Startup Vs Business Vs Job Vs Content Creator Vs freelancer!

Startup Vs Business Vs Job Vs Content Creator Vs freelancer!

Spread the love

Startup Vs Business Vs Job Vs Content Creator Vs freelancer!

Startup Vs Business Vs Job Vs Content Creator Vs freelancer!

ఇప్పుడు వున్న పోటీ ప్రపంచంలో యువతకు లైఫ్ పైన చాల ఆలోచనలు వస్తువుంటాయ్. బిసినెస్ చేయాలన లేదంటే జాబ్ చేయాలన స్టార్టుప్ పెట్టాలని ఇలా చాల కోరికలు ఉంటాయి. కానీ ముందుకు అడుగు వేయడానికి భయపడుతుంటారు. బిజినెస్ చేస్తే లాభాలు వస్తాయా రావో లేదంటే, జాబ్ చేస్తే ఇలా ఎన్నిరోజులు ఒకరి కింద చేయాలనీ, అదే స్టార్టుప్ పెడతామంటే కంపెనీ గ్రోత్ అవుతుందో లేదో ఇన్వెస్టర్స్ (పార్టనర్స్) దొరుకుతారో దొరకరో, అదే కంటెంట్ క్రియేటర్ అయితే నా కంటెంట్ అందరికి నచ్చుతుందో లేదో ఇలా చాల అనుమానాలు ఉంటాయి. అందుకే వాటిపైన కొంత అవగాహనా అవసరం. కొంత మేర అవగాహనా వచ్చినాక ఏది బెస్ట్ అనేది మీకు తెలుస్తుంది.laptop offers కోసం https://amzn.to/3MekHcf

స్టార్టుప్/startup :

ఇందులో మనకే మనమే బాస్ చాల ఫ్రీడమ్ ఉంటుంది. స్టార్టుప్ బిల్డ్ చేయడం చాల చాల కష్టంతో కూడుకున్న పని. పేపర్ లోనో పోడ్కాస్ట్ లో చూసినంత ఈజీ కాదు.స్టార్టప్ అంటే కొత్త ఆలోచన (Innovation) లేదా కొత్త సమస్యకు ప్రత్యేక సొల్యూషన్.స్టార్టప్‌లు సాధారణంగా చిన్న టీమ్‌తో మొదలవుతాయి. మొదట ఫండ్స్ స్వల్పంగా ఉన్నా, మంచి ఐడియా ఉంటే ఇన్వెస్టర్లు, ఏంజెల్ ఇన్వెస్టర్లు, వెంచర్ క్యాపిటల్ ద్వారా పెద్ద పెట్టుబడులు పొందవచ్చు. అందుకే స్టార్టప్‌లకు రిస్క్ ఎక్కువే—కాని విజయం సాధిస్తే రివార్డ్స్ కూడా చాలా పెద్దవిగా ఉంటాయి.స్టార్టప్‌లో పనిచేయడానికి క్రియేటివిటీ, రిస్క్ తీసుకునే ధైర్యం, కష్టపడి పనిచేసే నైపుణ్యం, మరియు దీర్ఘకాలం విజన్ చాలా అవసరం. సమాజంలో కొత్త మార్పులు తీసుకురావాలనుకునే యువతకు స్టార్టప్ మంచి దారిగా మారుతుంది.

స్టార్టుప్/startup లోపాలు:

స్టార్టుప్ బిల్డ్ అయినా తరువాత ఫండింగ్ వస్తుంది. ఇన్వెస్ట్ చేసే వారు చాల మంది వస్తుంటారు. ఇన్వెస్టర్స్ కొంత మంది ఫ్రెండ్లీగా వుంటారు కొంత మంది ప్రెషర్ పెటుతుంటారు, ఆ ప్రెషర్ తట్టుకోవాలి. కొన్ని సార్లు ఫండింగ్ రాదు వచ్చినవరకు ఎదురువెళ్లాలి. ఓపిక ఉండాలి అవమానాలు తట్టుకోవాలి. టీంని మేనేజ్ చేయాలి, క్లయింట్ ని మేనేజ్ చేయాలి. vendors ని మేనేజ్ చేయాలి. చాల మంది అప్పులు చేసి స్టార్టుప్ లు పెటుతుంటారు.కొంతమందికి రెండు మూడు దెబ్బలు తగులుతుంటాయ్.Swiggy, Zomato, Ola, OYO వంటి కంపెనీలు మొదట చిన్న స్టార్టప్‌లుగానే ప్రారంభమయ్యాయి.

బిజినెస్ / business :

బిజినెస్ అంటే ప్రజలకు అవసరమైన ఉత్పత్తులు లేదా సేవలు అందించి, దాని ద్వారా లాభం సంపాదించడం. ఇది మన జీవితంలో భాగమైన నిత్యావసరాలు, మార్కెట్ డిమాండ్, కస్టమర్ అవసరాలు ఆధారంగా నడిచే స్థిరమైన వ్యాపార మోడల్. బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా, ప్రధాన లక్ష్యం కస్టమర్‌కు విలువ (Value) ఇవ్వడం.

బిజినెస్‌ను ప్రారంభించడానికి ప్రత్యేకంగా పెద్ద టెక్నాలజీ అవసరం లేదు. ఒక కిరాణా షాప్, ఫుడ్ హోటల్, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ, ఇంటీరియర్ డిజైన్ కంపెనీ, హౌస్ కన్స్ట్రక్షన్ సర్వీస్ — ఇవన్నీ బిజినెస్‌లే. బిజినెస్‌లో రిస్క్ ఉంది, కానీ స్టార్టప్‌లతో పోలిస్తే తక్కువ. బిజినెస్‌లో విజయం పొందడానికి సహనం, క్రమశిక్షణ, మరియు కస్టమర్ నమ్మకం చాలా అవసరం.రోజురోజుకూ స్థిరమైన ఆదాయం సంపాదించాలనుకునే వారికి బిజినెస్ మంచి మార్గం. క్రమంగా పెంచుకుంటూ వెళ్లితే, చిన్న బిజినెస్ కూడా ఒక పెద్ద బ్రాండ్‌గా మారే అవకాశం ఉంది.

ఫ్రీలాన్సర్ /freelancer అంటే ఏమిటీ ?

ఫ్రీలాన్సర్ అంటే ఒక సంస్థలో ఫుల్‌టైం ఉద్యోగిగా కాకుండా, స్వతంత్రంగా (Independent) క్లయింట్లకు సేవలు అందించే వ్యక్తి. ఫ్రీలాన్సర్‌కు కంపెనీ బాస్ ఉండడు; అతడే తనకు తానే బాస్. తన నైపుణ్యాలను ప్రాజెక్ట్ ఆధారంగా వివిధ కస్టమర్లకు అందించి, దాని ద్వారా ఆదాయం సంపాదిస్తాడు.Fiverr, Upwork, Freelancer.com, LinkedIn వంటి ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్లయింట్లను పొందొచ్చు. ఫ్రీలాన్సింగ్‌లో మన సొంత బ్రాండ్‌ని నిర్మించుకునే అవకాశం కూడా ఉంటుంది.

ఫ్రీలాన్సింగ్‌లో ప్రధాన ఆకర్షణ టైమ్ ఫ్రీడమ్ మరియు లోకేషన్ ఫ్రీడమ్. ఎక్కడ ఉన్నా పని చేయొచ్చు — ఇంట్లోనుండి, క్యాఫే లోనుండి, లేదా ట్రావెల్ చేస్తూ కూడా. ఫ్రీలాన్సర్‌గా ఎక్కువగా అందించే సేవలు: గ్రాఫిక్ డిజైన్, డిజిటల్ మార్కెటింగ్, వెబ్ డెవలప్మెంట్, కాంటెంట్ రైటింగ్, వీడియో ఎడిటింగ్, SEO, సోషల్ మీడియా మేనేజ్మెంట్ మొదలైనవి.

ఫ్రీలన్సర్/freelancer లోపాలు :

ఎదో ఒక స్కిల్ అవసరం(ex : డిజిటల్ మార్కెటింగ్ / గ్రాఫిక్ డిజైన్/వీడియో ఎడిటింగ్….). క్లయింట్ మేనేజ్మెంట్ అవసరం. క్లైంట్ ని ఎలా పట్టుకోవాలి. మనకు నచ్చిన క్లయింట్ ని ఎంచుకోవచ్చు. క్లయింట్ తో వర్క్ చేపించుకోవడం ఎలా, క్లయింట్ నుంచి మనీ(అమౌంట్) తీసికోవడం ఎలా. మెయిన్ వీటిలో ఇవి తెలిసికోవాలి. ముందుగా ఫ్రీలన్సర్ చేయాలంటే పోర్టుఫోలియా ఉండాలి. ఒకసారి సక్సెస్ అయినాక మంచి ఎమౌంట్ వస్తుంటది.

Job /జాబ్ అంటే ఏమిటీ :Startup Vs Business Vs Job Vs Content Creator Vs freelancer!

జాబ్ అంటే ఒక కంపెనీ, సంస్థ లేదా ప్రభుత్వ విభాగంలో ఉద్యోగిగా పనిచేసి, దానికి ప్రతిఫలంగా ఫిక్స్‌డ్ సాలరీ పొందడం. ఇది అత్యంత సాధారణమైన కెరీర్ మార్గం. జాబ్‌ లో పని – జీతం ఎక్స్‌చేంజ్ మోడల్ ఉంటుంది, అంటే మీరు పనిని జరిపిస్తే కంపెనీ మీకు జీతం చెల్లిస్తుంది.జాబ్‌లో ప్రధాన ఆకర్షణ స్థిరత్వం (Job Security). ప్రతిరోజు పనిచేసే గంటలు నిర్ణయించబడి ఉంటాయి, పని బాధ్యతలు క్లియర్ గా ఉంటాయి, మరియు ప్రతి నెలా జీతం క్రమంగా వస్తుంది. కాబట్టి కుటుంబ బాధ్యతలు ఉన్నవారికి, రిస్క్ తీసుకోను అనుకునేవారికి జాబ్ మంచి ఆప్షన్.

అయితే, జాబ్‌లో టైమ్ ఫ్రీడమ్ తక్కువ. కంపెనీ రూల్స్‌ను ఫాలో అవాలి, టార్గెట్స్ చేరాలి, మరియు గ్రోత్ కూడా సాధారణంగా నెమ్మదిగా జరుగుతుంది. ప్రమోషన్స్, జీతం పెరుగుదల వంటి అంశాలు అనుభవం మరియు పనితీరు మీద ఆధారపడి ఉంటాయి.జాబ్‌లో పని చేయడం ద్వారా మనకు డిసిప్లిన్, కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్ వర్క్ వంటి నైపుణ్యాలు పెరుగుతాయి. IT, బ్యాంకింగ్, టీచింగ్, మార్కెటింగ్, సేల్స్, హెల్త్‌కేర్ — ఇలా ప్రతి రంగంలో జాబ్ అవకాశాలు ఉంటాయి.

కంటెంట్ క్రియేటర్ అంటే ఏమిటీ?

కంటెంట్ క్రియేటర్ అంటే ఇంటర్నెట్‌లో వీడియోలు, బ్లాగులు, ఫోటోలు, రీల్స్, ఆర్టికల్స్, పాడ్‌కాస్ట్‌లు లాంటి కంటెంట్ తయారు చేసి ప్రజలకు అందించే వ్యక్తి. సోషల్ మీడియా యుగంలో కంటెంట్ క్రియేటర్స్ అంటే ఒక పెద్ద శక్తిగా మారారు. వీరి లక్ష్యం ప్రజలకు విలువైన సమాచారం, ఎంటర్టైన్‌మెంట్, ఎడ్యుకేషన్, లేదా ఇన్‌స్పిరేషన్ అందించడం.

కంటెంట్ క్రియేటర్‌గా పనిచేయడం అంటే కేవలం ఒక వీడియో చేయడం కాదు; దాని వెనుక రిసర్చ్, క్రియేటివిటీ, ఎడిటింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, మరియు constancy  అవసరం. YouTube, Instagram, Facebook, Websites, Podcasts వంటి ప్లాట్‌ఫార్మ్లు కంటెంట్ క్రియేటర్స్‌కు పెద్ద అవకాశాలు ఇస్తాయి.

content క్రియేటర్ ఆదాయం ఎలా ?

కంటెంట్ క్రియేటర్ ఆదాయం ముఖ్యంగా Ad Revenue, Sponsorships, Affiliate Marketing, Brand Deals, Courses, మరియు Paid Promotions నుంచి వస్తుంది. మొదట్లో గ్రోత్ కొంచెం స్లోగా ఉన్నా, క్రమం తప్పకుండా క్వాలిటీ కంటెంట్ ఇస్తే పెద్ద ఆడియన్స్‌ను పొందవచ్చు.కంటెంట్ క్రియేటర్‌గా ఉండటం వల్ల టైమ్ ఫ్రీడమ్, క్రియేటివిటీ ఫ్రీడమ్, మరియు ప్రపంచవ్యాప్తంగా మన ఆలోచనలను పంచుకునే అవకాశం లభిస్తుంది. ఇది ఒక కెరీర్‌గానే కాక, వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకునే మార్గం కూడా.

content క్రియేటర్ కష్టాలు :Startup Vs Business Vs Job Vs Content Creator Vs freelancer!

ఇది uncertainly field, ఎప్పుడు క్లిక్ అవుతామో చెప్పలేము,స్టార్ట్ చేయడం చాల ఈజీ. ఒకసారి ఒక వీడీయో తో సక్సెస్ అవ్వచ్చు లేదా ఒక ఆర్టికల్ తో సక్సెస్ అవ్వచ్చు అది మనం చెప్పలేము. సొసైటీ లో మంచి పేరు ఉండదు. స్పాన్సర్స్ ని వెతికికోవాలి. వీడియోస్ చూడడం చాల ఈజీ చేయడం చాల కష్టం. ఈ మధ్యన ఎవరిని అడిగిన నిను youtuber ని అవుతాను కంటెంట్ క్రియేటర్ ని అవుతాను అని చెప్పికుంటున్నారు. అంత డిమాండ్ వుంది.

Digital Marketing Services In Vizag:

ఈ రోజుల్లో వ్యాపారం విజయవంతం కావాలంటే కేవలం మంచి ప్రోడక్ట్ లేదా సర్వీస్ ఉండటం సరిపోదు. డిజిటల్ మార్కెటింగ్ తప్పనిసరి. ముఖ్యంగా విశాఖపట్నం (Vizag) వంటి వేగంగా ఎదుగుతున్న నగరంలో, ఆన్‌లైన్ ప్రెజెన్స్ లేకుండా మార్కెట్లో నిలబడటం కష్టమవుతోంది.ఇంటర్నెట్, మొబైల్, సోషల్ మీడియా, సెర్చ్ ఇంజిన్లు, ఈమెయిల్, వెబ్‌సైట్‌లు, ఆప్స్ మొదలైన “డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ ” ద్వారా ఉత్పత్తులు లేదా సేవలను ప్రచారం చేయడమే మా ఉద్దేశం.

digitaldasaradh.com:

DigitalDasaradh.com అనేది  ఒక నమ్మకమైన సంస్థ .ఈ  సంస్థ Google Ads & PPC Service Provider in Vizag. SEO, SMM, Web Design, Content Marketing తో పాటు, “Digital marketing” లోనూ మంచి ఫలితాలు ఇచ్చే విధంగా పనిచేస్తుంది.

మీ వ్యాపారం Googleలో Top Position లో కనబడాలంటే, మరియు Quick Leads & Sales కావాలంటే మమ్మల్ని DigitalDasaradh.com ను సంప్రదించండి.వైజాగ్ లో వ్యాపారాలు డిజిటల్ రంగంలో ముందంజ వేయాలంటే “Digital Marketing’ అనేది తప్పనిసరి.best laptop కోసం https://amzn.to/3VsQec3

  

 

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *