వాసం పెరుగుతుంది – మనపై మనకు నమ్మకం వస్తుంది.
*స్వేచ్ఛ – ఫ్రీలాన్స్/బిజినెస్ అవకాశాలు ఎక్కువhttps://digitaldasaradh.com/highest-credit-score/?preview_id=4875&preview

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *